Friday, 23 December 2011

amma poetry: తొలి స్పర్శ
























తొలి స్పర్శ

భరించలేకపోతున్నా నేను పురుటినొప్పులతో!
నా పొత్తిల్లు నుండి నువ్వు బయట ప్రపంచానికి రావాలి,
అని నువ్వు నా కడుపులో చేస్తున్న విహంగం,
తట్టుకోలేకపోతున్నా నా చిట్టి తండ్రి. 
తొమ్మిదినెలలు నా గుండె చప్పుడుతో 
రక్తపు ముద్దకు ఊపిరిపోసి, రూపం ఇచ్చి 
నీరాకకై ఎదురు చూస్తున్న సమయం 
నా ప్రాణం పోతున్నంత బాధగా అనిపించింది నా కన్నా!
కాని బయట ప్రపంచానికి వచ్చిన నిన్ను 
నేను తొలిసారిగా తాకిన సమయాన 
నా బాధ అంతా మరిచి మనసు నిండా సంతోషంతో నిన్ను చేరదీసానురా? 
                                                  నా ప్రాణమా! 



Wednesday, 21 December 2011

love poetry:నా కృష్ణయ్యా



నా  కృష్ణయ్యా  

తొలి చినుకుల చిరుజల్లులలో 
నీ మురళీ గానపు స్వరాలలో 
నీ చూపు నన్ను వెచ్చగా తాకే వేళలో 
నీ శ్వాస నా గుండెని తాకే క్షణంలో 
మనసులోని గుబులుకు రెక్కలొచ్చి ఎరిరే హాయిలో 
నీ కోసం నా ప్రాణం అని తెలుపుతున్నా కన్నయ్యా....................!


Tuesday, 20 December 2011

love song:మౌనాల వెంట స్వప్నాల వేట




పల్లవి:
మౌనాల వెంట స్వప్నాల వేట
నీ మనసు వెంట నా ప్రేమ వేట 
నా ఆశల్లో నువ్వే ఉన్నావు అంట 
నా మాటల్లో నువ్వే దాగావు అంట 


చరణం 1:
గుసగుసలతో నా గుండె నీ కోసమే కొట్టుకుంటుందే 
లోలోన దాగిన ఆ మాట కాస్త చెప్పెయ్యమంటోందే 
ఆ విషయం చెప్పాలి అంటూ నీ దాక చేరేదాక
కంగారు పుట్టిస్తుందే నా పిచ్చి మనసే 
చిలిపి రహస్యాల తగాదాల వయసులో 
నన్ను ఉడికించి చంపేస్తోందే నామనసే

 మౌనాల వెంట స్వప్నాల వేట
నీ మనసు వెంట నా ప్రేమ వేట 


చరణం 2:
చెప్పాలని వున్నా చెప్పలేను అంటూ 
నిమిషం, క్షణం అంటూ ఎన్ని రోజులు గడపానో 
కరిగే రేయి, పగలు ఎన్ని నను దాటి వెళ్ళాయో 
అయినా చెప్పలేకపోతున్నా ఆ మదుర బావం 
ఏమంటావో, ఏమో అంటూ అనుమానం కలుగుతుందే 
నా మాటల్లో నువ్వే ఆ బావం తెలుసుకొవే అమ్మాయి 

మౌనాల వెంట స్వప్నాల వేట
నీ మనసు వెంట నా ప్రేమ వేట 
నా ఆశల్లో నువ్వే ఉన్నావు అంట 
నా మాటల్లో నువ్వే దాగావు అంట 





MOTHER POETRY: మా అమ్మ



















మా అమ్మ

తన్మయత్వంతో పరవసించిన నా తల్లి
నన్ను అక్కున చేర్చుకొని 
తన గుండె చప్పుడుని నాకు జోలపాటగా వినిపిస్తుంటే అది ఎంతో ఆనందం.

నా లేత పాదాలు 
అడుగులు వేస్తే కందిపోతుందని
తన యదనే నాకోసం రహదారి చేసింది అమ్మ.


తన పోత్తికడుపునే నాకోసం ఆయువుపీటంగా మార్చి
తొమ్మిది నెలలని సంతోష క్షణాలుగా మార్చి 
నా కోసం ఎదురు చూసింది అమ్మ.

తన బంగారు బిడ్డపై ఎవరి దిష్టికల్లు పడకూడదు అని 
తన కోమలమైన కళ్ళకు దిద్దిన కాటుకని
నా లేత చెక్కిలిపై బొట్టు పెట్టింది అమ్మ.

తన తియ్యటి స్వరంతో 
నా గొంతుకు మాటలు నేర్పి
అమ్మ అన్న పిలుపులో వున్న మాడుర్యాన్ని నాకు తెలిపింది అమ్మ.


ప్రేమకు ప్రాణం పోసి 
ఆప్యాయతకు రూపుదిద్ది 
బందానికి అర్థం చెప్పే
మారు పేరు అమ్మ.








Monday, 19 December 2011

love poetry: తన రాక నాకోసం










తన రాక నాకోసం

చలి మంచు వెన్నెల కౌగిట్లో
తెర చాటున వున్న నా ప్రియుడి శ్వాస
చిరుగాలి తాకిడిలో వెచ్చదనం నింపి
నాకు తన రాకను తెలియ చేస్తున్నాడే-----ఓ మనసా 


Wednesday, 14 December 2011

love failure song:ఓటమే నాకు నేస్తమే



























పల్లవి 
ఓటమే నాకు నేస్తమే 
సుడిగుండమే నాగమ్యమే  
ఓ ప్రేమా చంపకే 
నా కళ్ళల్లో కన్నీరే ఇంకెనే
నువ్వులేని నా ఆ నిమిషం                              
నా మనసే చనిపోవునే 



ఓటమే నాకు నేస్తమే 
సుడిగుండమే నాగమ్యమే


చరణం:1
గడిచిన కాలంలో 
మన కధ జ్ఞాపకమే 
మనం నడిచిన దారులే 
నా నీడై వెంటాడుతు వుందే   
ప్రతి పువ్వు అందము 
నిన్నే తలపిస్తూ వుందే  
ఈ కాలాల సవ్వడిలో 
నీ నవ్వే వినిపిస్తుందే 
మరపురాని నా మనసుకు 
మరణమే నేర్పావే 

ఓ ప్రేమా చంపకే 
నా కళ్ళల్లో కన్నీరే ఇంకెనే
నువ్వులేని నా ఆ నిమిషం                                                           
నా మనసే చనిపోవునే



చరణం- 2 

నా ప్రాణంలో కలిసావే 
బ్రతుకంతా నీతో అన్నావే
కధలెన్నో చెప్పావే
ఊహల్లో నిలిచానే 
శ్రుతి తప్పిన రాగమే 
గాలిలోన దీపమే 
మరుజన్మలోనైనా నువ్వు 
నన్ను ఒంటరి చేయకే 
నిన్ను బ్రతిమాలె సమయాన
నా బ్రమలె వీడినా 



ఓ ప్రేమా చంపకే 

నా కళ్ళల్లో కన్నీరే ఇంకెనే
నువ్వులేని నా ఆ నిమిషం                                                
నా మనసే చనిపోవునే 
ఓ ప్రేమా చంపకే----------
ఓ ప్రేమా చంపకే----------
ఓ ప్రేమా చంపకే----------



love failure poetry: చంపావే నీ ఒక్క మాటతో

చంపావే నీ ఒక్క మాటతో


నీ గుండెలోని ఆశలకు నేనే ఊపిరి అన్నావే 
నీ కళ్ళలోని వెలుగుకు నా ఊపిరే దారన్నావే 
నీ కలకాలం జీవితానికి నా నవ్వే కానుక అన్నావే 
ఈ క్షణం నా పరిచయమే చేదంటూ దూరంగా నన్నే నేట్టావే -------న్యాయమా?

Wednesday, 7 December 2011

love failure గుండె బారం





























గుండె బారం 


బరువెక్కిన మనసుతో భరించలేకపోతున్నా 
ఒంటరి అన్న మాటకు దాస్సోహం కాలేకున్నా 
కష్టాల కడలికి నా కళ్ళు అంకితమయ్యింది 
నా నీడకే నేను చేదు జ్ఞాపకంగా మగిలాను. 

Sunday, 4 December 2011

love poetry:నీ వాలు చూపు































నీ వాలు చూపు 

కను పాప చాటున దాచానే నీ రూపం 
మనసు చప్పుడులో కలిసిందే నీ జ్ఞాపకం 
నా లేత పెదవిలో అల్లుకపోయిందే నీ నామం 
నా నీడలోను నిన్ను తలపిస్తోందే నా పరువం 


Saturday, 3 December 2011

love poetry: నీ కోసం

నీ కోసం 

నీ చిలిపి కళ్ళలో చెప్పలేని రహస్యాలు ఎన్నో, 
నీ పెదవి పరదాల చాటున దాగిన మాట ఏమిటో,
నీ మనసు లోతున నిలిచిన ఊహల పరవళ్ళు ఎన్నో,
నీ పరద్యనంలో దాగిన గుసగుసలకు అర్థం ఏమిటో,
నీ చేతి వేళ్ళు తాకే భాగ్య క్షణం ఎప్పుడో........చెలి 

Friday, 2 December 2011

love poem: తామర శిల్పాన్ని







తామర శిల్పాన్ని

అందాల పాలరాతి బొమ్మని
నీలి మేగాల క్రింద దాగిన వెన్నలమ్మని
నీటిలోన దాగిన ముత్యపు రవ్వని
చిగురాకులలో దాగిన లేలేత అందాన్ని 
మురళిలో దాగిన రాగాన్ని 
గాలిలో దాగిన శ్వాసని
మువ్వలలో దాగిన  అందెల చప్పుడుని 
నీకోసమై కదలివచ్చిన నెమలి పించాన్ని
చేయి చాచి అందుకో నాచేతిని----------ప్రియా