నా పయనం
(గమ్యం లేనిది జీవితాం)
సుశీలా, అంజలి నిద్రపోతుంటారు. అర్దరాత్రి అవుతుంది. అమ్మా అంటూ ఉలిక్కిపడి నిద్ర లేస్తుంది అంజలి. పక్కనే పడుకొని ఉన్న సుశీలా ఏమైంది అంటూ అంజలి బుజంపై చేయి వేస్తుంది. అమ్మా ఏమో తెలియడం లేదు, నా మనసంతా బారంగా వుంది. ఏమైంది అంజలి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు. ఏమో అమ్మా నాకే తెలియట్లేదు ఉన్నట్లుండి అలా అనిపిస్తోంది. ఏదో బాధగా వుంది ఎందుకో కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో అంజలి ఏమైంది తల్లి. సమయానికి మీ నాన్నాగారు కూడా లేదు. అమ్మా నన్ను వదిలి ఎక్కడికి వేళ్ళకు. ఇక్కడే ఉండు. ఏంటి అంజలి ఎప్పుడు నువ్వు ఇలా మాట్లాడలేదు కొత్తగా ఇవాలే మాట్లాడుతున్నావు. సరే నేను నీ పక్కనే వుంటాను. ఇంతలో తెల్లారుతుంది. ఇంట్లో ఫోన్ మోగుతుంది. సుశీలా ఆ ఫోన్ తీస్తుంది. ఎవరు అని మెల్లగా అడుగుతుంది సుశీలా. అమ్మా సుశీలా నేను మే చిన్నానను, మీ నాన్నగారు మనకు ఇక లేరు. ఈ రోజు ఉదయం కొద్దిగా గుండెలో నొప్పి అన్నారు. మేము ఆసుపత్రికి తెసుకేల్లెలోపే చనిపోయారు. మీరు త్వరగా బయలుదేరిరండి అంటూ ఫోన్ పెట్టేస్తారు. సుశీల ఏడుపుకి నిద్రపోతున్న అంజలి కూడా నిద్రలేస్తుంది. అమ్మా ఏమైంది అంటూ గాబరాగా అడుగుతుంది. ఏం చెప్పా మంటావు అంజలి మీ తాతయ్య మనకు ఇక లేరు. వెంటనే అంజలి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేస్తుంది. జరిగిన విషయం చెబుతుంది. సరే అంజలి నువ్వు, అమ్మ ఇద్దరు ఊరికి బయలుదేరండి. నేను ఇక్కడి నుండి అక్కడికి directగా వస్తాను. అలాగే నాన్నా. ఇద్దరు అంజలి అమ్మమ్మా వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. సుశీలా కన్నీటికి అవధులు లేదు. కాని మనిషికి మనిషి సాయమే కాని పరిమితం కాదు.
నాన్నా ప్రేమ, అబిమానం, ఆత్మీయత అన్నీ మరణమే తెంచేస్తుంది కదా మనిషికి. అవును అంజలి అది సృష్టి దర్మం. నాన్న అమ్మా ఇంకా ఏడుస్తూనే వుంది....! మరి ఏడవరా అంజలి. చిన్నప్పటి నుండి మీ అమ్మని తన గుండెలపై మోసాడు మీ తాతయ్య. మీ తాతయ్యే కాదు ఏ తండ్రైనా అంతే బిడ్డని గుండెల్లో పెట్టుకొని చూస్తాడు. వాళ్లకి ఏమి కావాలో అది సమకూర్చి జీవితాన్ని చక్కదిద్దేవాడే నాన్నా. మరి తండ్రి చనిపోతే ఎవరికైనా బాదే కదా అంజలి. అమ్మని నువ్వే ఓదార్చు. అమ్మా ఈరోజు నేనే అన్నం చేసాను నువ్వు, నాన్న తినండి. నేను కాలేజీకి వెళ్ళొస్తా. సరే అంజలి జాగ్రత్త. అలాగేమ్మా నువ్వు ఏదైనా తిను. అలాగే వుండకు. కాలేజీకి చేరుకుంటుంది అంజలి. స్నేహితులంతా ఏంటి అంజలి రెండు రోజులుగా కాలేజీకి రాలేదు అని అడుగుతారు. ఏమి మాట్లాడదు అంజలి. నేరుగా claassలోకి వెళుతుంది. ఏంట్రా నిన్నా, మొన్నా రాలేదు అంటూ ఆందోళనగా అడుగుతాడు శ్రీజిత్. ప్రాణ స్నేహితున్ని చూడగానే అంజలికి కన్నీళ్లు ఆగదు. అతని పక్కనే వెళ్లి కూర్చుంటుంది. తాతయ్య చనిపోయాడు రా. అమ్మ ఏడుస్తోంది. నాకు ఏడుపు ఆగట్లేదు. అందుకే ఇవాళ త్వరగా కాలేజీకి వచ్చేసా. సరే రా అంజలి ఊరుకో. నేను సాయంత్రం అమ్మతో మాట్లాడుతా సరేనా అంటూ అంజలి కన్నీళ్లు తనే తుడుస్తాడు.
శ్రీజిత్, అంజలి ఇంటికి చేరుకొంటారు. ఆంటీ మీరు ఇలా ఏడుస్తుంటే అంజలి కూడా దిగులు పడుతోంది. మీరు తన కోసమైనా దైర్యంగా వుండండి. ప్రతి ఒక్కరికి ఇలాంటి పరిస్థితి వస్తుంది. అంతెందుకు నేను 5వ తరగతి చదువుతున్నపుడే మా నాన్నగారు చనిపోయారు. అమ్మే నాకు నాన్నల్లా మారింది. మీరు దైర్యంగా వుండండి ఆంటీ. మీకు అంజలి, అంకుల్ అందరు వున్నారు. అలాగే శ్రీజిత్ అంటుంది సుశీల. థాంక్స్ రా అమ్మ మనసుని కొద్దిగా అయినా మార్చినందుకు. హేయ్ అంజలి నీకు నాకు మద్య థాంక్స్, సారీ అనే పదాలు రాకూడదు రా. సరే టైం అయ్యింది నేను ఇంటికి వెళ్తాను. సరే శ్రీజిత్ bye. అమ్మా నాన్నగారు ఇంకా రాలేదా. లేదు అంజలి ఇవాళ ఆఫీసులో లేట్ అవుతుంది అన్నారు. సరే అమ్మా నేను ఒకసారి కాల్ చేస్తాలే. తను కాల్ చేయబోయే లోపే శంకర్ కాల్ చేస్తాడు. హాయ్ నాన్నా నేనే మీకు ఫోన్ చేయాలని అనుకొన్నా--- ఇంతలో మీరే చేసారు. ఏంట్రా విషయం అంజలి. నాన్నా శ్రీజిత్ ఇంటికి వచ్చి అమ్మతో మాట్లాడాడు. ఇప్పుడు అమ్మ కొద్దిగా పర్లేదు అనిపిస్తోంది. అయితే సరే నేను మీ అమ్మ ఎలావుందో కనుక్కుందామనే కాల్ చేసాను. నిజంగా శ్రీజిత్ చాలా మంచివాడు. అలాంటి వాడు నీకు ఫ్రెండ్ అయినందుకు నాకు చాలా సంతోషంగా వుంది అంజలి. అవును నాన్నా, శ్రీజిత్ లాంటి స్నేహితుడు ఎవరికీ వుండడు. సరే అంజలి ఇక వుంటాను. కొంచం లేటుగా వస్తాను. అలాగే నాన్నా. మీరు మీ పని చూసుకొని నిదానంగా రండి. నేను అమ్మని జాగ్రతగా చూసుకొంటాను. అలాగే అంజలి ఇంక వుంటాను. నాన్న ఫోన్ చేసారమ్మ రావడానికి లేట్ అవుతుందంట . సరే అంజలి అయితే నువ్వు అన్నంతిని పడుకో. లేదమ్మా ఇద్దరం కలిసే తిందాం రా. సరే పదా అయితే. ఇదరు అన్నంతిని పడుకొంటారు. అర్దరాత్రి దాటుతుంది ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. సుశీల తలుపు దగ్గరకు వెళ్లి ఏమండి అని పిలుస్తుంది. నేనే సుశీల తలుపు తీయి అంటాడు శంకర్. తలుపు తీస్తుంది సుశీల. ఏం సుశీల నిజం చెప్పు ఏమైనా తిన్నావా లేదా. తిన్నానండి అంజలి ఇద్దరం కలిసే తినాలి అని పట్టుబడితే తిన్నాను. సరే నేను ఆఫీసులోనే తిన్నాను. నువ్వు వెళ్లి పడుకో. నేను కొద్దిగా ఫ్రెష్అప్ అయ్యి వస్తా. సరే అంటూ వెళ్లి పడుకుంటుంది సుశీల. ఇంతలో తెల్లారుతుంది. యధావిదిగా అంజలి కాలేజీకి వెళుతుంది. నేరుగా క్లాస్స్లోకి వెళుతుంది. శ్రీజిత్ పక్కన వెళ్లి కూర్చుంటుంది. ఏరా అంజలి అమ్మ ఎలా వుంది. బాగుంది శ్రీజిత్. అమ్మ కొద్ది కోదిగా మారుతుంది. కొద్ది రోజులు పడుతుంది. అవును శ్రీజిత్ నేను అదే అనుకుంటున్నా. ఇంతలో క్లాస్ మొదలవుతుంది. exams దగ్గరకి వచ్చింది. అంజలి ప్రతి year నువ్వే క్లాసు ఫస్ట్ వచ్చేడానికి ఈ ఇయర్ కూడా నువ్వే ఫస్ట్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. thank you sir తప్పకుండా ఈ సారి కూడా నేనే ఫస్ట్ వస్తా సర్. శ్రీజిత్ కూడా all the best చెబుతాడు అంజలికి. ఇంతలో వాళ్ళ సర్ లెసన్ మొదలు పడతాడు. అందరు బుక్ ఓపెన్ చేస్తారు. అంజలి బుక్ పేజి ఓపెన్ చేయగానే బుక్ లో నుండి ఒక పేపర్ క్రిందపడుతుంది. అది అంజలి గమనించదు. శ్రీజిత్ చూసి ఆ పేపర్ని చేతిలోకి తీసుకొని దాచేస్తాడు. అన్నీ classes అయ్యాక అంజలి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతుంది. అంజలి వెళ్ళాక ఆ పేపర్ తీసుకొని రేయ్ భూపతి నువ్వేగా ఈ లెటర్ అంజలికి రాసింది అని అడుగుతాడు వెనుక బెంచీలో కూర్చొని వున్నవాడిని. ఈ లెటర్ నేనే రాసింది. అది నువ్వు తీయడం నేను గమనించాను. అది మర్యాదగా రేపు అంజలి బుక్స్ లో పెట్టు శ్రీజిత్. చూడు భూపతి నువ్వు కొద్ది రోజులుగా అంజలి వైపే చూడడం నేను గమనించాను. అందరు నాకు ఫ్రెండ్స్. అందరు బాగుండాలనే నేను కోరుకుంటా. అందుకే నిన్ను ఏమి అనలేకపోయా. అంజలి బాగా చదువుతుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ వేరే start అవబోతుంది. ఈ సమయంలో నువ్వు తనని disturb చేయకు భూపతి. నువ్వు అంజలిని ప్రేమించడం తప్పు అనడం లేదు. ఇది సమయం కాదు అంటున్నాను. దయచేసి కొద్ది రోజులు అగురా. ఎగ్జామ్స్ అయ్యాక అంజలితో మాట్లాడు భూపతి. అప్పుడు తన మనసులో ఏముందో నీకు తెలుస్తుంది. సరే శ్రీజిత్. నువ్వు చెప్పింది నిజమే. నిజమైన ప్రేమకు ఎదురుచూపు, ఓపిక, మంచి మనసు కావలి. అంజలిపై నాకున్నది నిజమైన ప్రేమ కాబట్టి నేను ఎగ్జామ్స్ అయ్యేవరకు తనని నేను disturb చేయను. థాంక్స్ భూపతి. నువ్వు నాకు థాంక్స్ చెప్పాడమేమిటి శ్రీజిత్ నేనే నీకు థాంక్స్ చెప్పాలి.
ఇంతలో ఎగ్జామ్స్ టైం కాస్త వచ్చేసింది. అందరు పరిక్షలపైనే దృష్టిపెట్టారు. అందరు examsకి బాగా prepare అయ్యారు. అనుకున్నా విదంగా ఎగ్జామ్స్ అందరు బాగా రాసారు. అన్నీ పరిక్షలు కావడంతో క్లాసులో వాళ్ళంతా రేపు సినిమాకి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు. రేయ్ శ్రీజిత్ నేను రేపు నా మనసులో మాట అంజలికి చెప్పాలని అనుకుంటున్నాను. అలాగే భూపతి all the best కాని అబిప్రాయం చెప్పు, తన మనసుని బలవంతం చేయకు ఇది ఒక స్నేహితుడిగా నీకు ఇచ్చే సలహా. అలాగే శ్రీజిత్ అది నాకు తెలియదా. సరే నాన్నకి కొంచం ఒళ్ళు బాగాలేదు. ఇవాళ నేను హాస్పిటల్కి తీసుకెల్లాలి వెల్లొస్తారా. అలాగే భూపతి బాయ్. శ్రీజిత్ ఎక్కడున్నావు అంటూ అంజలి పిలుపు వినిపిస్తుంది శ్రీజిత్ కి. అంజలి ఇక్కడే వున్నారా ఏంటి చెప్పు అంటూ బడులిస్తాడు శ్రీజిత్. మెల్లగా శ్రీజిత్ దగ్గరకు వస్తుంది అంజలి. శ్రీజిత్----! నేను ఎగ్జామ్స్ టైములో నిన్ను disturb చేయకూడదు అని చెప్పలేదు. నాన్నగారు నా పైచదువుల కోసం అని బంగళూరుకి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు. మేము ఇవాళ రాత్రే బయలుదేరుతున్నాంరా. ఏంట్రా అంజలి నువ్వు చెప్పేది, మీరు అందరు బెంగుళూరు shift అవుతున్నారా?. అవును శ్రీజిత్. ఇంత సడన్ గా చెబుతున్నావేంట్రా. ముందే ఎందుకు చెప్పలేదు పైగా రీసన్ కూడా చెబుతున్నావు ఎగ్జామ్స్ అని. అంజలి నా మనసు ఎందుకో బరువుగా అవుతోంది. కాని ఒక ఫ్రెండుగా నువ్వు ఎక్కడున్నా హ్యప్పిగా వుండాలని కోరుకొంటున్నా అంజలి. థాంక్స్ శ్రీజిత్. నువ్వు హ్యప్పిగా వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను శ్రీజిత్ అంటూ శ్రీజిత్ కి షేక్ హ్యాండ్ ఇస్తుంది అంజలి. అక్కడికి వెళ్ళాక మా డాడీ ఫోన్ నెంబర్ చెబుతాను శ్రీజిత్. అలాగే అంజలి కాని నీ ఫోన్ నెంబర్ ఇవ్వడం మరవకు, నీ స్టడీస్ అయ్యాక వచ్చేస్తారా ఇక్కడికి అంజలి. లేదు శ్రీజిత్ నాన్నగారికి మళ్లీ ఇక్కడికి వచ్చే ఉద్దేశమే లేదు. అందుకే మేము వున్న ఇల్లు sale చేసేసారు నాన్నగారు. నిన్ననే ఇల్లు కొన్న వాల్ల పేరుతో rigistretion కూడా అయ్యింది. ఎగ్జామ్స్ వల్ల నీకు చెప్పలేకపోయాను, శ్రీజిత్ మీ పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి మా డాడీ నెంబర్ ఇస్తాను. నువ్వు నాకు అప్పుడప్పుడు కాల్ చేయరా. సరే అంజలి మేము ఉన్న పరిస్థితుల్లో ఇప్పట్లో ఫోన్ తీసుకునే ఆలోచన లేదు. ఒకవేళ నేను ఫోన్ తీసుకుంటే నెంబర్ ఇస్తాను. సరే శ్రీజిత్ నేను వెళ్లొస్తాను. అలాగే అంజలి ఇంత తొందరగా నీకు నేను దూరం అవుతాను అని అనుకోలేదు. బహుసా ఇదే విదేమో. బాధపడకు శ్రీజిత్ నువ్వు బాగా చాడువుకొన్నాక జాబు కోసం ఎలాగో సిటీకే రావాలిగా శ్రీజిత్. అంజలి రియల్లీ ఐ మిస్ ఉ రా. శ్రీజిత్ నేను నిన్ను మిస్ అవ్వను ఎలాగో తెలుసా నువ్వు నా తియ్యటి జ్ఞాపకానివి. సరేనా అంటూ శ్రీజిత్ కి దైర్యం చెబుతుంది. కాని అంజలి మనసులో ఏదో బాధ, చెప్పలేని దిగులు. ఇద్దరికి ఒకరిపై ఒకరికి అబిమానం. కాని "విధి చదరంగంలో అందరు ఇసుక రవ్వలే కదా. గాలి ఎటు వీస్తే అటు మనము కొట్టుకు పోవలసిన వాళ్ళమే" అంజలి అని మనసులో అనుకొంటాడు శ్రీజిత్. శ్రీజిత్ నేను బయలు దేరేటప్పుడు నాకు సెండ్ఆఫ్ ఇవ్వడానికి ఇంటికి రా అని అడుగుతుంది అంజలి. నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతున్నావంటేనే నా మనసుకు చాలా కష్టంగా వుంది. ఇక నువ్వు వెళ్ళేటప్పుడు నా మనసు పడే వేదననీ చూస్తూ నేను భరించలేను అంజలి నువ్వు వెళ్లిరా అంటాడు శ్రీజిత్. ఏమి బదులు ఇవ్వాలో తెలియక మౌనంగా అక్కడి నుండి అంజలి బయలుదేరి వెళ్ళిపోతుంది. అంజలి ఇంటికి చేరుకొంటుంది. సుశీల ఇల్లుసర్ధడంలో చాలా హడావిడిగా ఉంటుంది. అంజలి వచ్చింది కూడా గమనించదు సుశీల. అంజలి బెడ్రూంలో అలాగే ఏదో ఆలోచిస్తూ దిగులుగా కూర్చోనుంటుంది. ఇల్లు సర్దడం పూర్తి చేసుకొని మెల్లగా హాల్లోకి వస్తుంది సుశీల. హలో సోఫాలో కూర్చొని గడియారం వైపు చూస్తుంది. అంజలి రావలసిన టైం కూడా దాటిపోయింది ఏంటి ఇంకా అంజలి రాలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది సుశీల. ఇంతలో అంజలి రూములో నుండి ఫ్యాన్ శబ్దం వినిపిస్తుంది సుశీలకు. సోఫాలో నుండి లేసి అంజలి రూం వైపు వెళుతుంది సుశీలా. డోర్ ఓపెన్ చేస్తుంది సుశీల. బెడ్ పైన దిగులుగా, ఏదో ఆలోచిస్తున్నట్లుగా అంజలి కనిపిస్తుంది సుశీలకి. అంజలి ఏమైంది అలా ఉన్నావు, ఎప్పుడు వచ్చావు నువ్వు. నేను గమనించలేదు. నేను వచ్చి చాలా సేపు అయ్యింది అమ్మ. ఏమైంది అంజలి అలా ఉన్నావు అంటూ అంజలి పక్కన వెళ్లి కూర్చుంది సుశీలా. స్నేహితులందరినీ వదిలివేల్లాలంటే ఏడుపొస్తోంది అమ్మా. ముఖ్యంగా శ్రీజిత్ ని. చూడు అంజలి ఈ ప్రపంచంలో ఎవరికీ ఎవరు శాశ్వతం కాదు. "కొన్ని బంధాలు తీపి గురుతులితే, కొన్ని జ్ఞాపకాలు చేదు అనుబవాలు" అంజలి. నా అనుబవంలో ఎవరు నాకు ఇంతవరకు తోడుగా రాలేదు అంటూ అంజలి తల పైన చేయి పెట్టి తల నిమురుతూ చెబుతుంది సుశీల. అమ్మా ఏమిటి నువ్వు చెప్పేది. అవును అంజలి మన జీవన ప్రయాణం ఎప్పుడు, ఎటువైపు, ఎలా సాగుతుందో మనకే తెలియదు. ఇవాళ నువ్వు నీ స్నేహితులని వదిలి వెళ్ళిపోతున్నా అని అనుకుంటున్నావు. కాని నీకు ఇంకా మంచి స్నేహితులు ఎదురుపడ వచ్చు నీ జీవితంలో అని అంజలికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుంది సుశీల. వీళ్ళమాటల మధ్యలోనే శంకర్ లారీతో సహా వస్తాడు. అమ్మా అంజలి----, సుశీలా ---- రండి లారీ కూడా వచ్చేసింది. ఆ------వస్తున్నాం నాన్న అంటూ బెడ్రూంలో నుండి ఇద్దరు వాకిలి గుమ్మం దగ్గరకు వస్తారు. అంజలి, సుశీలా మీరు ఇద్దరు రెడీనా వెళ్లి కార్లో కూర్చోండి, నేను లారీ వాళ్లకు అంతా చెప్పాను. వాళ్ళే లారిలోకి సామాన్లు అన్నీ ఎక్కించి తీసుకొస్తారు అని అంటాడు శంకర్. అలాగే అంటూ సుశీల, అంజలి కార్లో వెళ్లి కూర్చుంటారు. శంకర్ లారీ డ్రైవర్ కి బెంగుళూరు అడ్రస్ చెప్పి అక్కడినుండి బయలుదేరేస్తారు.
బెంగుళూరు చేరుకుంటారు అందరు. సామానుల లారి కుడా వచ్చేసింది. ఇంట్లో అంతా సర్దుకుంటున్నారు. అంజలి----- మీరు ఇల్లు సర్దుతూ వుండండి. నేను మనకు తినడానికి ఏదైనా తీసుకొస్తాను అంటాడు శంకర్. అలాగే నాన్నా మీరు వెళ్లి రండి. ఇల్లు సర్దడం పూర్తి అయ్యేలోపే శంకర్ భోజనం పార్సెల్ తీసుకొని వస్తాడు. అన్నంతినడాని కూర్చొంటారు అందరు. అంజలి---! ఇంకా నీకు ఇంటర్ రిసల్ట్ రావడానికి ఎలాగో టైం వుంది. ఈ సమయంలో నువ్వు కాళీగా వుండడం నాకు నచ్చలేదు. అందుకే నిన్ను అడగకుండా నేను ఒక నిర్ణయానికి వచ్చారా అంటాడు శంకర్. ఏంటి నాన్నా అది అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది అంజలి. మరేం లేదు అంజలి. నీకు ఇప్పటి వరకు ఎలాగో కంప్యూటర్ గురించి తెలియదు.నీకు డిగ్రీలో ఎలాగో ఒక SUBJECT వుంటుంది. అందుకే ఈ సెలవుల్లో నిన్ను కంప్యూటర్ కోర్సులో జాయిన్ చేయించాలని అనుకుంటున్నాను. నాన్నా నిజంగా నాకు చాలా హ్యాపీగా వుంది. లవ్ యు నాన్నా అంటూ పక్కనే కూర్చొన్న వాళ్ళ నాన్నకి బుగ్గపై ముద్దు పెడుతుంది అంజలి. అందుకు శంకర్ నాకు చెప్పవలిసింది థాంక్స్ కాదు అంజలి, నువ్వు ఒక మంచి స్థానంలో నిలబడాలి. నీ చదువు కోసం ఉన్న ఊరిని, ఐన వాళ్ళని వదిలేసి వచ్చాము. వాళ్ళ నాన్న మాటలకు అంజలి బాధపడుతుంది. నాన్న మీరే చూడండి నేను ఎలా చదివి మీకు మంచి పేరు తెస్తానో అంటూ శంకర్ బుజంపైన తల వాలుస్తూ చెబుతుంది అంజలి. సరే ముందు అన్నం తినేసి లేవండి తరువాత ఏమైనా వుంటే మాట్లాడుకుందాం అంటుంది సుశీల . అంజలి నాకు తెలిసినా వాళ్ళదే కంప్యూటర్ సెంటర్ వుంది. అక్కడ జాయిన్ అవుదువు. రేపే నిన్ను అక్కడికి తీసుకెల్తారా అంటాడు శంకర్. అలాగే నాన్న రేపే నేను జాయిన్ అవుతా అంటుంది అంజలి.
శంకర్, అంజలి కంప్యూటర్ INSTITUTEకి చేరుకొన్నారు. అక్కడ అంజలి జాయిన్ కూడా అవుతుంది. క్లాసులోకి వెళ్లి కూర్చుంటుంది అంజలి. అక్కడ వాతావరణం అంజలికి అర్థం కాదు. అందరు ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. అంజలి చదివింది ఇంగ్లీష్ మీడియం ఐన పెరిగింది పల్లెటూరిలో కాబట్టి తనకి ఇంగ్లీష్ మాట్లాడం అంతగా రాదు. క్లాసులో ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా లాస్ట్ కుర్చీలోకి వెళ్లి కూర్చుంటుంది. ఆరోజే మొదటి రోజు కాబట్టి క్లాసులోకి ఫేకల్టి రాగానే అందరిని పరిచయం చేసుకోమని చెబుతాడు. అందరు ఒక్కొక్కరే పైకి లేసి INTRODUCE చేసుకొంటారు. అందరు ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఒక్కో బాష వారు, ఒక్కో ప్రాంతం నుండి వచ్చిన వారు అందరు. మరి అందరికి తెలిసినా ఒకే బాష ఇంగ్లీష్. ఆఖరిగా అంజలి వంతు వచ్చింది. మెల్లగా పైకి లేస్తుంది అంజలి. మై నేమ్ ఈస్ అంజలి. ఐ యాం ఫ్రమ్ ఆంధ్రా అని కూర్చునేస్తుంది. క్లాస్ ప్రారంబం అవుతుంది. అందరు శ్రద్ధగా వింటుంటారు. అంతలో చిన్న బ్రేక్ ఇస్తారు టీకి. అందరు బయటకి వెళ్తారు బ్రేక్లో. అంజలి, ఇంకో అబ్బాయి అదే రూం లో వుంటారు. అంజలి చాలా మౌనంగా వుండడం గమనిస్తాడు సూర్య. హాయ్ అంజలి ఎందుకు మీరు అంతా సైలెంటుగా వున్నారు అంటాడు సూర్య. ఆ మాటలు విన్న అంజలి గబుక్కుమని వంచిన తలను పైకి ఎత్తి చూస్తుంది. మీరు తెలుగు వారా అని సంతోషంగా అడుగుతుంది అంజలి. అవును తెలుగువాన్ని కాబట్టేగా నేను మీతో తెలుగులో మాట్లాడాను అని నవ్వుతూ అంటాడు సూర్యా. నాపేరు సూర్యా. మేము చిన్నపుడే మా parents బెంగుళూరు వచ్చి సెటిల్ అయ్యారు అంటూ సూర్య కుర్చీలో నుండి లేసి అంజలి పక్కకు వెళ్లి కుర్చీలో కూర్చొంటాడు. అప్పుడు అంజలి సూర్యకి చెబుతుంది మేము నిన్ననే వచ్చాము. నాకు ఇంగ్లీష్ అంతగా రాదు అందుకే నేను మౌనంగా కుర్చోన్నా అని. అందుకు సూర్య చెబుతాడు. చూడు అంజలి ఎవ్వరికి ఏమి రాదు నేర్చుకోక ముందు మీకు కొత్త కాబట్టి అలా వుంది. కొద్ది రోజులు పోయాక మిరే నాతో అంటారు చాలా బాగా అర్థం అవుతుంది అని. నిజంగాన సూర్యా నేను మీలా ఇంగ్లీష్ మాట్లాడగలనా అంటూ అమాయకంగా అడుగుతుంది అంజలి. హేయ్ అంజలి కచ్చితంగా మాట్లాడగలవు. సరే బ్రేక్ టైం అయిపోయింది క్లాసు అయిపోయాక వెళ్ళకు, ఆగు నేను వస్తాను అంజలి. సరే సూర్యా అలాగే. అంజలికి మొదటి రోజు క్లాసులో ఏం చెబుతున్నారో ఏమి అర్థం కాదు. అలాగే మళ్లీ బొమ్మలా కూర్చొంటుంది. ఇంతలో క్లాసు కాస్తా అవుతుంది. అంజలి రండి వెళ్దాము అంటూ పిలుస్తాడు సూర్య. మీరు ఇంటికి ఎలా వెళ్తారు అంజలి. మా నాన్న వస్తా అన్నాడు సూర్యా. వీళ్ళ మాటల మధ్యలోనే శంకర్ వస్తాడు అంజలిని ఇంటికి తీసుకెల్లడానికి. సరే సూర్యా రేపు కలుద్దాం, మా నాన్నగారు కూడా వచ్చారు బాయ్ అంటూ అంజలి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అంజలి వెళ్ళిపోయిన తర్వాత అయ్యో----! తను ఎక్కడ వుండేది అని తెలుసుకోనే లేదు, సరేలే రేపైనా
ఆడుగుతా అనుకుంటూ బస్సు స్టాప్కి వెళ్లి తన ఏరియా బస్సు ఎక్కుతాడు. ఇంటికి చేరుకుంటారు అంజలి వాళ్ళు. ఎరా బంగారం ఐపోయిందా క్లాస్, ఎలావుంది మొదటిరోజు అని అడుగుతుంది సుశీల. నాకూతిరికి ఏంటే తను ఎక్కడైనా క్లాస్ ఫస్ట్ వస్తుంది అంటాడు శంకర్. ఆ మాటలు విన్న అంజలి ఇంకేం చెప్పాలో అర్థం కాకుండా, తండ్రి నమ్మకాన్ని నిలబెట్టడం కోసం అవునమ్మా నాకు క్లాస్ బాగా అర్థం అయ్యింది. కచ్చితంగా నేనే ఫస్ట్ వస్తా అంటూ చిరునవ్వుతో తన బెడ్ రూంలోకి వెళ్ళిపోతుంది అంజలి. ఇంతలో సూర్యా బస్సు దిగి ఇంటికి వస్తాడు. అమ్మా--- ఎక్కడున్నావు అంటూ ఇల్లంతా వెతుకుతాడు సూర్యా. నేను వంటగదిలో వున్నా సూర్యా రా అంటుంది సూర్య అమ్మ. అమ్మా ఏం చేస్తున్నావు. ఏం లేదు సూర్యా నీకు ఇష్టమైన మిరపకాయ బజ్జీలు చేస్తున్నా. అమ్మా నిజంగాన సరే ఒక్క నిమిషం వుండు నేను కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేస్తా అంటూ సూర్య లోపలి వెళ్తాడు. ఇంతలో సూర్య అమ్మ మీనాక్షి రేయ్ సూర్యా బజ్జి వేడి చల్లరిపోయే లోపైనా వస్తావా. అమ్మాయిలా ముస్తాబవ్వకురా త్వరగా రా అంటూ పిలుస్తుంది. అమ్మా ఏంటి ఇప్పుడేగా వెళ్ళింది లోపలి. నిగురించి నాకు తెలియదా సూర్య. స్నానానికి వెళ్తే గంట, స్నానం చేసాక రెడీ అవ్వడానికి గంట, ముఖ్యంగా భోజనం దగ్గర కూర్చుంటే గంటసేపు పడుతుంది. అందుకే నువ్వు ఇప్పడే వెళ్ళినా వెంటనే వస్తావని అరిచాను అంటూ నవ్వేస్తుంది మీనాక్షి. బజ్జీలను ఒక ప్లేటులో పెట్టి తిను అంటుంది మీనాక్షి. అవును నీ ఫస్ట్ రోజు క్లాస్ ఎలా వుంది. రేయ్ బాగా చదువురా లేకపోతే మీ నాన్నాగారి దగ్గర నేను తిట్లు తినవలసి వస్తుంది అంటూ సూర్య గడ్డంపట్టుకొని అడుగుతుంది మీనాక్షి. అమ్మా బాగా చాడువుతాలే, నేను బజ్జీలు తింటున్నట్లు నువ్వు నా బ్రెయిన్ తినకు అంటాడు సూర్య వాళ్ళ అమ్మతో. ఒరేయ్ నిన్ను తంతా చూడు, నేను నీ బ్రెయిన్ తినేస్తున్నానా-----?. అమ్మా క్లాస్ అంటే గుర్తొచ్చింది. ఇవ్వాళ మా క్లాస్ లో ఒక తెలుగు అమ్మాయి జాయిన్ అయ్యింది తెలుసా. నిజంగా అమ్మాయి చాలా మంచిది. పాపం తనకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు. క్లాస్ అంతా అయ్యేవరకు తను ఒంటరిగానే క్లాసులో లాస్ట్ benchలోనే కూర్చోనుండిపోయింది అమ్మా. అయ్యో పాపంరా నువ్వైనా మాట్లాడలేకపోయావ. నేను మాట్లాడానమ్మా. సరే రేపటి నుండి తనకు ఏదైనా అర్థం కాలేదు అంటే చెప్పు నాన్నా సూర్యా. అలాగే అమ్మా నేను రేపటి నుండి తనతో కుర్చోవాలనుకుంటున్నాను. అదిసరేమ్మా ఈ గిన్నెలో బజ్జీలు పెడుతున్నావు ఎవరికి. మా చెల్లల వాళ్ళింట్లో అద్దెకు ఉండే వాళ్ళే వాళ్ళు కాలీ చేసుకు వేల్లిపోయారుగా, అదే ఇంట్లోకి నిన్న కొత్తగా వేరే వాళ్ళు వచ్చారు. వాళ్లకు బజ్జీలు ఇద్దామని ఈ గిన్నెలో పెట్టా. అలాగా సరే వెళ్లిరా. మీనాక్షి బజ్జిల గిన్నె తెసుకొని గుమ్మంలోకి వెళుతుందో లేదో కృష్ణమూర్తి ఎదురొస్తాడు. రేయ్ సూర్యా మీ నాన్నగారు వచ్చారు నేను వెల్లలేనుగాని నువ్వు ఇచ్చిరారా మా అమ్మవిగా నాన్నా అంటూ సూర్యని బ్రతిమాలాడుకుంటూ ఉంటుంది మీనాక్షి. సరేలే అమ్మా వెళ్ళొస్తా నీకు ఇది మాములేగా అంటూ ఆ గిన్నెని తీసుకొని వాళ్ళ పిన్ని ఇంటికి వెళ్తాడు సూర్య. ఇల్లు గేటు ముసి వుండడంతో కాలింగ్ బెల్ వేస్తాడు సూర్యా. ఎవరు అది అనే పిలుపు వినిపిస్తుంది సూర్యకి. నేను మీ ఇంటి ఓనర్ వాళ్ళ అక్క కొడుకుని మేడం. ఇంట్లో అమ్మా వాళ్ళు ఎవరూ లేరు తర్వాత రండి ప్లీస్ అంటుంది ఆ అమ్మాయి. మేడం మా అమ్మ ఒక చిన్న పార్సెల్ మీకోసం పంపింది అది తీసుకొంటే నేను వెళ్ళిపోతాను. సరే ఒక్క నిమిషం వస్తున్నాను అంటుంది ఆ అమ్మాయి. మా అమ్మ నన్ను పార్సెల్ అబ్బాయిని చేసేసింది అంటూ తిట్టుకుంటుంటాడు సూర్య. ఆ అమ్మాయి మెల్లగా తలుపు ఓపెన్ చేస్తుంది.
సూర్య: హేయ్ అంజలి మీరేంటి ఇక్కడ.
అంజలి: మేము ఇక్కడే అద్దెకి వచ్చాము.
సూర్య: హేయ్ నిజంగా నాకు చాలా హ్యాప్పీగా ఉంది తెలుసా.
అంజలి: సారి--- బయటనే నిలబెట్టి మాట్లాడుతున్నాను. రండి లోపలికి.
సూర్య: పర్లేదు అంజలి ఇంకోసారి వస్తాను. మీరు ఈ బజ్జీలు తీసుకొంది. రేపు క్లాస్లో కలుద్దాం. సరే బాయ్--------
అంజలి: అలాగే సూర్యా బాయ్.
సూర్యా వీది గుమ్మం దాటగానే అంజలి తల్లిదండ్రులు ఇంటికి వస్తారు. ఏంటి అంజలి చేతిలో ఆ గిన్న. అది మనదిలా లేదే అంటూ సుశీల అడుగుతుంది. ఇది మనది కాదమ్మా మనకు ఇల్లు అద్దెకి ఇచ్చారు చూడు వాళ్ళది. ఓహ్ మీనాక్షి గారు పంపారా అంటూ రాగం తీస్తాడు శంకర్. మీనాక్షి ఎవరండి? అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది సుశీలా. మనకు వాళ్ళే అద్దెకి ఇచ్చింది ఇల్లు అంటాడు శంకర్. వాళ్ళు చాలా మంచి వాళ్ళు సుశీలా. అవునమ్మా వాళ్ళు మంచివాళ్ళు. వాళ్ళ అబ్బాయి సూర్య నేను చదివే institute లోనే చదువుతున్నాడు. అలా అయితే నీకు మంచి తోడు అంజలి అంటాడు శంకర్. ఇంటికి చేరుకోన్నాక సూర్య వాళ్ళ అమ్మతో ఈ విషయం చెప్పాలని ఆరాట పడుతూ వుంటాడు సూర్య. ఇంటి గడప ఎక్కుతూ వుంటాడు సూర్య. అంతలో వాళ్ళ నాన్న అరుపులు వింటాడు. మళ్లీ నాన్న తాగేసి వచ్చి అమ్మని అరుస్తున్నట్లున్నాడు. ఛి ఛి ----- అసలు మనిషేనా మా నాన్న. జన్మనిచ్చాడు కాబట్టి ఏమి అనలేకపోతున్నాను. లేకుంటే చంపెసుమ్డే వాడిని అంటూ ఇంటి లోపలి కూడా వెళ్ళాడు సూర్య. అక్కడి నుండి అటే ఇంటి పక్కన వున్న పార్కులోకి వెళ్లి కూర్చొంటాడు సూర్య. కుర్చీలో కూర్చొన్న సూర్య తనలో తానె మాట్లాడుకొంటు వుంటాడు. రోజు నాన్నతో ఈ గొడవ ఏమిటి. అందరి పేరెంట్స్ పిల్లలతో చాలా సంతోషంగా వుంటున్నారు. మరి మా ఇంట్లో ఏమో ఒక్క నాన్న వాళ్ళ నా సంతోషం, అమ్మ అనందం అన్ని మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాయి. చీ ఏం బ్రతుకులో నాపై నాకే చిరాకు వేస్తోంది అని సూర్య అనుకుంటుండంగానే మీనాక్షి అక్కడికి వస్తుంది. రేయ్ సూర్య మీ నాన్నగారు నన్ను అరిచినప్పుడల్లా నువ్వు ఈ పార్కుకు రావడం ఏంటి నాన్నా. రా వెళ్దాం అంటూ సూర్యని బ్రతిమలాడుకుంటుంటుంది మీనాక్షి. అమ్మా నేను కాసేపాగి వస్తాను నువ్వు వెళ్ళు అని చిరాగ్గా చెబుతాడు సూర్య. రేయ్ సూర్య నేను బ్రతికున్నదే నీకోసం, మరి నువ్వు కూడా నాపై చిరాకు చూపిస్తే నేను ఎవరికోసం ప్రాణాలతో వున్నట్లు అంటూ కంట తడి పెట్టుకుంటుంది మీనాక్షి. అమ్మా సారి ప్లీస్ ఏడవకు నేను ఇంకెప్పుడు నీపై చిరాకు చూపించను అంటూ మీనాక్షి కళ్ళు తుడుస్తాడు సూర్య. సరే రా సూర్యా వెళ్దాం అంటూ మీనాక్షి ఇంటికి తీసుకెలుతుంది. ఇంటి గుమ్మం ఎక్కగానే రేయ్ సూర్య ఎలా వుంది ఫస్ట్ డే క్లాస్ అంతా ఓకే కదా అని అడుగుతాడు కృష్ణమూర్తి. అంతా ఓకే నాన్న అంటూ తన రూం లోకి వెళ్ళిపోతాడు సూర్య. ఏంటే అలా దెయ్యంలా చూస్తున్నావు వాడికి భోజనం పెట్టు అంటూ గుమ్మంలో నిలుచుకొని ఉన్న మీనాక్షిని అరుస్తాడు కృష్ణమూర్తి. అలాగే అండి అంటూ తలాడిస్తూ వెళుతుంది. అన్నం ప్లేటులో పెట్టుకొని సూర్య గదిలోకి తీసుకేలుతుంది మీనాక్షి. అమ్మా నాకు ఆకలి కాలేదు ప్లీస్ వద్దు అంటూ అన్నం ప్లేటు కొంచం జరుపుతాడు. రేయ్ సూర్యా అన్నం మీద అలిగితే అమ్మ మీద అలిగినట్లు నాన్నా అంటూ గోరుముద్దలు కలిపి సూర్య నోటికి అందిస్తుంది మీనాక్షి. అమ్మా నాకు ఎన్ని జన్మలు వుంటే అన్ని జన్మలకి నువ్వే నాకు అమ్మగా వుండు అంటూ మీనాక్షి కుడి చేయిని సూర్య రెండు చేతులతో పట్టు కుంటాడు. ఎప్పటికి నువ్వే నా కొడుకువి రా. సాక్షాత్తు ఆ చిన్ని కృష్ణుడు అమ్మగా వుండమని అడిగా ఒప్పుకోను సరేనా. అమ్మా మరిచిపోయా చెప్పేది నేను మా క్లాసులో తెలుగమ్మాయి చేరింది అన్నానే ఆ అమ్మాయి వాళ్ళే మన పిన్ని ఇంట్లో బాడుగకు వుండేది. అలాగా సరే రా నువ్వు పడుకో అంటూ మీనాక్షి సూర్య గదిలో నుండి వేల్లోపోతుంది. అన్నం తిన్న సూర్య పడుకుంటాడు.
ఇంతలో తెల్లవారుతుంది. కంప్యూటర్ క్లాసుకు రెడీ అవతాడు సూర్య. అమ్మా నేను వెళ్ళొస్తా అంటూ బయలుదేరి వెళ్ళిపోతాడు. అంజలిని కలవాలంటు ఆత్రుతగా బస్సు దిగి జోరుగా నడుస్తూ INTITUTEలోకి వెళతాడు సూర్య. అక్కడికి చేరిన సూర్య క్లాస్ డోర్ తీసి లోపల చూస్తాడు. అక్కడ అంజలి వుండదు. ఏమిటి ఇంకా రాలేదు అంటూ తన కోసం INSTITUTE బయటనే నిలుచుకొని ఎదురు చూస్తూ వుంటాడు. ఎంత సేపటికి రాదు అంజలి. పైగా క్లాసు స్టార్ట్ అయ్యే టైం కాస్తా అయ్యింది. సరే క్లాసులోకి వెళ్ళాలి అని సూర్య వెనక్కి తిరిగే సమయంలో బైక్ సౌండ్ వస్తుంది. గబుక్కున సూర్య ఆ శబ్దానికి రోడ్డు వైపు చూస్తాడు. అక్కడ వచ్చింది అంజలి. అంజలి యధా విదిగా వాళ్ళ నాన్నతో వచ్చింది. అక్కడ నిలుచున్నా సూర్యని చూసి హాయ్ సూర్య మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది. అలాగే శంకరికి సూర్యని పరిచయం చేస్తుంది. శంకర్ వెంటనే నువ్వు మేముంటున్న ఇంటి ఓవ్నెర్ వాళ్ళ బందువుల అబ్బాయివి కదా అని అడుగుతాడు శంకర్. అవును అంకుల్ అంటూ నెమ్మదిగా బదులిస్తాడు సూర్య. సరే మీరు క్లాస్లోకి వెళ్ళండి అని చెప్పి శంకర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అంజలి ఏంటి లేటుగా వచ్చారు మీరు అంటూ అంజలి వైపు చూస్తూ అడుగుతాడు సూర్య. ఏం లేదు నేను నిద్దర లేవడం లేట్ అయ్యింది సూర్య. మీరేంటి క్లాసులోకి వెళ్ళకుండా institute బయట నిలుచుకొని ఏం చేస్తున్నారు. ఏమి లేదు అంజలి క్లాసులో చూసా మీరు లేరు. ఇంకా రాలేదు అని మీకోసం బయట వెయిట్ చేస్తున్నాను. నేను రాకుండా ఎలా వుంటాను సూర్య. thank u నాకోసం వెయిట్ చేస్తున్నందుకు అంటూ సూర్య వైపు చూసి నవ్వుతుంది అంజలి. అంజలి మీకు క్లాసులో ఏమి అర్థం కాకపోయినా నన్ను అడగండి అంటూ సూర్య చెబుతాడు. సరే సూర్య తప్పకుండా అని ఇద్దరు మాట్లాడుతూ క్లాసులోకి అడుగుపెడుతారు. అక్కడ chairs రెండే రెండు కాళీ వుంటాయి అది ఆఖరిన. ఇక చేసేది ఏమి లేక ఇద్దరు క్లాసు ఆఖరి కుర్చీలో వెళ్లి కూర్చుంటారు. అది పక్క పక్కన కుర్చీలో. ఇంతలో ఆ institute receptionist వచ్చి " hi friends, sorry to say today no class for everyone. Because ur faculty met with an accident. So please come tomorrow ". అని చెప్పి వెళ్ళిపోతుంది. అందరూ చేసేది ఏమి లేక అందరు క్లాస్ రూం నుండి వెళ్లిపోతారు. కాని అంజలికి ఏమి చెయ్యాలో తెలియదు. ఏంటి అంజలి మీరు రారా ఇంటికి అంటూ సూర్య కుర్చీలో నుండి పైకి లేస్తూ అడుగుతాడు. డాడీకి ఈ విషయం తెలియదుకదా సూర్య, నేను ఫోన్ చేసి చెబుతాను అంటూ ఆ institute బయట వున్న one రూపీ కాయిన్ బాక్స్ దగ్గరకు వెళుతుంది. అంజలి వెనకాలే సూర్య కూడా పరుగులు తీస్తూ వెళతాడు. అంజలి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి జరిగినదంతా చెబుతుంది. అయ్యో అంజలి నాకు ఆఫీసులో ఇవాళ మీటింగ్ వుందిరా మరి నిన్ను ఎలా ఇంటిదగ్గర డ్రాప్ చేయను అంటాడు శంకర్. అంజలి మనస్తత్వం ముందే సున్నితం. శంకర్ మాటలు వినగానే తన కళ్ళ నుండి నీళ్ళు తిరుగుతాయి. అంజలి కళ్ళల్లో నీళ్ళు చూసినా సూర్య, హేయ్ అంజలి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు మీరు అంటూ ఆశ్చర్యంగా అలాగే అంజలి కళ్ళ వైపు చూస్తూ వుండి పోతాడు. ఫోనులో ఆ మాటలు విన్న శంకర్ అమ్మ అంజలి అక్కడ మన ఇంటి ఓనర్ బందువుల అబ్బాయి వున్నాడా అంటూ అంజలిని అడుగుతాడు. అవును నాన్నా సరే ఒక్క సారి ఆ అబ్బాయి దగ్గరకి ఫోన్ ఇవ్వు అంజలి అంటాడు శంకర్. సూర్య మా నాన్న మీతో మాట్లాడతారంటా మాట్లాడండి అంటూ రిసీవరుని సూర్య చేతికి ఇస్తుంది అంజలి. ఆ ఫోన్ తీసుకొన్న సూర్య, అంకుల్ చెప్పండి అంటాడు. సూర్య ఇవాళ నాకు ఆఫీసులో మీటింగ్ వుండి నేను ఇప్పటికిప్పుడు రాలేను. పైగా అంజలికి వూరు కొత్త. నువ్వు ఏమి అనుకోకపోతే అంజలిని నీతో పాటు తీసుకేల్లవ ప్లీస్ బాబు అంటూ అర్థిస్తాడు శంకర్. అంకుల్ పెద్దవాళ్ళు చిన్న పిల్లలిని ఆజ్ఞాపించాలేకాని ఇలా రిక్వెస్ట్ చేయకూడదు. అంజలి గురించి మీరు బాదపడకండి. నేను అంజలిని నాతో పాటు తీసుకెల్తా అంటూ రిసీవరుని అంజలి చేతికి ఇస్తాడు సూర్య. నాన్న చెప్పండి అంటుంది అంజలి. వెంటనే శంకర్ అమ్మా అంజలి నువ్వు సూర్యతో వెళ్లు తను నిన్ను ఇంటి దగ్గర దిగాబెడుతాడు. అలాగే నాన్న పర్లేదు మీరు మీ పని అయ్యాకే రండి బాయ్ అంటూ అంజలి అక్కడి నుండి సూర్యతో కలసి బయలుదేరుతుంది. ఇద్దరు బస్ స్టాపుకి చేరుకొన్నారు. అంజలి ఇక్కడ అన్నీ బస్ నంబర్స్ దాన్ని బట్టే మనం బస్ ఎక్కాలి. ఇంతలో బస్ వాళ్ళు ఎక్కవలసిన బస్సు కాస్తా వస్తుంది. అంజలి ఇదే మనం ఎక్కవలసిన బస్ ఎక్కు అంజలి అంటూ అంజలి తరువాత సూర్యా బస్ ఎక్కుతాడు. ఇద్దరు మాటల్లో పడుతారు. వాళ్ళు దిగవలసిన స్టాప్ వస్తుంది. ఇద్దరు దిగుతారు. అంజలి ఇంతలో సూర్య పర్లేదు నేను ఇంటికి వెలుతా, ఇక్కడి నుండి నాకు దారి తెలుసు మీరు ఇంటికి వెళ్ళండి అంటుంది. అంజలి మీ ఇంటికి వస్తే కాఫీ ఇవ్వ వలసి వస్తుందనా రావద్దు అంటున్నావు అని చిలిపిగా అడుగుతాడు సూర్య. సూర్య మిమ్మల్ని చూసి అమాయకుడు అనుకున్నా కాని మీతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని ఇప్పుడే తెలిసింది అంటూ అంజలి నవ్వేస్తుంది. సరే అలాగే రండి, సూర్య నేనే కాఫీ ఇస్తాను సరేనా అంటుంది అంజలి. ప్లీస్ అంజలి ఇంకోసారి నన్ను అండి అనకు నేను అండి అనను, అలా మీరు పిలుస్తున్నప్పుడల్లా నాకు ఏదోలా వుండి అంటూ అంజలి వైపు చూస్తాడు సూర్య. అలాగే సూర్య ఇకపై నిన్ను మీరు అనను. ఇంతలో అంజలి ఇంటి దగ్గరకు చేరుకుంటారు. అంజలి ఇంటి డోర్ దగ్గరకి వెళ్లి కాలింగ్ బెల్ వేస్తుంది. అమ్మా అమ్మా అంటూ పిలుస్తుంది అంజలి. వెంటనే సుశీలా ఇంటి లోపలి నుండి బయటకు వచ్చి తలుపు తీస్తుంది. అంజలి ఏంటమ్మా ఇవాలా త్వరగా వచ్చేశావు అంటూ గాబరాగా అడుగుతుంది. అమ్మా ఏమి లేదు మా సార్ కి ఆక్సిడెంట్ అయ్యింది అని త్వరగా పంపేసారు. నాన్నకేమో ఆఫీసులో పని అని రాలేదు. ఈ అబ్బాయితో వెళ్ళమని నాన్నాగారే చప్పారు అందుకే తనతో కలిసి వచ్చా. ఈ అబ్బాయి బొండాల అబ్బాయిగా అంటూ సుశీలా అంటుంది. ఆ మాటలు విని అంజలి పక్కున నవ్వేస్తుంది. అంటి నేను బోండాల అబ్బాయిని కాదు. అయ్యో అదే బాబు ఆ రోజు నువ్వేగా తెచ్చింది బోండాలు అని అంటూ సుశీలా అమాయకంగా అడుగుతుంది. అవును ఆంటి అంటూ సమాదానం ఇస్తాడు సూర్య. అయ్యో ఇక్కడే నిలబెట్టి మాట్లాడుతున్నా రా బాబు లోపలి అంటూ పిలుస్తుంది సుశీలా. చాలా థాంక్స్ బాబు అంజలిని క్షేమంగా తెసుకొచ్చినందుకు. ఆంటి మీరు థాంక్స్ చెప్పకండి. ఎందుకంటే పెద్దవారు ఆశీర్వదించాలేకాని ఇలా థాంక్స్ చెప్పడుడదు అంటాడు సూర్య. ఇంతలో అంజలి కాఫీ ఇస్తుంది సూర్యకి. అంజలి ఇచ్చిన కాఫీ తాగుతాడు సూర్య. సరే ఆంటి నేను వెళ్ళొస్తా అంటూ సూర్య బయలుదేరుతాడు. సూర్యా ఒక్క క్షణం మీ ఇల్లు ఇక్కడికి ఎంత దూరం అని అడుగుతుంది సుశీలా. ఆంటి పక్క వీదిలోనే మా ఇల్లు ఎందుకు అడుగుతున్నారు. అయితే ఒక్క క్షణం ఉండు సూర్యా. అమ్మా అంజలి ఒక్కసారి లోపలి రా అంటుది. అమ్మా ఏంటి పిలిచావు. అంజలి మొన్న ఆ అబ్బాయి బొండాలు వేసుకొని తెచ్చిన గిన్న ఇక్కడే ఉంది. నువ్వు ఆ అబ్బాయితో పాటు వెళ్లి ఈ గిన్న ఇచ్చి రాగలవా అంటుంది సుశీలా. సరే అమ్మా పర్లేదు నేను వెళ్లి వస్తా అంటూ సెల్ఫులో వున్న గిన్న ఎత్తుకుంటుంది అంజలి. సూర్య నేను మీ ఇంటికి వస్తున్నాను అంటుంది అంజలి. అంజలి చేతిలో వున్న గిన్నె చూసి, హేయ్ అంజలి దీన్ని ఇవ్వడానికి నువ్వు వస్తాను అంటున్నావు అంటాడు సూర్య. అవును ఏ రాకూడదా సూర్యా? అలాకాదు అంజలి మళ్లీ నువ్వు ఎందుకు నేను తీసుకెళతా ఇలా ఇవ్వు అంటూ చేయిచాపుతాడు సూర్య. అది పద్ధతి కాదు సూర్యా తనే వచ్చి ఇస్తుంది. అంజలిని నీతో తీసుకెళ్ళు సూర్య అంటుంది సుశీలా. సరే ఆంటి మీ ఇష్టం అంటూ తల ఊపుతూ బయలుదేరుతాడు, సూర్యతో పాటు అంజలి కూడా బయలుదేరుతుంది. వెళ్ళే దారిలో ఇద్దరు మాటల్లో పడతారు. ఏంటి అంజలి మీరు ఎందుకు suddenగా మీ వురి నుండి ఇక్కడికి వచ్చేసారు. నా చదువు కోసం సూర్య. కేవలం నాకోసమే ఇంతదూరం వచ్చేసాము. మరి నీకు అక్కడ ఎవరూ స్నేహితులు లేరా అంజలి. నాకు చాలా మంది స్నేహితులు వున్నారు సూర్యా. మా స్నేహితులి అందరికి నేనంటే ప్రాణం. అందరిలో నా బెస్ట్ ఫ్రెండ్ ఒక్కడే. అతని పేరు శ్రీజిత్. నేనంటే వాడికి ప్రాణం. నన్ను చాలా బాగా చూసుకుండేవాడు. నాన్నగారు ఇక్కడ ఫోన్ నెంబర్ ఇంకా తీసుకోలేదు. తెసుకోన్నాక వాడికి ఫోన్ చేసి చెప్పాలి. పాపం వాడు నా ఫోన్ కోసం చాలా వెయిట్ చేస్తూ వుంటాడు. వీలయితే నేను STD నుండి అయినా మాట్లాడాలి అనిపిస్తోంది. వాడిని వదిలి ఇన్ని రోజులు నేను వుండలేదు తెలుసా సూర్య. అంజలి నీకు శ్రీజిత్ అంటే ఇష్టమా. అవును సూర్య చాలా ఇష్టం. వెంటనే సూర్య ఆలోచనలో పడుతాడు. ఏంటి అంజలి అతని గురించి ఇంతలా చెబుతోంది. శ్రీజిత్ అంత మంచివాడా. సరే ఇక్కడేగా అంజలి వుంటుంది శ్రీజిత్ ఎంత మంచివాడో నేను చూస్తా అంటూ మనసులోనే మాట్లాడుకుంటూ అంజలి పక్కన నడుస్తూ వెళుతుంతాడు సూర్య. సూర్య పరద్యానంగా వుండడం అంజలి చూస్తుంది. ఏంటి సూర్యా ఏదో ఆలోచిస్తున్నావు. అదేమీ లేదు అంజలి నువ్వు చెబుతున్నది వింటున్నాను అంతే అంటూ మాటదాటేస్తాడు సూర్య. మరి నీకు ఎవ్వరు లేరా స్నేహితులు సూర్య. వున్నారు అంజలి వాళ్ళు మా గ్యాంగ్ చాలా పెద్దది. నాకు కంప్యూటర్ గురించి కొత్త విషయాలు తెలుసు కోవాలంటే చాలా సరదా. మా స్నేహితులకి అలాంటి మంచి లక్షణాలు లేదు. ఇప్పుడు హాలిడేస్ కాదా వాళ్ళు అంతా కలిసి సరదాగా గడపడానికి టూర్ వెళ్ళారు. నాకు అమ్మని వదిలి ఎక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. పైగా కంప్యూటర్ అంటే ఇష్టం అని క్లాస్ లో జాయిన్ అయ్యాను. ఆ క్లాస్ దయవల్ల నాకు ఒక రాక్షసి పరిచయం అయ్యింది. థాంక్స్ టు గాడ్ అంటూ నవ్వేస్తాడు సూర్య. సూర్య నీకు అమ్మ అంటే అంత ఇష్టమా. అవును అంజలి నాకు మా అమ్మే శ్వాస, నా గుండె చప్పుడు. నిజంగా మీ అమ్మ చాలా అదృష్టవంతురాలు సూర్యా. అవును సూర్య ఇందాక క్లాసులో ఎవరో రాక్షసి పరిచయం అయ్యింది అన్నావు ఎవరు అది. అంజలి నేను అలా చెప్పింది నిన్నే అంటూ మెల్లగా నవ్వుతాడు సూర్య. ఏంటి ఆ రాక్షసిని నేనా అంటూ చాలా కోపంగా చూసి కొట్టడానికి ప్రయత్నిస్తుం ది అంజలి. ఇంతలో సూర్య పరుగులు తీస్తాడు అంజలికి దొరక కుండా. హే సూర్య ఆగు లేకపోతే చంపేస్తా అంటూ అంజలి తనవెనకనే పరుగులు తీస్తుంది. ఇంతలో సూర్య ఇల్లు వస్తుంది. సూర్య నేరుగా ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు. అంజలి కూడా వెనుకనే వెళ్ళిపోతుంది. సూర్యని చుసిన మీనాక్షి ఆశ్చర్యపోతుంది. ఏంటి సూర్య అప్పుడే వచ్చేశావు ఏమయింది అంటూ అడుగుతుంది. ఏమి లేదు అమ్మా అంటూ జరిగినదంతా చెబుతాడు సూర్య. ఇంతలో అంజలి వాళ్ళ ఇద్ధరిదగ్గరకు వచ్చి పరుగు ఆపుతుంది. అంజలిని చూసిన మీనాక్షి, ఎవరమ్మా నువ్వు లోపలి వచ్చావు ఎవరు కావాలి అని అడుగుతుంది. ఇంతలో సూర్య అమ్మా నేను చెప్పానే ఆ అమ్మాయి. ఆ అమ్మాయి అంటే ఎలా తెలుస్తుందిరా నాకు. అదేనమ్మా మా క్లాసుకి తెలుగు అమ్మాయి వచ్చింది అన్నానే ఆ అమ్మాయి. నువ్వామ్మా మీరేకదా మా చెల్లెలి ఇంటికి రెంటుకి వచ్చింది. అవును ఆంటీ అంటూ మీనాక్షి పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకుంటుంది అంజలి. దీర్గాఇష్షుతో వర్దిల్లమ్మా అంటూ అంజలిని పైకి లేపుతుంది మీనాక్షి. నీపేరు ఏంటమ్మా. నాపేరు అంజలి ఆంటి. అమ్మ ఈ గిన్నె మీకు ఇచ్చిరమ్మంది అందుకే వచ్చాను తీసుకోండి అంటూ ఆ గిన్నెని ఇస్తుంది. ఆ గిన్నె తెసుకొన్న మీనాక్షి ఒక్క నిమిషం కూర్చోమ్మా నేను ఇప్పుడే వస్తాను అంటూ వంటగదిలోకి వెళుతుంది. ఆ పాత్రలోపల ఏమో వున్నట్టు గలగలా అంటుంది. ఆ పాత్ర మూత తెరిచి చూస్తుంది మీనాక్షి. అందులో పసుపు, కుంకుమ, గాజులు, పూలు వుంటుంది. మీనాక్షి ఆ గిన్నెను అలాగే పక్కన పెట్టి కాఫీ తయారు చేస్తూ వుంటుంది అంజలి కోసం. హే అంజలి రా ఇల్లు చూపిస్తా అంటూ లోపలి తీసుకెళతాడు సూర్య. ఇల్లు మొత్తం చూపించి ఆఖరిగా వంటగదిలోకి తీసుకెళతాడు. అంజలిని చూసిన మీనాక్షి కాఫీనీ సూర్యకి, అంజలికి ఇద్దరికి ఇస్తుంది. అంజలి ఏంటి ఈ గిన్నెలో ఇవన్నీ వుంది. ఆంటి అది అమ్మ పెట్టింది. ఎవరైనా కొత్తవాళ్ళు పరిచయం ఐతే ఆ ఆడవారికి అమ్మ తప్పకుండా ఇవి పంపుతుంది. సరే అంజలి అమ్మకు థాంక్స్ చెప్పు ఈసారి అమ్మని ఇక్కడికి పిలుచుకు రా అంటుంది మీనాక్షి. అలాగే ఆంటి నేను తెసుకోస్తా. ఇక వెళ్ళొస్తా ఆంటి అంటూ అంజలి బయలుదేరుతుంది. రేయ్ సూర్య అంజలిని ఇంటి దగ్గర దిగపెట్టిరా అంటుంది మీనాక్షి.
అంజలి: వద్దు ఆంటి నేను వెళ్ళగలను.
మీనాక్షి: అలా కాదమ్మా కొత్త చోటు కదా ఆడపిల్లవు ఎలా ఒక్కదాన్నే పంపాను.
సూర్య: అమ్మా! అంజలి వద్దు అంటే మనం ఎలా ఒంటరిగా పంపుతాము. నేను వేల్లోస్తాలే అమ్మా.
మీనాక్షి: సరే నాన్నా వెళ్లి రండి. జాగ్రత్త.
అంజలి నీకు దైర్యం ఎక్కువ కదా. అందుకే నేను ఒక్కదాన్నే వెళ్ళగలను అన్నావు కదా అంటూ నవ్వుతాడు సూర్య. ఇద్దరు మంచి స్నేహితులు అవుతారు. హేయ్ అంజలి నీకో surprise అంటూ సూర్య రోజు సాయంత్రం గడిపే పార్కుకు తీసుకెళతాడు అంజలిని. ఏంటి సూర్య పార్కుకు తీసుకొచ్చావు. ఇది నాకు చాలా ఇష్టమైన పార్కు అంజలి. నేను రోజు ఇక్కడే గడుపుతా అంటూ తను రోజు కూర్చొనే బెంచులోనే ఇద్దరు కూర్చొని చాలా సేపు మాట్లాడుతారు. చాలా సేపు తరువాత మళ్లీ అంజలి, సూర్య బయలుదేరుతారు. అంజలి వాళ్ళు ఇంటికి వెళ్ళే సమయంలో అంజలి ఒక std బూత్ చూస్తుంది. హేయ్ సూర్య నాకు ఎందుకో శ్రీజిత్తుతో మాట్లాడాలని వుండి సూర్య, అంటూ తను డైరెక్టుగా లోపలి వెళ్లి శ్రీజిత్ కి పక్కింటి వాళ్లకి ఫోన్ చేస్తుంది. వాళ్ళు ఫోన్ తీసి అమ్మ శ్రీజిత్తువాళ్ళు హైదరాబాదుకు వెళ్ళిపోయారు. శ్రీజిత్ చదువుకోసం అని వెళ్ళిపోయారు. వాళ్ళ వివరాలు మాకేమి తెలియవు అంటూ ఫోన్ పెట్టేస్తుంది ఫోన్ లో మాట్లాడిన పెద్దావిడ. అంటే ఆ మాటలు విన్న అంజలి ఏడుస్తూ బయటకు వస్తుంది. అది చూసినా సూర్య హేయ్ అంజలి ఏమైంది రా ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అంజలి వోదారుస్తూ కారణం తెలుసుకోవాలని అనుకుంటాడు. జరిగినదంతా చెబుతుంది అంజలి. అంజలి ఏడుపు చూసి ఇద్దరి మద్యన స్నేహమా లేక ప్రేమా అనే ఆలోచనలో పడుతాడు సూర్య. ఏడుస్తున్న తనని ఎలా ఓదార్చాలో తెలియక అంజలిని ఇంటికి తీసుకెళతాడు సూర్య. గుమ్మం ముందే ఆగిపోయి సరే అంజలి నేను వెళ్ళొస్తా అంటూ వెళ్ళిపోతాడు సూర్య.
ఇలా ఇద్దరికి కంప్యూటర్ క్లాసెస్ కూడా పూర్తి అయిపోతుంది. అంజలి కుటుంబానికి సూర్య బాగా దగ్గర అయ్యాడు. అంతే కాదు సూర్య తోడుంటాడుకదా కదా సూర్య చదవబోయే కాలేజీలోనే అంజలి జాయిన్ చేస్తాడు అంజలి నాన్న. ఇలా ఇద్దరు కాలేజీలైఫ్ లోకి అడుగు పెడుతారు. కాని అంజలి మాత్రం శ్రీజితుని మరచిపోలేదు. అతనిని ఎలా కలుసుకోవాలి అని వాళ్ళ ఇద్దరు కలిసి చదివిన స్కూలుకి ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఇలా వాళ్ళ డిగ్రీ కూడా పూర్తయ్యి ఇద్దరు MBA ఆఖరి సంవత్సరంలోకి అడుగుపెడుతారు. ఆ రోజు అంజలి పుట్టిన రోజు. సూర్య వాళ్ళ అమ్మకి, నాన్నకి స్వీట్స్ ఇవ్వడానికి అంజలి వెళుతుంది. అందరికీ స్వీట్స్ ఇచ్చిన అంజలి, సూర్యని వెతుకుతూ ఉంటుంది. అక్కడ సూర్య వుండడు. ఆంటి సూర్య ఎక్కడ అని మీనాక్షిని అడుగుతుంది. ఏమో తెలియదు అంజలి నాతో ఏమి చెప్పలేదు అంటుంది మీనాక్షి. అంజలికి డౌట్ వస్తుంది ఒకవేళ వాడు పార్కులో ఏమైనా వున్నాడేమో అని. వెంటనే అంజలి పరుగులు తీస్తూ పార్కుకు వెళుతుంది. హేయ్ ఇడియట్ నీకోసం ఇల్లంతా వెతికితే నువ్వు పార్కులో ఏం చేస్తున్నావు అంటూ ఆ బెంచ్లో పక్కన కూర్చొని స్వీట్ బాక్స్ ఓపెన్ చేసి సూర్యకి ఆ బాక్స్ ఇస్తుంది అంజలి. ఏంటి రా అలా ఉన్నావు స్వీట్ తేసుకో అంటూ సూర్య మొహం వైపు చూస్తుంది అంజలి. అంజలి happy birthday రా అంటూ ఆ స్వీట్ తీసి అంజలి నోటిలో పెడుతాడు సూర్య.
సూర్య: అంజలి నేను ఒకటి అడగాలి నువ్వు ఏమి అనుకోవు కదా.
అంజలి: ఏంటి రా అడుగు. ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నావు ఏమైంది.
సూర్య: నాకేమి కాలేదు అంజలి. నువ్వు శ్రీజిత్తుని ప్రేమిస్తున్నావా. నిజం చెప్పరా. నాకు ఎందుకు అలా అనిపించింది అంటే నువ్వు ఇంకా శ్రీజిత్తుని మరచిపోలేదు.
ఎప్పుడు అతని గురించే మాట్లాడుతున్నావు. ఇప్పటికి శ్రీజిత్ తరువాతే నేను అంటున్నావు. అందుకే అడుగుతున్నాను అంజలి నిజం చెప్పు.
అంజలి: సూర్య ప్రతి ఒక్కరికి స్నేహం అంటే చులకన ఐపోయింది. నాకు శ్రీజిత్ ఎప్పటికి స్నేహితుడు. ఇంతవరకు నా మనసులో ఎవరికి స్థానం ఇవ్వలేదు. ఐన ఎందుకు నువ్వు SUDDENగా అడుగుతున్నావు. ఏమి లేదు సరదాగానే అడిగా అంజలి అంటూ సూర్య మాట మార్చేస్తాడు. సరే వెళదాం పదా అంటూ ఇద్దరు అక్కడినుండి బయలుదేరుతారు. ఆ రోజు వాళ్ళ కాలేజీలో campus selections జరుగుతున్నాయి. వీళ్ళ ఇద్దరు ఆ interviews కి అటెండ్ అవుతారు. ఇద్దరు సెలెక్ట్ అవుతారు. కాని 3 నెలలు ట్రైనింగ్ అది హైదరాబాదులో......! ఇద్దరికి ఒకే campusలో సీట్ రావడం అంజలికి, సూర్యకి చాలా సంతోషం అనిపిస్తుంది. అంతే కాదు ఇద్దరి కుటుంబాల్లోనూ ఆనందం సరితూగుతోంది. అంతే కాదు రెండు కుటుంబాలు ఒకరికొకరు చాలా దగ్గర అవుతారు. ఇలా ఇద్దరికి ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి. holidays అవడంతో అంజలి వాళ్ళ parents ని అడుగుతుంది, ఒకసారి మన ఊరికి వెల్లి వద్దాం అని. అందుకు శంకర్ లేదు అంజలి నాకు పని వుండి. ఆఫీసులో లీవ్ దొరకదు అని అంటుండంగానే అక్కడికి సూర్య వస్తాడు. ఏంటి అంకుల్ లీవ్ లేదు అంటున్నారు. ఏంలేదు సూర్య ఎందుకో అంజలి మన వూరు వెల్లొద్దాం అంటోంది, కాని నాకు లీవ్ లేదు సూర్య అదే అంజలి చెపుతున్నాను నువ్వు ఇంతలో వచ్చావు. సరే అంకుల్ పర్లేదు మీరు బిజీ అయితే అంజలి కోసం పని మానకండి. నేను అంజలికి తోడుగా వెళ్ళొస్తా అంటాడు సూర్య. సరే నాన్న నేను, సూర్య వెల్లొస్తాం మన ఊరు. సరే సూర్య నువ్వు ఇంట్లో కూడా ఒక మాట చెప్పు అంటూ శంకర్ ఆఫీసు కి వెళతాడు. అంజలి నువ్వు రెడీ అవ్వు, ఇవాళ ఫ్రెండ్స్ మన కాలేజీలో వీడ్కోలు పార్టీ వుండి. అలాగే సూర్య బయలుదేరుతాను. సాయంత్రం పార్టీకి ఇద్దరు అటెండ్ అవుతారు. అందరు పాటలతో, డాన్సులతో చాలా సంతోషంగా వుంటారు. అప్పుడు సూర్య మెల్లగా అంజలి దగ్గరకు వస్తాడు. అంజలి నువ్వు మీ ఊరికి వెళ్ళాలి అన్నది శ్రీజిత్ గురించి ఏమైనా తెలుస్తుంది అనే కద. అవును సూర్య ఎందుకంటే ఇక మనం జాబు ట్రైనింగ్ పేరుతో హైదరాబాదుకి వెళ్ళిపోతే మరి మనకు టైం సరిపోదు మన సొంతపనులు చేసుకోవడానికి. అందుకే ఆఖరిగా ఒకసారి ప్రయత్నించాలి అని వెళదాం అనుకొంటున్నాను. సరే రా నీకోసం నేను వస్తాను అన్నగా మరి ఇలా మూడ్ అవుట్ చేసుకొని ఇలా ఒక పక్కగా నువ్వు కూర్చుంటే నేను ఎలా సంతోషంగా వుండను. నువ్వు అలా వుంటే నేను బరిమ్చాలేను అంజలి. నీకు శ్రీజిత్ ఎక్కువ కావచ్చు. నువ్వు నాకు అంతకంటే ఎక్కువ. నాముందు మాత్రం నువ్వు ఎప్పుడు దిగులుగా కూర్చోకు అంటూ చేయి పట్టుకొని తీసుకెళ్ళి అంజలిని స్టేజిపైన డాన్సు వేస్తున్న వాళ్ళ ఫ్రెండ్స్ ముందు వదులుతాడు సూర్య. అందరు పార్టీ ఎంజాయ్ చేస్తారు.
అంజలి, సూర్య ఇద్దరు బయలుదేరి అంజలి పుట్టి పెరిగిన ఊరికి చేరుకుంటారు. అక్కడ బస్ స్టాప్ లో దిగిన అంజలి నేరుగా తను చదివిన స్కూలుకె వెళుతుంది సూర్యతో. అక్కడ ప్రిన్సిపాల్ నే అడుగుతుంది శ్రీజిత్ వివరాలు.అందుకు స్కూల్ ప్రిన్సిపాల్ వాళ్ళు హైదరాబాదులో వున్నారనే తెలిసింది అంజలి. నేవ్వేమో పిచ్చిదానిలా ప్రతి 6 నెలలకు ఒకసారి ఫోన్ చేసి అడుగుతున్నావు. కాని శ్రీజిత్ ఇంతవరకు ఫోన్ చేయనేలేదు. మరి శ్రీజిత్ ఇంకా నిన్ను గుర్తు పెట్టుకొని ఉన్నాడో లేక మరిచిపోయాడో తెలియదు. నువ్వు పడే తపన చూస్తే నీలాంటి స్నేహితులు ఇంకా వున్నారా అనిపిస్తుంది. సరే సర్ నేను బయలుదేరుతాను అంటూ సూర్యని తెసుకొని అంజలి బయలుదేరుతుంది. హేయ్ అంజలి సర్ ఏదో అన్నారు అని దిగులుపడకు. తప్పకుండా శ్రీజిత్ నిన్ను మరిచిపోయి వుండడు. నేను బాధపడుతోంది అందుకు కాదు సూర్య, నాకు కాంటాక్ట్ లోకి కూడా రాలేనంత ఇబ్బందుల్లో వున్నాడేమో అని బయం వేస్తోంది. శ్రీజిత్ ఎక్కడున్నా బాగుండాలి అని కోరుకుంటున్నాను సూర్య. ఇద్దరు మళ్లీ బెంగులూరుకి బయలు దేరుతారు.
**********************************
ఇద్దరు హైదరాబాద్ చేరుకొంటారు. జాబు ట్రైనింగ్ కోసం ఎన్నో కాలేజీలనుండి ఎంతో మంది వచ్చుంటారు. మొదటిరోజు ట్రైనింగ్ క్లాసులోకి వెళతారు అందరు. క్లాసులోకి ఎంటర్ అవుతారు సూర్య, అంజలి. క్లాసులోకి ఎంటర్ అవగానే మొదటి బెంచీలో కుర్చోమ్తారు ఇద్దరు. ఒక row లో 3 చైర్స్ వుంటాయి. మద్యలో అంజలి కూర్చొంటుంది. కుడిపక్కన సూర్య కూర్చొంటాడు. ఒక అబ్బాయి వచ్చి అంజలికి ఎడమపక్క కూర్చొంటాడు. ఆ అబ్బాయి కన్ను ఆర్పకుండా అంజలివైపే చూస్తూ వుంటాడు క్లాస్ అయ్యే అంతవరకు. ఆ అబ్బాయిని గమనిస్తాడు సూర్య. అంజలి నీకోవిషయం చెప్పాలి, నీ పక్కన కూర్చొన్న వాడు నిన్నే చూస్తున్నాడు అంటూ ఆ అబ్బాయి వైపు చూస్తూ అన్జలితో అంటాడు సూర్య. రేయ్ సూర్య ఇది మన ఊరు కాదు నీ రౌడీ ఇజం చూపించడానికి. మాట్లాడకుండా కూర్చో అంటుంది అంజలి. ఇంతలో లంచ్ బ్రేక్ ఇస్తారు. అంజలి, సూర్య పైకి లేస్తారు కుర్చీలో నుండి. అంజలి పక్కన కూర్చొన్న అబ్బాయి అంజలి చేతి వెళ్లు గట్టిగా పట్టుకుంటాడు. వులిక్కిపడ్డ అంజలి ఒక్కసారిగా వెనక్కు చూసి అలాగే బొమ్మలా నిలబడిపోతుంది. ఏమైంది అంజలి అలా వెనకవైపు చూస్తున్నావు అంటూ అంజలి వెనుక చూస్తాడు. ఆ అబ్బాయి అంజలి చేయి పట్టుకోనుండడం చూస్తాడు సూర్య. వాడిని చంపేయాలన్నంత కోపంతో ముందుకు ఒక అడుగువేస్తాడు సూర్య. అంతలో అంజలి ఆ అబ్బాయిని చంపపై కొట్టి i miss u రా అంటూ ఆ అబ్బాయి రెండో చేయి అంజలి పట్టుకుంటుంది. సూర్యకి ఏమి అర్థం కాక అలాగే ఆలోచనలో పడుతాడు. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను రా అంజలి అంటూ ఆ అబ్బాయి అంటాడు. హేయ్ సూర్య ఇతను ఎవరో తెలుసా అంటూ సూర్య వైపు చూస్తుంది అంజలి. అందుకు సూర్య తెలియదు అంటాడు. ఇతనే శ్రీజిత్ అంటూ సూర్యకి పరిచయం చేపిస్తుంది అంజలి. ఏంటి ఇతను ------ శ్రీజిత్? హాయ్ శ్రీజిత్ నిజంగా మీరు చాలా లక్కీ ఎందుకోతెలుసా అంటూ అంజలి తన కోసం ఎంత ప్రయత్నించిందో అన్నీ చెబుతాడు సూర్య. సారీ అంజలి నిజంగా నేను ఫ్యామిలీ tensions వల్లనే నిన్ను కాంటాక్ట్ అవలేకపోయాను. కాని నిన్ను ఇలా ఈ విధంగా చూస్తానని అనుకోలేదు తెలుసా అంటాడు శ్రీజిత్. సరే రండి బోంచేస్తూ మాట్లాడుకొందాము అని అందరు బయలుదేరుతారు క్లాస్ నుండి. ఇక ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు కలిసే వెళుతారు, అంత క్లోజ్ అయ్యారు శ్రీజిత్, సూర్య కూడా. హాస్టల్ కూడా సూర్య, శ్రీజిత్ కలిసి ఒకే రూం తీసుకొంటారు.
ఒకరోజు సూర్య, శ్రీజిత్ ఏమైనా అంజలిని ప్రేమిస్తున్నాడేమో తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఎందుకంటే సూర్య మనసులో అంజలి లాంటి అమ్మాయి బార్యగా వస్తే లైఫ్ బాగుంటుంది అన్న ఆలోచన ఉంటుంది కాబట్టి. సూర్య దైర్యం చేసి హాస్టల్ రూములో వున్న శ్రీజిత్ పక్కన వెళ్లి కూర్చొని, శ్రీజిత్ నువ్వు ఎవరినైనా ప్రేమించావా అంటూ మొదలుపెడుతాడు.
శ్రీజిత్: నేను ఎవరిని ఇంతవరకు ఇష్టపడలేదు సూర్య.
సూర్య: అవునా అంటూ కొంచం ఊపిరి పీల్చుకుంటాడు సూర్య.
శ్రీజిత్: నేను నిన్ను ఒక విషయం అడగాలి సూర్య.
సూర్య: అడుగు శ్రీజిత్.
శ్రీజిత్: అంజలి ఎవరినైనా ప్రేమించిందా?
సూర్య: అంజలి ఎవరిని ప్రేమించలేదు. ఎప్పుడు నీగురించి చెబుతూ ఉంటుంది. నేను పోరాబతి నిన్నే ప్రేమించిందేమో అనుకొన్నాను. అందుకే నిన్ను అడిగాను నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని.
శ్రీజిత్: అంజలి నాకు మంచి స్నేహితురాలు. తనని ఎప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదు సూర్య.
సూర్య: నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ఆడ,మగ స్నేహం అంటే ప్రేమ అనే అర్థం. కాని మీ ఇద్దరిని చూస్తుంటే నిజమైన స్నేహానికి ఊపిరి పోస్తున్నట్లు వున్నారు.
శ్రీజిత్: సూర్య నీకో విషయం చెప్పాలి. అది నీతో ఎందుకు discuss చేయాలనుకుంటున్నాను అంటే అది అంజలికి సంబందించిన విషయం.
సూర్య: ఏంటి శ్రీజిత్ ఉన్నట్లుండి నీ మొహం లో ఏదో దిగులు ఏంటి చెప్పు.
శ్రీజిత్ చెప్పడం ప్రారంభిస్తాడు. మేము ఇంటర్ చదివే రోజుల్లో మా క్లాసులో భూపతి అనే అబ్బాయి వుండేవాడు. మేమందరం చిన్నప్పటి నుండి ఒకే స్కూల్. తను అంజలిని ప్రాణంకంటే ఎక్కువగా ఇష్టపడేవాడు. అంజలికి ఈ విషయం తెలియదు. తన చదువుకు ఆటంకం కాకూడదని నేనే ఆ అబ్బాయిని నచ్చచెప్పాను. మా exams అయ్యాక భూపతి తన ప్రేమ విషయం అంజలికి చెప్పాలని అనుకున్నాడు. కాని అదే సమయానికి వాళ్ళ నాన్న చనిపోయారు. ఆ మరుసటి రోజే అంజలి బెంగలూరుకి వచ్చేసారు. కాని భూపతి ఇప్పటి వరకు అంజలినే తలుచుకుంటున్నాడు. అంజలికి పెళ్లి PROPOSAL చేసేలోపు తను లైఫ్ సెటిల్ చేసుకొని అంజలికి ఎదురు పడాలని అనుకుంటున్నాడు . కాని అతను అంజలిని ఎంతగా ఇష్టపడుతున్నాడంటే తను గుండె చప్పులో కూడా అంజలి పేరును నింపుకున్నాడు. అంజలినీ పెళ్లి చేసుకోన్నాక తనకి ఏ కష్టం రాకూడదని అన్ని .
(still CONTINUE)
No comments:
Post a Comment