Monday, 31 December 2012

LADY: ఆడదాన్ని

ఆడదాన్ని  అంటూ ఆటబొమ్మనే చేసారు 
అబలనే అంటూ అమ్మనే మరిచారు 
పాలు నిండిన వక్షస్తలంనే మీ వక్రద్రుష్టితో నింపారు 
ఇంకో జీవికి ఆయువు పోసే స్త్రీ జాతి శ్వాస అపుతున్నారే రాక్షసులు 
నీకు ప్రాణం పోసింది ఓ ఆడదే అని ఎందుకో మరిచారు 
మా ఖర్మ ఫలమో మీ దృష్టి లోపమో తెలియకుందే ఈ జగతికి 
స్త్రీ పొందు కోరే ఆ స్థలమే ----! నీ జన్మ స్థలం అని మరిచావు 
ఒల్లుమరచిన మైకంలో వావివరసలు వదిలావు 
చెల్లికీ - చెలికీ భేదాన్నే నువ్వు  మార్చావు 
నీ ఆక్రుత్యాలకి గుండె భారమెక్కుతుందే ఆడజాతికి 
కనుమరుగవుతున్న స్త్రీ జాతిని చూస్తే భయంవేస్తోందే 

    
   నీకు ప్రాణం పోసే అమ్మని నేనేగా 
   నీ విజ్ఞానం పెంచే చదువులమ్మని నేనేగా 
   కష్ట-సుఖాలకు నీకు తోడునిలిచే బార్యని నేనేగా 
   నీతో దోబూచి ఆటలు ఆడే కూతురు నేనేగా 
   నీ శ్వాస నిన్ను వదిలినా నా ఒడిలో నిన్ను దాచుకొనే భూమాతను నేనేగా 



నీ జీవితాన అల్లుకొనే బందాల కలయిక స్త్రీమూర్తినిరా 
ఆరాధ్య దైవంగా కొలిచే దేవతనిరా 
నీ శృంగార వాంచ్చకి బంధాలు మరువకురా 
ఆడదాన్నిరా నేనో ఆడసక్తి అంసనురా......!













Wednesday, 12 December 2012

MINI STORY: మనిషి విలువ


ఒక రోజు నా మనసు నా కళ్ళని ఇలా అడిగింది:

మనసు:
నేను బాధపడితే నువ్వు ఏడుస్తున్నావు,
నేను సంతోషంగా వుంటే నీ కళ్ళలో ఆనందం చూస్తున్నాను.
నిన్ను నేను ఎప్పుడు తలుచుకోను....
కాని, నాప్రతి కదలికకు నువ్వే మూలంగా వున్నావు.
నీకు నాకు ఏమిటి సంబందం.

కళ్ళు:
పిచ్చి మనసా! నువ్వు నా గురించి ఆలోచించకపోతే ఏమిటి?
బందం అన్నది శాశ్వతం.
మరుపు, కోపం వీటన్నిటికి శత్రువే బంధం.
నీ ప్రతి కదలికకు నేను మూలం.
నువ్వు లేకపోతే నాకు జీవం లేదు. 
అలాగే! నేను లేకుంటే నీకు మంచి, చెడులకు బేధం తెలియదు.
ఎవరి విలువలు వాళ్లకి వున్నాయి.
ఎవరు గొప్పాకాదు, ఇందులో ఎవరు తక్కువ కాదు.