Saturday, 20 August 2011



కొత్త లోకం నాది:

చిరుజల్లులా నన్ను తాకింది ఒక శ్వాస.
ఆ క్షణం నుండి అంతా కొత్తగా వుంది.
కొత్త కొత్త అనుభవాలు ఎదురవుతోంది.
నా కోసం ఎవరో జీవిస్తున్నారనిపిస్తోంది.
ఆ బావమే ప్రేమ?


నా కనుల తెరవేనుకనే వున్నవే:

కళలా మారావే నువ్వు నా జీవితాన,
నీతో వేసిన ప్రతి అడుగు కధలా మారిందే.

నీ పరిచయవే పగటి వెన్నెల చేసి,
నా మనసును చితి మంటలో తోసావే.

భావ్యమనిపించిందా చెలీ ఈ మోసం,
నాపై చేయకు ఇక ఏ పరిహాసం-------!



నది మద్యన నా కళ: 

నీ తలపులతో ఒక్కసారిగా ఒంటరయ్యాను.
గమ్యం లేని ప్రయాణంలా వుంది నువులేని జీవితం.
నా మనసు చేసిన మోసంకు నేనే బలయ్యాను.
అనుమానం నా కళ్ళకు పొరలా అడ్డుపడింది.
ఇప్పుడు నాకు పయనం నది మద్యన వుంది.

love poetry: నా జీవితానికి అర్థంగా




నా జీవితానికి అర్థంగా వుంటావా ప్రియతమా:  
ఎలా నీ ఊహలకు నా మనసు బానిస అయ్యిందో చెప్పలేను,
కాని నా ప్రతి కదలికా నీకోసమే అని చెప్పగలను.

నిన్ను ఎలా జీవితాంతం చూసుకొంటానో  చెప్పలేను కాని,
అమ్మను సైతం నా ప్రేమతో మరిపించగలనని చెప్పగలను.

ఎలా నాలో ప్రేమ మొదలయ్యిందో చెప్పలేనుగాని,
నువ్వు లేకపోతే నా జీవితానికి అర్థం లేదని చెప్పగలను.








నేనెవరో నాకే తెలియని స్థితి:

నా గమ్యం మరిచాను,
నా ఆశ, కళ అన్నే నీవనుకున్నా.....
అందుకు నాకు మిగిలింది ఈ సముద్రమంత కన్నీరు!
ఈ అలల తాకిడి నన్ను తన కౌగిట్లోకి  పిలుస్తోంది.
నా మరణమే నాకు చేరువ కాబోతోంది.
కాని ఏదో భయం  నన్ను పిరికిదాన్ని చేస్తోంది.
బహుసా! మళ్లీ నువ్వు నాకోసం వస్తావనే ఆశే  ఏమో........   




నీ కోసమై ఎదురుచూపు :

చిరు ఆశతో నా కళ్ళు ఇంకా నీకోసమే ఎదురు చూస్తోంది,
తిరిగిరావని తెలిసినా, ఇక నీవు లేవని తెలిసినా,
నీ రూపం గాలిగా మారి నా శ్వాసలో కలిసినా,
నా మనసు నీతో సమాది అయినా,
ఇంకా నా కళ్ళలో నువ్వు తిరిగి వస్తావని చిన్న ఆశ-----------!












నింగి  నుంచి  జాలువారిన  అ నీటి  చినుకు ,
ప్రకృతి కౌగలిలో  బంధించే  చిరుగాలి ,
లేలేత  చిగురాకు  చివరంచున  ఊగిసలాడే  నీటిబిందువు,
తెల్లవారు  జామున  తామరాకుపై  వుండే  మంచు  ముత్యం  మెరుపు,
ఇవ్వన్ని  ప్రకృతి  మనకిచ్చే అందాలైతే,
నాకు  నీ  ప్రేమే  అందం  ప్రియ ...............