మనసంతా కొత్తగా వుందే నిను చూసాక
గతి తప్పి మతి పోతుందే నీమాటే విన్నాక
గడుసరి కళ్ళలో బందించావే నన్నే నీ వాడిగా
హలో హలో బామా ఇదే ఇదే ప్రేమ
ఇంతలో కళగా మారిందే మన తొలి పరిచయమే
మరుపన్నది నా దరి లేదే నువ్వే నా బ్రతుకయ్యావే
వీచే గాలిగ మారి నా గుండెల్లో చేరావే
తియ్యటి గురుతంటే నువ్వేనని చూపావే
కాలమా - - - - - న్యాయమా
తన జ్ఞాపకమే - - - - - చేరపకుమా
మనసంతా కొత్తగా వుందే నిను చూసాక
గతి తప్పి మతి పోతుందే నీమాటే విన్నాక
ఇంతలో కళగా మారిందే మన తొలి పరిచయమే
నా కనుచూపుల సైగలు వెతుకుతు వుందే నిన్నే
దగ్గర చేరే మార్గం తెలియక మతి పోతుందే
నీ మనసుకు నే బానిసనే తెలుసుకో
మరు జన్మకైనా నీ దగ్గర చేరే మార్గం చూస్తానే-------
బందమా ------- విడదీయకుమా
నేరమే----------- మాది కాదుమా
మనసంతా కొత్తగా వుందే నిను చూసాక
గతి తప్పి మతి పోతుందే నీమాటే విన్నాక
ఇంతలో కళగా మారిందే మన తొలి పరిచయమే

No comments:
Post a Comment