Thursday, 13 September 2012

love failure: మరుపన్నది నా దరి లేదే

మనసంతా కొత్తగా వుందే నిను చూసాక
గతి తప్పి మతి పోతుందే నీమాటే విన్నాక
గడుసరి కళ్ళలో బందించావే నన్నే నీ వాడిగా
హలో హలో బామా ఇదే ఇదే ప్రేమ


ఇంతలో కళగా మారిందే మన తొలి పరిచయమే 
మరుపన్నది నా దరి లేదే నువ్వే నా బ్రతుకయ్యావే 
వీచే గాలిగ మారి నా గుండెల్లో చేరావే
తియ్యటి గురుతంటే నువ్వేనని చూపావే
కాలమా - - - - - న్యాయమా 
తన జ్ఞాపకమే - - - - - చేరపకుమా 

మనసంతా కొత్తగా వుందే నిను చూసాక
గతి తప్పి మతి పోతుందే నీమాటే విన్నాక
ఇంతలో కళగా మారిందే మన తొలి పరిచయమే 

నా కనుచూపుల సైగలు వెతుకుతు వుందే నిన్నే 
దగ్గర చేరే మార్గం తెలియక మతి పోతుందే 
నీ మనసుకు నే బానిసనే తెలుసుకో 
మరు జన్మకైనా నీ దగ్గర చేరే మార్గం చూస్తానే------- 
బందమా ------- విడదీయకుమా
నేరమే----------- మాది కాదుమా

మనసంతా కొత్తగా వుందే నిను చూసాక
గతి తప్పి మతి పోతుందే నీమాటే విన్నాక
ఇంతలో కళగా మారిందే మన తొలి పరిచయమే

Friday, 7 September 2012

love failure song: నా గుండెకి కళ్ళు

నా గుండెకి కళ్ళు లేవు
కన్నీటి విలువ తెలియదు  
నా పెదవికి మనసు లేదు
ప్రేమకు అర్థం తెలియదు


స్మశాన వాటికలో సెవపేటిక ఐన నా మనసులో 
మలిచానే బొమ్మా నిన్నే నా ఊపిరిలా తెలుసుకోమ్మా 


నీ శ్వాస తాకిన నా చెలిమికి ఇవ్వలేనే వేరే పడతికి 
నిన్ను చేరని నా కళలకు దూరం నేను అయ్యానే 


వేచివున్నా నీ కోసం గమ్యంలేని దారిలో
ఒక్కసారి కరుణించవే కనుపాపై తోడొస్తా  

నా గుండెకి కళ్ళు లేవు
కన్నీటి విలువ తెలియదు  
నా పెదవికి మనసు లేదు
ప్రేమకు అర్థం తెలియదు