Tuesday, 20 March 2012

అమ్మకాల బొమ్మని

అమ్మకాల నడుమ నలిగే ప్రాణమున్న రాతి బొమ్మని,
భరించేవాడు వెలకడుతుంటే,
కన్నవాళ్ళు ఆ ధర చెల్లిస్తున్నారు,
ఏమాత్రం ఇది న్యాయం?
నిజానికి, నీతికి వున్న తేడా చెప్పిన పెద్ద వాళ్ళే,
ఇది పాపం అని తెలిసిన నాకు ధర చెల్లిస్తున్నారు.
నన్ను కట్టుకోబోయే వాడు ఇనుప ముక్కలతో చేసిన ముళ్ళతో నా మనసు చంపేస్తున్నాడు,
కట్నం పేరుతో తనను తాను వంచించుకొంటున్నాడు.
ఎక్కడ పుట్టింది ఈ దురాచారం?
ఎందుకు మన దేశానికి పట్టుకొమ్మ అయ్యింది.
ఉన్నవారి దగ్గరనుండి లేనివారు అనే భేదం లేకుండా అందరికి నట్టిల్లయ్యింది.
మన శరీరానికి చిన్న వ్యాధి వస్తేనే బాగుచేయడానికి నానా రకాలుగా  ప్రయత్నిస్తాం------
మరి మనసు మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం.
మరి మనసుకు పట్టిన వ్యాధిని తొలగించలేమ......?
ఇది చాలా మహమ్మారి,
 ఈ వ్యాదికి బలైన వారు ఎదుటి వారి ప్రాణాలు సునాయాసంగా తీయగాలుగుతున్నారు.
భారతీయుడా ఈ మహమ్మారిని మన దేశం నుండి తరిమి కొడదాం.
దయ చేసి సహకరించండి.

అమ్మ ప్రేమ------------

పోదున్నే తన చిరునవ్వుతో నాకు సుబోధయం చెబుతుంది.
నాకేం కావాలో నేను నిద్దుర లేవక ముందే అన్నీ నాకు సమకూరుస్తుంది.
ప్రేమగా నాకు స్నానం చేపించి సుబ్రత గురించి నేర్పుతుంది.
శ్రమ అనుకోకుండా తోటివారితో నేను ఎలా మెలగాలో ప్రతి రోజు చెబుతుంది.
బడి నుండి ఇంటికి వచ్చేసరికి నాకోసం గుమ్మం ముందే వేచి వుంటుంది.
అమ్మని చూడగానే పరుపరుగున వచ్చి అమ్మ వెచ్చని గుండెపై వాలిపోతాను.
అమ్మ అమాంతం నన్ను అలాగే ఎత్తుకొని ఇంటిలోపలికి తీసుకెళ్ళి,
నాకు కథలు చెప్తూ గోరుముద్దలు తినిపిస్తుంది.
సరస్వతి దేవిలా నాకు చదువు చెబుతుంది.
చీకటి పడిన వేల తన నవ్వులో వెలుగు నింపి, 
ప్రేమతో నా తలపై తన చేయిపెట్టి నిమురుతూ  నన్ను నిద్రపుచ్చుతుంది.
ఇది మనకు తెలుసు ఎందుకంటే మనము అమ్మ ప్రేమను చవిచూసాము...............!
కాని పాపం అనాదాస్రమంలో అభం శుభం తెలియని పసిపిల్లకు ఇవి కధలుగానే తెలుసు.
మనకున్న సమయంలో ఎంతో కొంత క్షణాలను వారికోసం నియమిద్దాం.
మనలో వున్న మానవత్వాన్ని నిద్రపోనీయకండి.
దయచేసి మేల్కొలపండి.

అమ్మ ప్రేమ

అమ్మ ప్రేమ మాటల్లో చెప్పలేము,
అది అనంతం, కాని శాశ్వతం.
కంటిరెప్పల మద్యన దాగిన కనుపాపలో మనకు చోటిస్తుంది.
చీకటి వేల జాబిలమ్మలా వెలుగు చూపిస్తుంది.
మన నీడలా కాకుండా తన చివరి శ్వాసవరకు మనతో వుంటుంది.
అమ్మ ప్రేమలో కమ్మదనాన్ని  చెప్పడం కంటే,
అమ్మ అని పిలిచే పిలుపుతో నీకే తెలుస్తుంది......నేస్తమా




emotional songs:మరణించే క్షనమునా














(ఒకరి చేయి మనం అందుకునే సమయంలో మన ప్రాణాలు పోతుంది అని తెలిసినపుడు మనం ప్రేమించిన వ్యక్తికి తెలపలేక, తనకు జీవితాంతం తోడుగా వెళ్ళలేక పడే నరకమే ఈ పాట......)


మరణించే క్షనమునా,
నే కోరనా వరమునే.
నీ చిరునవ్వు ముందరే,
నా శ్వాస వదలాలని.
నీ కనుపాపా నీడనే,
పసిపాపల్లే కనుమూయాలని.
ప్రేమలో గెలుపు నాదిలే,
కడవరకు నీతోడు రాలేనులే.
ప్రియతమా....... మన్నించవే…………..
నేరమే నాది కాదులే………………………….!
ప్రియతమా మన్నించవే…………..
నా ఆసలే ఇక అంతమే………………………….!


నీ కష్టమే నాదనుకోనా
నీ కన్నీరే చూడలేననుకొన్నా   
నీ చిరునామా నేననుకొన్నా
నీ తోడుగా వుమ్దాలనుకొన్నా
నీ అడుగులో అడుగు వేయాలనుకొన్నా
నీ ఊపిరే గుండెలో దాచుకొన్నా 
అన్నీ నా సొంతం అనుకొన్నా
నిన్ను ఒంటరిని చేసి వెళిపోతున్నా 
ప్రియతమా....... మన్నించవే…………..
నేరమే నాది కాదులే………………………….!
ప్రియతమా మన్నించవే…………..
నా ఆసలే ఇక అంతమే………………………….


కరిగిపోయీ కాలంలో,
నిలవలేని క్షణమే నేను…
నీటిపైన రాత ఎంటే,
నా పిచ్చి మనసుకు అర్థం కాలేదే….
పాపమేమీ చేసానే,
శాపమే తగిలేనే….
ఆయువీ కావాలన్నా,
అదే కనుక అడిగాడే ఆ దేవుడు……..
వెళ్ళిపోతున్నా వెళ్ళలేక,
దురమైపోతున్నా బ్రతకలేక……..
ప్రియతమా....... మన్నించవే…………..
నేరమే నాది కాదులే………………………….!
ప్రియతమా మన్నించవే…………..
నా ఆసలే ఇక అంతమే………………………….

Friday, 16 March 2012

జానపదం

నల్లమబ్బుల సాటూనా తుమ్మెదా, 
సల్లాని సినుకంటా తుమ్మెద.

నను సల్లంగా తాకింది తుమ్మెదా,
ఎన్నో విసయాలే సెప్పింది తుమ్మెద.

ఎన్నెల్లో పైరు తుమ్మెదా,
నా చారెడు కళ్ళంది తుమ్మెద.

పూసేటి పూలంతా తుమ్మెదా,
నా సక్కాని నవ్వంది తుమ్మెద.

నెలవంక సొగసంతా తుమ్మెదా,
నా మనసంటూ కవ్వించే తుమ్మెద .

నన్ను తాకి తాకంగానే తుమ్మెదా,
నేలమ్మ మురిసేనంది తుమ్మెద.

అందాల రాముడే తుమ్మెదా,
నన్ను మనువాడే జోడంది తుమ్మెద. 

నల్లమబ్బుల సాటూనా తుమ్మెదా, 
సల్లాని సినుకంటా తుమ్మెద.

నను సల్లంగా తాకింది తుమ్మెదా,
ఎన్నో విసయాలే సెప్పింది తుమ్మెద.

నల్లమబ్బుల సాటూనా తుమ్మెదా, 
సల్లాని సినుకంటా తుమ్మెద.