Friday, 26 October 2012

love poetry: చిలిపి ప్రేమ:

చిలిపి ప్రేమ:

కొంత మంది అబ్బాయిలు ప్రేమిస్తున్నాం అని చెబితే అమ్మాయిలు  ఎక్కడ కాదంటారో  అని, ప్రేమిమించట్లేదు అని అంటూనే తమ ప్రేమను తెలుపుతారు. అది ఎలాగో తెలుసా?

నీదేమైన నెలవంక అందం అనుకొంటున్నావా, ఎదో! నాకళ్లకు ఒక తారలాగా కనపడ్డావు.
నీ నడక చూసే నెమలి నడవడం నేర్చుకొంది అనుకుంటున్నావా, ఏదో! తులకరి జల్లుల్లా అనిపించింది.
నీ నవ్వులో ఏమైనా పగడ కాంతులు దాగుందా, ఏదో! ముత్యపు మెరుగులా అనిపించింది.
నిన్నేమైన ప్రేమిస్తున్నాను అని నువ్వు బ్రమపడుతున్నావేమో, ఏదో నచ్చావు అంటున్నా అంతే.

Wednesday, 24 October 2012

AADAPILLA

అనుబందాలకు తొలి బందం అమ్మ.
నేను చూసిన మొదటి మోము అమ్మ. 
నా జీవితపుతొలి అడుగు అమ్మ అందించిన తన చేతి చూపుడువేలు.
స్వచ్చమైన  ప్రేమ మొదటిసారిగా మా అమ్మ నన్ను చూస్తూ నుదుటిపైన పెట్టిన తొలిముద్దు.
నేనున్నా అని దైర్యం చెప్పేది అమ్మ ఒడి.

కేవలం నేను ఆడపిల్లని అని, నన్ను ఈ బావాలకు దూరం చూస్తూ నీ పొత్తికడుపులోనే నాకు  సమాధి కడుతున్నావా అమ్మా?
ఈ ప్రపంచానికి నేను ఏమి కాకపోవచ్చు, కాని నేను 
నీ గుండె చప్పుడుతో ఊపిరి పోసుకున్న నీ రూపాన్ని అమ్మ!
నీ గుండె చప్పుడే నాకు ఊపిరి!
నీ పొత్తి కడుపే నాకు ప్రపంచం!
అలాంటిది నీరూపు చూడకుండా నన్ను ఎలా కన్ను ముయమంటావు అమ్మా!
నీ ఆలోచనలలోనూ నేను వున్నాను.
నన్ను చంపాలి అని నువ్వు అనుకొన్నప్పుడే నేను నిజంగా చనిపోయాను.
నువ్వు బుజ్జగించి తినిపించే పాల బువ్వ రుచి చూడాలని వుంది.
నేను చేసే అల్లరి గురించి నువ్వు పదిమందితో చెప్పి నవ్వుకుంటుంటే వినాలని వుంది.
కాని నాకు ఇవ్వన్నీ ఎందుకు  దూరం చేస్తున్నావు అమ్మా.
ఆడపిల్ల కుడా ఒక మనిషే అని నువ్వే నాకు గుర్తింపు ఇవ్వనపుడు ఈ ప్రపంచం ఎలా నన్ను ఆదరిస్తుంది అమ్మా.