Friday, 13 January 2012

love poetry:నీతో గడిపే క్షణం


నీతో గడిపే క్షణం 


నీ మనసులో చోటుకోసం పరుగులుతీసా,
నాపేరు నీపెదవి తాకాలని ఆరాటపడ్డా,
నా చిలిపి అల్లరికి నీవే చిరునామా కావాలని అనుకున్నా,
అన్నీ నాకు సొంతం అయ్యింది..................!
ఇప్పుడు నీతో నే గడుపుతున్న ఒంటరి క్షణం చాలు.........
నా జీవితాంతపు సంతోషానికి........ప్రియ 











Tuesday, 10 January 2012

love poetry: నీమోము















నీమోము 
వేకువ జామున సువర్ణ వర్ణమే నీమోము 
ఉదయించే కిరణమే నీ నుదిటి తిలకము
నింగి నేల నడుమ నర్తించే కుసుమమే నీ కురులు
విశాల మేఘ సోయగమే నీ కనుబొమ్మలు 
ఆకర్షిత వెలుగు రేఖాకిరణమే నీ కనుపాపలు
తులకరి జల్లే నీ గుండె తాకి వచ్చే వాయువు
సాగర జలపాతాల ఆకర్షణే నీ అధరము

Saturday, 7 January 2012

జానపదం

జానపదం

మొదటిసారి నిన్ను చూసా మాఘమాసంలోన
మనువాడ మంటే మూతిముడుచుకున్నవే 
చీర కోన్నానే నీకు చీరాల సంతలోన
మల్లెపూలు కోన్నానే నీకు మొగల్తూరులోన
తీపి-కారం కోన్నానే నీకు బందరులోన 
గాజేలెన్నో కోన్నానే గాజులపాలంలోన
ఇన్నికొన్న నాకు నీ ముతిముడుపు లంచమా పిల్లా?






Friday, 6 January 2012

LADIES POETRY:ఆడదాని బ్రతుకు అంటే ఇదా









మా ఆడవారి బ్రతుకు అంటే ఇదా: 
నా కన్నీటి చుక్క నా చెంపను తాడిమాకే తెలిసింది,
నేను ఆడపిల్లను అని.
నా పెదవికి నా కన్నవారే మౌనం నేర్పినపుడు తెలిసింది,
నేను ఆడపిల్లను అని.
నా గుండె లోతులో ఎందుకు పుట్టాను అని అనిపించినపుడు తెలిసింది,
నేను ఆడపిల్లను అని.
అన్ని పనులు నేర్చుకోవాలి అంటూ నా చదువు అపెసినపుడు తెలిసింది,
నేను ఆడపిల్లను అని.
వయసు వచ్చింది అంటూ  ఇంటినే జైలుగా మార్చి నన్నుబందిమ్చినపుడు తెలిసింది,
నేను ఆడపిల్లను అని.
బలివ్వబోయే ముందు జంతువుని అలంకరించినట్లు నన్ను పెళ్లిచూపుల పేరుతో కూర్చో పెట్టినప్పుడు తెలిసింది,
నేను ఆడపిల్లను అని.
అతవారింట్లో సేవల పేరుతో జీతం లేని పనిమనిషిగా నన్ను చూసినపుడు తెలిసింది,
నేను ఆడపిల్లను అని.
ఇంకో ప్రాణానికి నేను జన్మనివ్వబోతున్నాను అని తెలిసినప్పుడు అనిపించింది,
అది ఆడవారికి మాత్రమే కలిగిన అదృష్టం అని.
 దేవతగా ఆడవారిని పుజిస్తారు ,
అమ్మగా ఆడదాన్ని గౌరవిస్తారు,
ఒక తోబుట్టువుగా ఆడదాన్ని ప్రేమిస్తారు,
ఒక గురువుగా ఆడదాన్ని అరాదిస్తారు,
మరి బార్యగా మారిన ఆడదాన్ని ఎందుకు ద్వేషిస్తారు?
ఛీ కొట్టినా, చీదరించుకొన్నా మీ పాదాల చెంతనే చోటు కావాలని కోరుకుంటాం అందుకనా  ?

Tuesday, 3 January 2012

love poetry: ఈ కలవరం


























ఈ కలవరం 

మదిలో ఏవో ఊహలు, 
పరవళ్ళుగా మారిన కళలు,
చిత్రంగా మారిన నా ఆలోచనలు, 
ఏదో కొత్తగా నాలో మెదిలే బావాలు,
ఒంటరిగా ఉన్నా నాతో ఎవరో వున్నారనిపిస్తోంది, 
చెప్పలేని గుసగుసలు వినిపిస్తోంది,
పరువం వయసు గుర్తుచేస్తోంది,
నింగికి సొంతమైన జాబిలి నా చేతిలో ఉన్నట్లుంది,
నాకోసం ఒక శ్వాస ఎదురుచూస్తున్నట్లు వుంది,
ఈ మధుర బావాలకు అర్థం ప్రేమైతే నేను నిన్ను ప్రేమిస్తున్నాను------------నా ప్రాణమా 
  



Monday, 2 January 2012

mini story: నీ చిరునవ్వే నా కన్నీరు

నీ చిరునవ్వే నా కన్నీరు 

నీ చిరునవ్వు, నా గుండెలో కురిసే చిరుజల్లయ్యింది. నా ఆహ్వానం నీకు పంపకపోయినా, నువ్వే నా యదలో మెల్లగా చేరావు. ఊహలకు అర్థం చెప్పావు, మునుపెన్నడూ నా మనసులోలేని అలజడులలో పరవళ్ళుగా నిలిచావు, వీచే గాలిలో నీ తలపే చూపావు, కారు చీకటిలోనూ నీ రూపాన్నే నింపావు. నా ఆసలకే రానివయ్యావు. కాని................................?

                                      ఏం చేసానని, నన్ను నడి సముద్రంలో వేచి ఉన్న సుడిగుండానికి నన్ను అర్పించావు. కాలాల సవ్వడిలో నన్నో చితిమంటని చేసి ఆడుకున్నావు. వెలుగు చూపించి నన్ను మైనంలా మార్చావు. నేను నీకోసమే అని చెప్పి ఇంకొకరి కౌగిట్లో వాలిన చిలుకవు అయ్యావు. ఇది నువ్వు నాకు ఇచ్చిన బహుమతా? లేక నా జ్ఞాపకాలను సమాధి చేసి నువ్వు ఇచ్చిన వరమా. నీ మోసాన్ని మరవాలని వున్నా నీ పరిచయాన్ని మరువలేక పోతున్నా. నా గుండె చప్పులో దాగిన శ్వాస కూడా నీకోసమే ఇంకా పరితపిస్తోంది చెలి...........తిరిగి రావా నువ్వు ఇకనైనా