Friday, 23 December 2011

amma poetry: తొలి స్పర్శ
























తొలి స్పర్శ

భరించలేకపోతున్నా నేను పురుటినొప్పులతో!
నా పొత్తిల్లు నుండి నువ్వు బయట ప్రపంచానికి రావాలి,
అని నువ్వు నా కడుపులో చేస్తున్న విహంగం,
తట్టుకోలేకపోతున్నా నా చిట్టి తండ్రి. 
తొమ్మిదినెలలు నా గుండె చప్పుడుతో 
రక్తపు ముద్దకు ఊపిరిపోసి, రూపం ఇచ్చి 
నీరాకకై ఎదురు చూస్తున్న సమయం 
నా ప్రాణం పోతున్నంత బాధగా అనిపించింది నా కన్నా!
కాని బయట ప్రపంచానికి వచ్చిన నిన్ను 
నేను తొలిసారిగా తాకిన సమయాన 
నా బాధ అంతా మరిచి మనసు నిండా సంతోషంతో నిన్ను చేరదీసానురా? 
                                                  నా ప్రాణమా! 



2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. Talli tana biddani kanataaniki padey badhanta ee kavitani chadivitey arthem chesukovachu..AAdadaaniga puttatam goppa vishayamemi kaaka povachu kaani..biddaki janma nichi talliga maradam loney undi aa puttukaki sardhakata..Hats off to all mothers..

    ReplyDelete