Wednesday, 19 October 2011

హీరో introduction పాట: welcome welcome






welcome welcome  అంటూ వుంది లోకం
birthu deathu  మద్యన ఎన్నో కథలు నేస్తం
యుద్ధమే చేసి ముందడుగే వేయాలీ ప్రాయం
ఎన్నో జీవితపాటాలు నేర్పుతుందీ పయనం
ఛలో ఛలో  ముందుకె వెళ్ళు
హలో హలో వెనుదిరగకు నువ్వు
కాలంతో పోటీ చెయ్యి
ఉరుములతో స్నేహం చెయ్యి
కన్నీల్లోస్తే నవ్వేసేయి
జీవితమే అనందం  కదరా

welcome welcome  అంటూ వుంది లోకం
birthu deathu  మద్యన ఎన్నో కథలు నేస్తం
కళ్ళల్లో కసి నింపి దూసుకు  పోవాలి మనం
అందరు ఒక్కటనే సిద్దాంతం చెప్పాలి జగం
అలా అలా కెరటంలా మనం
పెళా పెళా మెరుపై దూసుకు వెళ్దాం
జగమంటే జాలి అందాం
సై అంటే సైసై అని అందాం
నువ్వు వెళ్ళే దారి మంచిది అయితే
ఎవ్వరిని లెక్కచేయకు రా

welcome welcome  అంటూ వుంది లోకం
birthu deathu  మద్యన ఎన్నో కథలు నేస్తం

Friday, 14 October 2011

ఆడజన్మ అనురాగాలకు కొమ్మ


ఆడజన్మ అనురాగాలకు కొమ్మ:

కొత్తదనం, అమ్మతనం కలబోసిందే ఆడజన్మ 
ఓర్పు, నేర్పు కలబోసి సృష్టించాడే ఆ బ్రహ్మ 
అందం అంటే మనసంటూ తెలిపేదే స్త్రీ జన్మ 
బంధం బాధ్యతకు సూత్రం అంటుందే పడతి జన్మ
శత్రువుకైనా నే నేస్తం అంటుందే ఆ అపురూప బొమ్మ......  మా అమ్మా

Monday, 10 October 2011

love song: నిమిషంతో కాలమే

























పల్లవి

నిమిషంతో కాలమే తెలిపెను     I MISS U
నేలను చినుకే అడిగేను      I WANT U 
నీ మనసుతో నా మాటే కలిపెను   I LIKE U
నా కలలో వెతీకా నీరూపు       WHERE R U
ముందుకు వచ్చి నాతో చెప్పవా  I LOVE U   I LOVE U
                            

చరణం-1
దిక్కులంతా ఏకం అయ్యీ
నీ దారి చూపుతువుందే
నువ్వు దూరం అయ్యేవేల
ఒంటరేగా నా జీవితమంతా
మది తెలుపుతోంది నా ప్రేమంతా
నీ పిలుపుకోసం వేచివున్న
నిన్ను నేను చేరెవరకూ
అగిపొదె నా ఈ శ్వాస                                                                         
నిమిషంతో కాలమే తెలిపెను     I MISS U
నేలను చినుకే అడిగేను      I WANT U 
నీ మనసుతో నా మాటే కలిపెను   I LIKE U
నా కలలో వెతీకా నీరూపు       WHERE R U
ముందుకు వచ్చి నాతో చెప్పవా  I LOVE U   I LOVE U
  


చరణం-2
నా కళ్ళలోన నిలుచున్నావు
నా గుండేలోన దాగున్నావు
నేనిన్ను వెతికే సరికి
కనుమరుగై పోతున్నావు
పువ్వులేమో చెప్పే నీరూపు
తారలేమో విప్పే లోగుట్టు
నీ తలాపే తలిచేవేల
తికమక అయ్యే ఈజగమంతా
    
నిమిషంతో కాలమే తెలిపెను     I MISS U
నేలను చినుకే అడిగేను      I WANT U 
నీ మనసుతో నా మాటే కలిపెను   I LIKE U
నా కలలో వెతీకా నీరూపు       WHERE R U
ముందుకు వచ్చి నాతో చెప్పవా  I LOVE U   I LOVE U
                                                           

Thursday, 6 October 2011

మినీ స్టొరీ - నా మార్గం


                                             నా మార్గం
చూసే ప్రతి అందం నా సొంతం అనేదే కళ్ళు. నా కళ్ళతో నేను చూసే ప్రతి విషయాన్ని నమ్ముతాను. ఎవరో చెప్పినది నమ్మేకంటే నన్నే అంటిపెట్టుకొని వుండే నాకళ్ళను నమ్మడం నాకు  ఆనందం. ఎందుకంటే మంచి, చెడు, విచక్షణ, ఓర్పు, సహకారం అన్నీ నా కళ్ళు నాకు నేర్పుతుంది. నాకు ఈ ప్రపంచంలో ఎవరి తోడు లేకపోయినా నాకళ్ళే నాకు లోకమై నాకు దారి చూపిస్తుంది. కన్నీటిలో మునిగినా, నాకళ్ళు ఈదులాడుతూ పైకి తేలుతూ నాకు గమ్యాన్ని చూపిస్తుంది. అందుకే నాకళ్ళంటే నాకు ఇష్టం. కాని అనుకోని సంఘటనవల్ల నాకళ్ళు  నాకు దూరం అయింది.
                         ఎంతో బాధపడ్డాను. నరకానికి చేరువ అవ్వడం అంటే అప్పుడు అర్థం అయ్యింది.  నాచుట్టు ఎంతమంది ఉన్నాఎందుకో ఒంటరి అనే బావన నన్ను అల్లుకుపోయింది. అన్నికోల్పోయిన వాడిలా మిగిలిపోయాను. ఆ క్షణం ప్రాణం మీద తీపిని కోల్పోయాను. అదే సమయంలో ఒక చిన్న వార్త నా గుండెకోతని అనిచివేసింది. ఒక మహా వ్యక్తి తను చనిపోయాక తన శరీరంలో ఏ అవయవాలు అయితే ఇతరులకు ఉపయోగపడుతుందో అన్నీ తీసుకొని నన్ను సమాధి చేయండి అని తను చనిపోతు చెప్పిన చివరి మాటలు. అవి మాటలు కావు ఎంతోమందికి జీవిత మార్గాలు. అతని కళ్ళే ఈ రోజు నాకు ఊపిరిపోసింది. వెలుగై నాకు దారిచూపిస్తోంది. ఈ సంఘటన నా జీవితాన్నే మార్చేసింది. నేను అతనిలాగానే మావాళ్లకి చెప్పాను. నా శరీరంతో పాటు నాఅవయవాలు మట్టిలో కలిసిపోకూడదు. నాలాంటి వాళ్ళు ఎంతో మంది చిన్న వయసులోనే జీవితాన్ని పోగొట్టుకొంటున్నారు. కళ్లుపోయో, లేక గుండెజబ్బులతోనో, లేక కిడ్నీ పాడయ్యో ఇంకా ఎన్నో చెప్పాలంటే. నేను మంచిపనికి ముందడుగువేసాను. మరి మీరు నేస్తం....................................................?

Monday, 3 October 2011

అందమైన పెదవి


అందమైన పెదవి:
ఇది ఆడవారికి నేస్తం.
పెదవిపై చిరునవ్వంటే అందరికీ ఇష్టం.
ముఖ బావాలను ఎదుటివారికి తొందరగా తెలియజేస్తుంది.
తన లేత గులాబి రంగుతో ఇంకో స్త్రీ కి అసూయ కలిగిస్తుంది.
మాటల అల్లికను తన నీడగా చేసుకొని ఆకర్షిస్తుంది.
కోపంతో చప్పుడు చేసే పెదవి, వెంటనే కరిగే మేఘంలా చిరునవ్వు చిందిస్తుంది.
ఆ పెదవి వెంట మాటలు ఎదుటి వారి మనసు గాయం చేస్తే----------?  
                                                        ఆ పెదవికి విలువ ఏది నేస్తమా.

 

Tuesday, 27 September 2011

love poetry:నా యదలో

నా యదలో
నా యదలో మెల్లగా చేరి గుండె చప్పులా మారావే
నా కంటి తెరలను తీసి కనుపాపలా మారావే
నా శ్వాసలో చేరి ఆయువే నువ్వైయ్యావే
మెల్లగా నను చేరి గమ్యమై నిలిచావే
నా కళలను అగ్నాపించే కర్తవు నువ్వైయ్యవే.......ప్రియా !

Monday, 26 September 2011

మనసుకు కలిగే తొలి స్పందన ప్రేమ


మనసుకు కలిగే తొలి స్పందన ప్రేమ
        నా కళ్ళకు కొత్తగా ఊహలు నేర్పింది. 
        నా మనసుకు తొలి సిగ్గును నేర్పింది.
        నా పెదవికి చిరునవ్వును నేర్పింది.
        నా జీవితానికే ఒక వెలుగులా నిలిచింది. 
        వెచ్చని రావికిరణాల స్పర్శ తన శ్వాసతో తెలిపింది.
        వెన్నెల కౌగిట్లో రేకు విచ్చుకునే పువ్వులా నా చెంతకు చేరింది.
        గాలి తాకిడికి చప్పుడు చేసే సముద్రపు అలలలా నాలో ఆశ రేపింది.
        రేయిని పగలుగా మార్చి నాతో ఎన్నో జాగారాలు చేయించింది.
        ఊహల ప్రపంచానికి నన్ను రాజును చేసింది.
        కొత్త కొత్త అభిరుచులు ఎన్నో నేర్పింది.
        నింగినంటిన ఆనందాన్ని రుచిచూపింది.
        అది నా ప్రేయసి నా మనసుకు కల్పించిన తొలి స్పందన.....