ను వ్వెవరే -------- ఓ మనసా?
ఇంతలో కాలేజీ వచ్చింది కాని తన్మయిలో ఏదో దిగులు. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటావు, ఈరోజు నీ బాడీగార్డ్ కచ్చితంగా మన కాలేజీ గేటు దగ్గర వుంటాడనుకొంటున్నానే అంటుంది కాంచన. చూడు కాంచనా వాడు ఎక్కడుంటే నాకేంటి. నేనే వాడిగురించి ఆలోచించట్లేదు. మరి నువ్వు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు. పాపం తన్మయి చాలా రోజుల నుండి వాడు నీవేనకే తిరుగుతున్నాడు. నాకే పాపం అనిపిస్తోంది మరి నీకు ఎప్పుడు అనిపించలేదా. చూడు కాంచనా ఒకరిని చూసినంత మాత్రాన మనం వారి మనసులో ఏముందో ఊహించలేము కదా....? సరే నువ్వన్నదే నిజమనుకుందాము నిన్ను ఒక ప్రశ్న అడగనా. సరే అడుగు పెధవిదాకా వచ్చింది, మరి పెదవి దాటడానికి ఎందుకె ఆలోచన. నీకు ప్రేమంటే నమ్మకంలేద లేక మగాడిపైనే నమ్మకంలేదా తన్మయి. ఒకరిని నమ్మాలి అంటే మన జీవితంను వాళ్ళ చేతిలో పెట్టడం. కాబట్టి నా మనసునే నేను నమ్మి మోసపోలేను. నేను అంతే వదిలేసే కాంచనా. నువ్వు ఈ జన్మకు మారవు. వాడేమో నీ వెంటపడడం మానడు. నువ్వేమో మారవు. చూస్తా తన్మయి నీదా, అతనిదా పైచేయి.
చూడు నీవల్ల సగం చచ్చిపోయాను. ఇంకా మిగిలిన సగాన్ని మెల్లగా చంపేస్తున్నావు. ఎందుకు నాపైన నీకు ఇంత పగ. దయచేసి నాదారిన నన్ను వదిలే. నిన్ను నేను మరిచిపోయి చాలా కాలం అయ్యింది. ఇకపై మా కాలేజి గేటు దగ్గర ఇంకా ఇక్కడ నాకోసం ఉండకు. ఇంకోసారి నాకు నీ మొహం చూపించకు. అలా కాదని నన్ను మళ్లీ కలవడానికి ప్రయత్నించావో నీకు చివరిచూపుగా చూసుకోవడానికి నా సెవం కూడా దొరకదు అని చెప్పడానికే వచ్చా bye. తన్మయి ఉరితీసే ముందు ముద్దాయికైనా తన మనసులోని మాటలు చెప్పుకునే అవకాసం ఇస్తారు. కనీసం ఆ అవకాసం కూడా నాకు ఇవ్వవా? అవకాసం అనేది అవకాసవాదివి నువ్వు అడగకూడదు. అయినా నువ్వు ఇంతసేపు నాతో మాట్లాడడానికి అవకాసం ఇచ్చాను అదే నీకు ఎక్కువ. గుడ్ బాయ్............
చి---చి--- ఎప్పుడు ఇంతే ఈ బస్సులు! టైంకి రావు. అమ్మాయిలని ఏడిపించే రోమియోలకేమో టైంపాస్. మాకేమో టైంకి రాలేదని ఇంట్లో, కాలేజీలో తిట్లు. ఏంటేతన్మయి పోదున్నే మొదలు పెట్టావా నీ శాపనార్ధాలు. మరేంటేకాంచనా ఒక టైంలేదు పాడులేదు. నాకు మాత్రం అన్నీ సకాలంలో జరగాలి. ఇది నా పద్ధతి, ఇతరుల గురించి నాకు వద్దు. ఏంటి తన్మయి ఎప్పుడు చిర్రుబుర్రులాడుతూ ఉంటావు. అసలు నవ్వనే నవ్వవా నువ్వు, నీ మనసుని ప్రశాంతంగా వుంచుకోవా. ఏమైందే నీకు......? ఎప్పుడు ఎందుకు మూడౌట్లో ఉంటావు. సరే మళ్లి మాట్లాడదాము కాని బస్ వచ్చింది ఎక్కు కాంచనా.
అమ్మా, అమ్మా ------ ఎక్కడున్నావు. నాకు టైం అవుతోంది వెళ్ళొస్తా. అమ్మా తన్మయి రోజు సాయంత్రం అనాధశరణాలయంకెళ్ళి ఉచితంగా పిల్లలికి ట్యూషన్ చెబుతున్నావ్. అందరికి సహాయం చేస్తున్నావు. నువ్వు ఎలా వుండేదానివి ఇలా మారిపోయావు. నీ గురించి ఆనందించాలో లేక నవ్వుని, స్నేహితులని అందరిని దూరంగా వుంచి ఒంటరిలా మారినందుకు బాధపడాలో తెలియట్లేదు. నీ గురించి ఆలోచిస్తుంటే చాలా బయంవేస్తోంది తన్మయి. సరే అమ్మ నాకు టైం అయ్యింది పిల్లలందరూ ఎదురుచూస్తుంటారు వస్తాను. ఎప్పుడు ఈ విషయం మాట్లాడినా మాట దాటేస్తున్నావు. సరే వెళ్లిరా తన్మయి. కాని ఒక్క విషయం, నీ మనసు అడిగే ప్రశ్నలకు నీ దగ్గర జవాబు వుందో లేదో తెలుసుకో. నా మనసా-----? అమ్మా అది నాకు దూరమై ఎంతో కాలం అయ్యింది. నాకు దూరమైనా దాని గురించి నేను ఎప్పుడు ఆలోచించను వస్తానమ్మా.
హాయ్ పిల్లలు ఏంటి ఇవాళ అందరు మౌనంగా వున్నారు. పాటాలు వినే స్థితిలో మీరు లేనట్లున్నారు. సరే ఇవాళ మీకు ఏం పాటం చెప్పమంటారో మీరే అడగండి. అక్కా నేనోక్కటి అడగనా మరి నువ్వు నన్ను తిట్టకూడదు. ఏంటమ్మ అడుగు నిన్నెందుకు కోప్పడుతా. అక్కా పాపం శ్రీ వసంత్ అన్నయ్య, ఎప్పుడు దిగులుగా ఉంటున్నాడు. మాతో కూడా ఆడుకోవట్లేదు, ఇక్కడికి వచ్చినా ముందులా మాతో సరదాగా ఉండట్లేదు. నువ్వు ఒక్కసారి తనతో మాట్లడక్కా. చుడండి మీరు చిన్నపిల్లలు ఇలాంటి విషయాలు మీరు మాట్లడకుడదు. మీ బుక్స్ తీసి చదవండి.
హే శ్రీ వసంత్ ఏంట్రా అలా ఉన్నావు. మళ్లీ తన్మయి నీతో ఏమైనా గొడవ పడిందా. అమ్మాయిలు అందరూ అంతేరా నువ్వు బాధపడకు. నువ్వు కాబట్టి ఇంకా తన్మయి---- తన్మయి--- అంటూ జపం చేస్తున్నావు. ఎన్ని రోజులుగా నువ్వు తన వెంట తిరుగుతున్నావు మన్నించమని అడగడానికి. కాని తనేమైనా నిన్ను మన్నించిందా, లేదుగా!. మరి ఎందుకు తన వెనుకనే కుక్కలా తిరుగుతున్నావు. వదిలే తన్మయిని నువ్వు ఒక్కసారి ఊ అను ఎంతమంది అమ్మాయిలు నీ చుట్టూ చేరి చెక్కర్లు కొడుతారో. నిజంగా తన్మయిని మంచి అమ్మాయి అనుకున్నా. కాని నీవిషయంలో తను తప్పు చేస్తోంది అనిపిస్తోంది శ్రీ వసంత్. నిజానికి నేను తన్మయిని ఇంతగా ఇష్టపడటానికి కారణం తెలుసా శరత్. ఇంకో అమ్మాయిని నేను ప్రేమిస్తే కేవలం నాకు బార్యమత్రమే అవుతుంది. కాని తన్మయి అమ్మ ప్రేమను పంచి జీవితాంతం నన్ను పసిపిల్లాడిగా కనిపెట్టుకుంటుంది. కాని నన్ను చీదరించుకొంటోంది తన్మయి అదే ఆ అమ్మాయి స్థానంలో ఇంకొకరు ఉండుంటే నన్ను చంపేసేవాళ్ళు. ఏంట్రా నువ్వనేది నువ్వు ఏం చేసావు. ఏమైంది అసలు నిజం చెప్పు లేకపోతే నేను నిన్ను చంపుతా. శరత్ నువ్వు పైచదువులకోసం విదేశాలకి వెళ్లావు కదరా అప్పుడు నిన్ను airport లో వదిలి నేను, మన గణేష్ ఇద్దరం బైక్లో ఇంటికి వస్తూ వున్నాము. నా వెనుక కూర్చొని వున్న గణేష్ తో మాట్లాడుతో ముందు busstop లో బస్ కోసం వున్న అమ్మాయికి డేష్ ఇచ్చాను. మేము కింద పడ్డాం. luck ఏంటంటే ఆ అమ్మాయికి ఏం కాలేదు. నాకే కాలు ప్రాక్షర్ అయ్యింది. నేను పైకి లేయలేని పరిస్థితిలో ఉంటే గణేష్, ఆ అమ్మాయి ఇద్దరు నన్ను hospital లో join చేసారు. అమ్మ గురించి నీకు తెలుసుగా నేనంటే ప్రాణం. నాన్నగారు చనిపోయాక నాకు ఏలోటు లేకుండా చూడడానికి అమ్మ నానా కష్టాలు పడింది.ఈ విషయం అమ్మకి చెప్పకు అని నేను చెప్పేలోపే గణేష్ ఇంటికి phone చేసి అమ్మకి చెప్పాడు. ఈ విషయం అమ్మకి తెలిసి hospital కి నేరుగా వచ్చింది. ఆ అమ్మాయే accident చెసిందనుకొని అమ్మ బాగా అరిచింది తనని. పాపం ఆ అమ్మాయి బాగా ఏడుస్తోంది. అప్పుడు మెల్లగా గణేష్ అమ్మ దగ్గరకు వెళ్లి ఆ అమ్మాయి మమ్మల్ని గుద్ధలేదు, మేమే బైక్ లో వెళ్తూ ఆ అమ్మాయిని గుద్దాము. మన శ్రీ ని hospitalకు తీసుకొనిరావడానికి ఆ అమ్మాయి సహాయం చేసింది ఆంటి అని మెల్లగా చెప్పాడు. పాపం ఆ అమ్మాయి అప్పటికే బాగా ఏడుస్తోంది. కళ్ళు బాగా ఎర్రబడ్డాయి. ఆ అమ్మాయి మొహం చూసి నా మనసు కరిగిపోయింది రా శరత్. కాని నేను అమ్మా------ అమ్మా---- అని పిలుస్తున్నా కోపంతో ఆ అమ్మాయిని అరుస్తుందే కాని నామాటలు అమ్మకి వినపడనే లేదు. నిజం తెలుసుకొని అమ్మ ఆ అమ్మాయిని క్షమించమని అడిగింది. నా బిడ్డనికి కాపాడినందుకు నిన్నే తిట్టాను అంది. ఆ అమ్మాయి అమ్మ---!మీరు తిట్టినందుకు నాకు బాధగాలేదు, మీ ప్రేమను చూసి ఆనందిస్తున్నా అంది అమ్మతో. అలా అయితే ఆ కన్నీళ్ళు ఏంటి అని అమ్మ అడిగింది. అమ్మ ప్రేమను నేను అనుభవించలేదు, ఎందుకంటే నేను పుట్టగానే అమ్మ చనిపోయింది. నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నాన్న, మా నాయనమ్మ CAR ACCCIDENTలో చనిపోయారు. నా ఆస్థి కోసం బంధువులు ఉన్నారే కాని నా కోసం కాదు. ఇప్పుడు నేను ఒంటరిదాన్ని. అందుకే మీరు నన్ను తిడుతుంటే ఈ ప్రేమనే నేను కోల్పోయాను అనిపించింది అంటూ అలాగే నిలబడిపోయింది. అది విన్న అమ్మ చాలా ఏడిచింది. నీ పేరేంటితల్లి. నా పేరు తన్మయి అమ్మా. ఇకపై నీకు ఎవరున్నారు అని ఎవరైనా అంటే నేను వున్నాను అని చెప్పు సరేనా. మేము గాంధీనగర్, సాయిబాబా ఇంటి పక్కనే ఉన్నాము. నీకు వీలైనప్పుడల్లా వచ్చి వెళ్తూ వుండు తన్మయి. మీరు నేనున్నా అన్నారు నా మనసుకు అది చాలమ్మా. కాలేజీ టైం అయ్యింది నేను వెళ్ళొస్తా.
ఏంట్రా గణేష్ ఇప్పుడిప్పుడే నా కాళ్ళు బాగవుతోంది. మళ్లీ పొద్దున్నే ఇంటికి వచ్చి నన్ను బయటకి తీసుకేలుతున్నావు. ఈ విషయం అమ్మకి తెలిస్తే నిన్ను రేపటినుండి ఇంట్లోకే రానివ్వదు తెలుసా గణేష్. సరేలేరా బాబు అందుకేగా అమ్మ ఇంట్లో లేనప్పుడు ఇంటికి వచ్చి నిన్ను తీసుకెల్తున్నా . ఎక్కడికి ఇప్పుడు వెళ్ళేది చెప్పరా బాబు. మరేంలేదు శ్రీ ఇవాళ మా చెల్లలి BIRTHDAY అందుకే ఏదైనా డ్రెస్ కొందామని నిన్ను తీసుకెళ్లాలని అనుకుంటున్నా. రేయ్ నాకేం తెలుసురా లేడీస్ DRASSES గురించి. నాకు మాత్రం ఏం తెలుసు ఈ YEAR తనకి SURPRISE ఇవ్వాలని అనుకున్నా అందుకే ఇప్పుడు మనం కొనాలి. రేయ్ శ్రీ ఒకసారి BIKE ఆపు. అక్కడ ఒక అమ్మాయి రోడ్ దాటుతోంది చూడు ఆ అమ్మాయి మనం ACCIDENT చేసిన తన్మయిలాగా ఉందికదా. ఒరేయ్ గణేష్ లాగా వుండటం కాదు తన్మయినే. రా వెళ్లి పలకరిదాం. హాయ్ తన్మయిగారు ఎలా వున్నారు. నేను గుర్తున్నానా. ఎలా మరిచిపోతా మీ అమ్మగారితో బాగా చీవాట్లు పెట్టించారుగా. జరిగినదానికి సారీ తన్మయి. నా పేరు శ్రీ వసంత్, వీడు నా ఫ్రెండ్ గణేష్. ఏంటి తన్మయి ఎలావున్నారు. నేను బాగున్నాను గణేష్. తన్మయి నాకో హెల్ప్ కావాలి చేస్తారా. చెప్పండి గణేష్ ఏంటి. మా SISTERకి ఈరోజు పుట్టిన రోజు. తనకి డ్రెస్ కొనాలి కాబట్టి మీరు మాతో వచ్చి సెలెక్ట్ చేయాలి. అన్నయ్యగా అడుగుతున్నా రామ్మా ప్లీజ్. అలాగే గణేష్ వెళదాం పదండి. హేయ్ శ్రీ నువ్వు తన్మయిని తీసుకొని బొమ్మనా బ్రదర్స్ కి వచ్చే నేను ఆటోలో వచ్చేస్తా. అలాగే రా నువ్వు నేమ్మదిగారా మీ చెల్లలిని క్షేమంగా తీసుకోస్తా. చాలా థాంక్స్ తన్మయిగారు మా గణేష్ పిలవగానే మాతో వస్తున్నందుకు. దానికేముంది శ్రీ వసంత్ గారు పర్లేదు. మనం ఒకరికొకరు గారు అనిపిలుచుకుంటే ఏదోలా వుంది ప్లీజ్ నన్ను శ్రీ అనే పిలవండి. అలాగే, మీరు ఏం చేస్తున్నారు? నేను మార్కెటింగ్ SIDE వున్నా. కాబట్టి ఎప్పుడు తిరుగుతూనే వుంటాను. మరి మీరు తన్మయి. నేను DEGREE చదువుతున్నాను. మనం మాటల్లో పడి తొందరగా వచ్చేసాము. సరే మీరు ఇక్కడే ఉండండి నేను బైక్ పార్క్ చేసివస్తాను. ఇంకా గణేష్ రాలేదు వాడు వచ్చేలోపల ఒక కాఫీ అన్నా తాగాదాం రండి. తన్మయి మీరు, నేను shopping అయ్యాక ఇంటికి వెళ్తున్నాం. మిమ్మల్ని చూసి అమ్మా షాక్ అవ్వాలి. అయ్యో ఇప్పుడు వద్దు తర్వాత వస్తాను శ్రీ. అమ్మా మిమ్మల్ని రోజు తలుచుకుంటోంది. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి తర్వాత అమ్మతో మాట్లాడిస్తా. అలాగే శ్రీ ఇదే నా నెంబర్----. తన్మయి వెళదాం రండి గణేష్ నాకు కాల్ చేస్తున్నాడు బహుసా వాడు వచ్చేసినట్లు వున్నాడు.
అమ్మా తన్మయి నీకు ఏం నచ్చితే అదే తీసుకో. అలాగే గణేష్. ఏంటి అప్పుడే సెలక్షన్ అయ్యిందా సరే అదే తీసుకొంటున్నా. సరే తన్మయి మీ ఇల్లు ఎక్కడ చెప్పు మా శ్రీ నిన్ను డ్రాప్ చేస్తాడు. పర్లేదు గణేష్ నేను ఆటోలో వెళ్ళిపోతాను. చూడు తన్మయి మా కోసం నువ్వు ఇంతదూరం వచ్చావు. మీకోసం మేము ఆ మాత్రం చెయ్యలేమా. మా ఇల్లు శ్రీ ఇంటి దగ్గరే గణేష్. ఏంటి మా ఇంటి దగ్గరా. సరే మరేం అయితే నేను డ్రాప్ చేస్తాను, గణేష్ నువ్వు ఆటోలో వెళ్ళిపో. సరే bye వెళ్ళిరండి. తన్మయి మీ ఇంట్లో ఎవరెవరు వుంటారు. నేను మాత్రమే శ్రీ. ఒంటరిగా అంటే కష్టమేగా తన్మయి. "కష్టాన్ని ఇష్టంగా తీసుకొంటే ఎంతటి కష్టమైనా ఇష్టంగా మారుతుంది" శ్రీ. bike ఆపు ఇల్లు వచ్చేసింది. లోపలికి రండి శ్రీ కాఫీ, టి ఏదైనా తాగి వెలుదురు. ఇప్పుడు కాదు తర్వాత ఎప్పుడైనా అమ్మతో వస్తా bye. నా ఫోన్ నెంబర్ నుండి మీ నెంబర్ కి మిస్ కాల్ ఇష్తాను. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయండి తన్మయి. అమ్మా--- అమ్మా---- ఎక్కడున్నావు. ఇక్కడే వున్ననుకాని ముందు నువ్వు ఎక్కడికి వెళ్ళావో చెప్పు. ఇంకా నీ ఆరోగ్యం కుదుట పడనే లేదు అప్పుడే bike తీసుకొని బయటకి వెళ్ళావా. అమ్మా నాతో మళ్లీ పోట్లాడుధువు కాని నీకు బాగా ఇష్టమైన ఒకరిని కలిసా ఎవరో చెప్పుకో. ఏంట్రా నాకు ఇష్టమైన వారినా. తన్మయినా ఎక్కడ కలిసావు శ్రీ ఎలా ఉంది తను. అమ్మా తను వుండేది పక్క వీదిలోనే ఇప్పుడు నేనే తనని డ్రాప్ చేసి వస్తున్నా. మన గణేష్ చెల్లెలికి డ్రెస్ సెలక్షన్ కోసం అనుకోకుండా తన్మయిని తీసుకెళ్ళాం. రేయ్ నాకు ఒక్కసారి తన్మయిని చూడాలని వుంది తీసుకెల్లవా. అమ్మా ఇప్పుడా. అవునురా శ్రీ నా తొందరపాటు వల్ల ఆ అమ్మాయిని ఏడిపించా. ఇంకా నాకు తను కన్నీటి కళ్ళే గుర్తొస్తోంది. ఒక్కసారి తనని చూస్తే నా మనసు కుదుటపడుతుంది. సరే బయలుదేరు. అమ్మా ఇదే తన్మయి ఇల్లు. అమ్మా తన్మయి-----! ఎవరది వస్తున్నాను ఒక్క నిమిషం. అమ్మా మీరా నేను ఉహించనే లేదు మీరు వస్తారని. రండి లోపలికి. ఇంత పెద్ద ఇంట్లో ఒక్కటే ఎలా వుంటున్నావు తన్మయి. నేను ఒక్కటే ఉంటే బయం నాతో నాన్న, నాయినమ్మ ఆలోచనలు నావెంటే వున్నాయి. ఆ రోజు నిజా నిజాలు తెలుసుకోకుండా తొందరపడ్డా క్షమించమ్మా. అమ్మా మీరు పెద్దవారు అలా అనకండి. హాయ్ తన్మయి మిమ్మల్ని కలిసా అని చెప్పిన వెంటనే అమ్మా మీతో మాట్లాడాలని అంది. అందుకే మిమ్మల్ని disturb చేయక తప్పలేదు. శ్రీ మా ఇంటి కాలింగ్ బెల్ మ్రోగి చాలా కాలం అయింది. ఈరోజు నాకోసం ఒకరు వచ్చారని అది కూడా సంతోషంతో మోగింది తెలుసా. మరి అది disturb ఎలా అవుతుంది శ్రీ. సరే తన్మయి మేము వచ్చి చాలా సేపు అయ్యింది వెళ్ళోస్తాం. తన్మయి నువ్వు కాలేజికి వెళ్ళలేద. లేదు శ్రీ కొంచం తల నొప్పిగా వుందని కాలేజికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడే మీరుకలిసింది. అయ్యో సారీ తన్మయి. సరే మేము వేల్లోస్తాము. అమ్మా తన్మయి సాయంత్రం శ్రీని పంపుతా నువ్వు dinner కి మన ఇంటికే రావాలి మళ్లీ ఏం మాట్లాడకు. అమ్మా సాయంత్రం కొంచం లేట్ అవుతుంది మీకెందుకమ్మాశ్రమ. పర్లేదు ఇంకో రోజు వస్తా. తన్మయి మీరు వచ్చాకే బొమ్చేద్ధం సరేనా. మాకైతే ఏం ప్రాబ్లం లేదు. శ్రీ ప్లీజ్ మీరైనా అర్థం చేసుకోండి. పర్లేధమ్మ తన్మయి నువ్వు ఇంటికొచ్చాక శ్రీ కి కాల్ చెయ్యి వాడు వచ్చి నిన్ను తీసుకొస్తాడు. సరేనమ్మా వస్తాను.
(తన్మయికి ఫోన్ వస్తుంది) హలో తన్మయి గారేనా. అవును మీరు. మీరు చేస్తున్న మంచి పనులు చూసి సహాయం చేయాలనుకొన్న ఒక బాటసారి అనుకోండి. సరే చెప్పండి మీరు ఎందుకు కాల్ చేసారు. మేడం జాగ్రత్తగా వినండి ఇక్కడ ఆనంద్ నగర్ లో ఒక అమ్మాయి డ్రగ్స్ కొనుక్కోవడానికి రెడ్ కలర్ టీ షర్టులో వస్తోంది. మీరు కాని ఆ అమ్మాయిని follow అయితే మీకే అన్నీ తెలుస్తుంది. సరే ఇప్పుడే బయలుదేరుతున్నా. అతను చెప్పిన ప్లేస్ ఇదే మరి ఇంకా ఆ అమ్మాయి రాలేదే (అంతలో ఆ రెడ్ షర్టు అమ్మాయి వస్తుంది. తననే ఫాలో చేసి డ్రగ్స్ కొనుక్కుంటుండగా ఫొటోస్ తీస్తుంది తన్మయి). ఇంటికి చేరుకుంటుంది తన్మయి. అంతలో శ్రీ ఇంటి ముందర bike పైన కూర్చొని ఉంటాడు. అయ్యో శ్రీ సారీ నా work లో పడి మీరు వచ్చే సంగతే మరిచిపోయా. హేయ్ తన్మయి ఫ్రెండ్ కోసమేగా వెయిట్ చేశా ఇంకెవరికోసమో కాదుగా పర్లేదు మీరు లోపలికెళ్ళి నెమ్మదిగా రెడీ అయ్యి రండి నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. లేదు శ్రీ మీరు లోపలి రండి. ఈ టైములో నేను ఇంట్లోకి రావడం బాగోదు. చూడు శ్రీ మన మనసు మనకోసం బ్రతకాలి ఇరుగుపొరుగు వారికోసం కాదు. సరే తన్మయి మీతో పోట్లడలేను వస్తున్నా. సరే మీరు కూర్చోండి నేను వచ్చేస్తా. శ్రీ వెళ్దామా.
అమ్మా తన్మయి వచ్చింది చూడు. తన్మయి తింటూ మాట్లాడదాం రామ్మా. అమ్మా వంటలు నిజంగా చాలా బాగున్నాయి. చాలా రోజుల తర్వాత ఇలాంటి భోజనం తింటున్నా. నానమ్మ ఇలాగే చేసేవారు. అందుకే అలా అన్నా. అమ్మా నేను వెళ్ళొస్తా. శ్రీ నువ్వే ఇంటిదగ్గర వదిలి రా ఎందుకంటే ఇంత రాత్రి ఆటోలో వెళ్ళడం మంచిది కాదు. సరే తన్మయి జాగ్రత్తగా పడుకో bye. తన్మయి ఫొటోస్ తీసిన అమ్మాయి ఇంటికి పోస్ట్ ద్వారా ఆ ఫొటోస్ పంపుతుంది. అంతే కాదు "ఒక వ్యక్తి బవిష్యత్తు ఇంట్లో వాళ్ళ ప్రవర్తనలో కూడా ఆధారపడి వుంటుంది" అని లెటర్ కూడా రాసి పంపుతుంది.
అయ్యో టైం అయిపొయింది. రాత్రి బాగా తిన్ననుగా అందుకే బద్ధకం ఎక్కువ అయినట్లుంది. తొందరగా ఫ్రెష్ అయ్యి వెళ్ళాలి (తన్మయి మంచి మార్కులు వచ్చే పేదవారికి స్కూల్ ఫీజు కట్టడానికి హెల్ప్ చేస్తుంది. ఎలాగో తెలుసా చిన్న షాప్స్ దగ్గర నుండి పెద్ద షాప్స్ దగ్గర వరకు help the poor students అని ఒక హుండి పైన రాసి ఒవ్నర్స్ ప్రమేయంతో అక్కడ పెడుతుంది. ప్రతి నెలా మొదటి ఆదివారం అన్ని షాప్స్ దగ్గరకు వెళ్లి డబ్బు మొత్తం తీసుకొని మంచి రాంక్ వచ్చే పేద విద్యార్థులకు స్కూల్ ఫీజు కట్టడుతుంది). ఆ రోజు అన్ని షాప్స్కూ వెళ్లి అలాగే అన్ని హుండిలల్లో డబ్బు తీసుకొని వెళుతూ వుంటుంది. అనుకోకుండా అదే షాప్ కు వచ్చిన శ్రీ గమనిస్తాడు. తన్మయిని పలకరించడు. గమనిస్తూ తన్మయిని follow అవుతాడు. తన్మయి ఆ డబ్బును పేద విద్యార్థులకు స్కూల్ ఫీజుగా అందించడం చూస్తాడు. కాని అప్పుడు కూడా తన్మయితో మాట్లాడాడు. చాటుగా అంత గమనిస్తాడు. నా మనసులో మొదటిసారి నిన్ను చూసినపుడు ఏదో తెలియని అలజడి. ఇప్పుడు ఆ అలజడికి అర్థం తెలిసింది నువ్వు నాకు నచ్చావు తన్మయి.
రేయ్ శ్రీ నీ పుట్టిన రోజైనా నాతో గుడికి రారా. అప్పుడే నీకు మంచి అమ్మాయి బార్యగా వస్తుంది. అమ్మా గోల చేయకు వస్తానులే. రేయ్ శ్రీ అక్కడ గుడి చుడుతోంది తన్మయి కదూ. అవును అమ్మా, ఉండు నేను వెళ్లి తీసుకొస్తా తన్మయిని. హేయ్ శ్రీ మీరేంటి ఇక్కడ. నేను మీలాగే గుడికి వచ్చాను. అమ్మే మిమ్మల్ని చూసింది. తన్మయి మీరు చీరలో చాలా బాగున్నారు. అంటే గుడిలో దేవతలా. ఏంటి తన్మయి ఏమి మాట్లాడారు. రా శ్రీ అమ్మా దగ్గరకు వెళ్దాం అంటూ మాట మార్చేస్తుంది తన్మయి. అమ్మా ఎలా వున్నారు. బాగున్నాను తన్మయి. నేను ఎప్పుడు ఈ గుడికి వస్తాను నువ్వు ఒక్కరోజు కనబడలేదు. ఇవాళ నా పుట్టినరోజమ్మా అందుకే గుడికి వచ్చాను. అరేయ్ ఇవాలే మా శ్రీ కి పుట్టినరోజు తన్మయి, నువ్వు నిండు నూరేళ్ళు హాయిగా జీవించాలని కోరుకుంటుంన్నానమ్మా . చాలా thanks అమ్మా. HAPPY BIRTHDAY శ్రీ. THANK U తన్మయి. అమ్మా తన్మయి మేము వెల్లొస్తాము. అలాగే అమ్మా, (ఏంటి శ్రీ కనీసం wish కూడా చేయలేదు అని తన్మయి మనసులో అనుకుంటుంది). time సాయంత్రం 6 కావస్తోంది. తన్మయి ఒంటరిగా ఉండడంతో బాధపడుతోంది. ఇవాళ తన్మయి పుట్టిన రోజు కదా అది ఒక కారణం. సాయంత్రం తన ఇంటి కాలింగ్ బెల్ మోగింది. ఎవరు అంటూ పిలుపు వినిపించింది నేను పలకలేదు. ఎవరు అంటే పలకరేమిటి అంటూ లోపలి నుండి వచ్చి తలుపు తీసింది. తను చదువుకొనే పేద విద్యార్థులకు సహాయం చేస్తుందే, ఆ పిల్లలందరిని నేను తీసుకొచ్చి తన ఇంటి ముందు నిలబెట్టాను. తను తలుపు తీసి పిల్లలు మీరేంటి ఇక్కడ? ఎలా వచ్చారు అంటూ అడిగే లోపే పిల్లలంతా ఒక్కసారిగా తన్మయిని wish చేసారు. తను ఒక్కసారిగా బొమ్మలా నిలబడిపోయింది. తర్వాత నేను తన్మయిని wish చేసాను. తను మెల్లగా నా దగ్గరకు వచ్చి సంతోష క్షణాలు ఇకపై నాకు కళ మాత్రమే అనుకొన్నాను. కాని ఇంకా నా జీవితంలో వున్నాయి అని గుర్తుచేసినందుకు చాలా THANKS శ్రీ అంటూ నా రెండు చేతులు పట్టుకుని చెప్పింది. అప్పటివరకు ఏదో సంబంధం ఉంది నా మనసుకు తన మనసుకు అనిపించింది. ఆ క్షణం తన కళ్ళల్లో ఆనందం, తన మనసులో సంతోషం అన్నీ అలాగే తన దగ్గరే చివరివరకు ఉండేలా చూసుకోవలసిన బాద్యత నాది అనిపించింది, అంటే నేను తనని ఇష్టపడుతున్నట్లేగా. తనతో కేకు కట్ చేయించాను. పిల్లలందరిని వాళ్ళ వాళ్ళ ఇండ్లకు పంపించాను. నాకు మాత్రం ఇంకొద్దిసేపు తన్మయితోనే వుండాలని అనిపించింది. అంతలో తనే అంది శ్రీ డిన్నర్ నాతో చేస్తారా అని. ఈ ప్రపంచంలో ఈ క్షణం నేనే అదృష్టవంతుడనని అనిపించింది. వెంటనే అలాగే అన్నా ఇద్దరం కలసి hotelకి వెళ్ళాము.
శ్రీ ఎందుకో నా గురించి మీకు చెప్పాలని వుంది. నేను ఒంటరి అనే బావనలో ఉన్నదాన్ని. ప్రేమ కోసం, బందాల కోసం ఎదురు చుస్తున్నదాన్ని. నాకంటూ ఎవరు లేరు అది మీకు తెలుసు. నేను డిగ్రీ చదువుతున్నాను, పేద పిల్లలికి చదువుకోవడానికి సహాయం చేస్తున్నాని మాత్రమే మీకు తెలుసు. నేను ఇంకో పని చేస్తున్నాను. ఆ పని చేయడానికి ముఖ్య కారణం మా నాన్నగారు. మా నాన్న చనిపోవడానికి కారణం accident కాదు. అయన డ్రగ్స్ తీసుకొని డ్రైవ్ చేస్తూ మత్తులోనే accident చేసారు. అయన పోస్ట్ మాట్రం report చూసినా నాకు ఇది పెద్ద షాక్. ఇంట్లోనే వున్నా ఒకరి గురించి ఇంకొకరికి ఏమాత్రం తెలియదు. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలిని బాగా అర్థం చేసుకున్నాం అనుకుంటారు. అలాగే పిల్లలు మా తల్లిదండ్రులు గొప్పవాళ్ళు అనుకుంటారే కాని, అసలు వాళ్ళ నడవడిక ఏమిటి, వాళ్ళ ఆలోచనలు ఏమిటి అని ఎవ్వరూ ఆలోచించారు. అది మనం చేస్తున్న తప్పులు. ఆ తప్పే నేను చేసాను. ఆ తప్పు వల్లే నేను అనాధగా ఈ రోజు ఒంటరిగా ఈ సమాజంలో నిలబడ్డాను. ఆ బాధ ఇంకెవ్వరు అనుభవించకూడదు అనే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నాకు అందే సమాచారంతో ఎవరైనా తప్పు చేయబోతుంటే వాళ్ళ వీడియోస్ తీసి వాళ్ళ ఇంట్లో వాళ్లకు పంపుతుంటాను, ఇంకా మీకు తెలిసిన ఒక పని అదే బాగా చదువుకొనే పిల్లకు సహాయం చేస్తూ వుంటాను. తప్పు చేసినా నా దగ్గర నిజాయితీగా చెబితే మన్నిస్తాను లేదా ఎప్పటికి వాళ్ళని క్షమించను ఇది నా జీవితం. మీకు చెప్పాలని అనిపించింది శ్రీ. మీ అభిరుచులు, నడవడిక బాగున్నాయి తన్మయి.
అమ్మా------అమ్మా-------? ఏంట్రా అలా అరుస్తున్నావు, ఏమైంది. ఈ రోజు మంచి రోజేనా అమ్మా. అవునురా చాలా మంచి రోజు. అయితే రా వెళ్దాం. ఎక్కడికిరా వెళ్ళేది. అమ్మా నీకు కోడలు కావాలా వద్దా. రేయ్ శ్రీ కోడలేంటిరా. అవునమ్మా నాకు తన్మయి నచ్చింది, నీకు తనంటే ఎలాగో ఇష్టం. ప్రేమ పేరుతో ఒక అమ్మాయిని అక్కడ, ఇక్కడ తిప్పడం నాకు నచ్చదు. అందుకే పెళ్లి అని డైరెక్టుగా చెబుతున్నానమ్మా. అది సరేరా శ్రీ ముందు తన్మయి ఇష్టం కనుక్కోవాలికదా. అలాగే కనుక్కుందాం. కాని నేనే అడుగుతానమ్మా. నీకు ఇష్టమేగా తన్మయి అంటే. శ్రీ ఇంటికి కోడలిని తీసుకొని రావట్లేదు నువ్వు, నాకు కూతురిని తేసుకోస్తున్నావు. మరి ఇష్టం లేదు అని ఎలా చెప్పనురా. అమ్మా నువ్వు చెప్పింది నిజమే. తను నిజంగా చాలా మంచి అమ్మాయి. ఇన్ని రోజులు తనపై ఇష్టం వున్నా తను మన ఇద్దరి మనసులకు అనుగుణంగా నడుచుకొంటుందో లేదో అని ఆలోచించాను. ఇప్పుడు నేను తనకి తగిన వాడినా కాదా అని ఆలోచిస్తున్నాను అంటే తను ఎంత మంచిదో అలోచించమ్మా.
తన్మయి నీతో మాట్లాడాలని వస్తే ఎక్కడికో బయలు దేరినట్లువున్నావు. హేయ్--- శ్రీ మీరేంటి చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చారు. మీతో మాట్లాడాలని వచ్చాను తన్మయి. మీరు ఎక్కడికో వేలుతున్నట్లున్నారు. తరువాత మాట్లాడదాం, మీరు వెళ్లి రండి తన్మయి. హేయ్ శ్రీ అలా ఏమి లేదు గుడికి వెళుతున్నా మీకు అభ్యంతరం లేదు అనుకుంటే మీరు నాతో రావచ్చు. అలాగే వెల్దం పదండి. సరే శ్రీ నా బైక్ లోపల పెట్టి వస్తాను ఒక్క నిమిషం. తన్మయి గుడిలో బాగా దర్శనం అయ్యింది కదా. అవును శ్రీ. తన్మయి మీకు గుడికి రావడం అంటే ఇష్టమా. మా ఆడవారి మనసుకి ఆనందం అనిపించినా, బాధ అనిపించినా ముందు గుర్తొచ్చేది గుడి శ్రీ. నాకు పౌర్ణమి వెన్నెలలో గుడి ముందు కుర్చోవడమంటే ఇష్టం. తన్మయి నీకు ఒక gift తీసుకొచ్చాను. కాని నీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు gift ఎందుకు శ్రీ. మనసుకు నచ్చిన వారికి ఎప్పుడైనా ఇవ్వచ్చు తన్మయి. సరే ఇవ్వు. శ్రీ బైక్లో దాచిన red roses ఇంకా ఒక greeting card తీసుకొచ్చి తన్మయి ఎదుట నిలబడి "తన్మయి వెలుగు ఉన్నపుడే తోడుగా నిలిచే నీ నీడగా కాకుండా నా ఊపిరి ఆగే చివరి క్షణం వరకు నీకు తోడుగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను". మీకు జీవితాంతం నేను తోడుగా నిలబడుతాననే నమ్మకం వుంటేనే ఈ గులాబీలను తీసుకోండి. శ్రీ మీరు ఇలా నన్ను మీ జీవితంలోకి ఆహ్వానిస్తారని నేను అనుకోలేదు తెలుసా. మిమ్మల్ని ఇష్టపడ్డాను కాబట్టే మీరు అడగకపోయినా ఆ రోజు హోటల్లో మనం కలిసినప్పుడు అన్నీ నా గురించి చెప్పాను. కాని మీరు అర్థం చేసుకోలేదు నాకు మీరంటే ఇష్టమే. ఎందుకు ఆ ఇష్టం పుట్టిందో చెప్పలేను, కాని మీరు తప్ప నా జీవితంలోకి ఎవరిని ఆహ్వానించేదాన్ని కాను శ్రీ. మీరంటే అంత ఇష్టం.
అమ్మా---- తన్మయి పెళ్ళికి ఇష్టమని చెప్పింది. వీలైనంత తొందరలో తన్మయిని పెళ్లి చేసుకొని తీసుకోచ్చేద్దాం. ఏంట్రా శ్రీ suddenగా వచ్చి ఇంత సుభవార్త చెప్పావు. నిజంగా నాకు చాలా ఆనందంగా వుంది తెలుసా. సరే రేపే పంతులుని కలిసి పెళ్ళికి ముహూర్తం పెట్టిస్తాను. అమ్మా పెళ్లి గనంగా వద్దు. simpleగా గుడిలో చేసుకొంటాము. ఆ పెళ్ళికి అయ్యే కర్చు మంచిపనికి ఉపయోగిద్దాం అమ్మా. సరే కాని తన్మయి ఏమంటుందో తెలుసుకోవాలి కదా. అమ్మా తను చాలా సంతోషిస్తుంది. హేయ్ తన్మయి అమ్మ ముహూర్తం పెట్టిస్తానంది. అంతేకాదు మన పెళ్లి నీకు ఇష్టమైనట్లే సింపుల్గా జరిపించడానికి అమ్మ ఒప్పుకుంది. నాకు చాల సంతోషంగా ఉంది శ్రీ. సరే మా ఫ్రెండ్స్కి నిన్ను పరిచయం చేయాలి రా తన్మయి. లేదు శ్రీ ఇప్పుడు ఒక exam ఉంది నేను తప్పకుండా రాయాలి మీరు వెళ్ళండి ప్లీజ్ తరువాత వాళ్ళని కలుద్దాం. సరే నేను వెళుతున్నాను bye.
exam రాసి కాలేజీ గేటు దగ్గరకు వస్తుంది తన్మయి. ఇంతలో తన స్నేహితురాలు చాలా స్పీడుగా బైక్ డ్రైవ్ చేస్తూ వచ్చి తన్మయి ముందు ఆగుతుంది. ఏంటే షీలా ఇంత స్పీడుగా బైక్ డ్రైవ్ చేసుకోచ్చావు. నీ మోహంలో కూడా కంగారుగా ఉంది. ఏమైంది ఏమైనా ప్రాబ్లంలో ఉన్నావా. ప్రాబ్లం కాదే నువ్వు ఎప్పుడు చేసేపని ఇవాళ నేను చేశా తన్మయి. అందుకే ఈ అగచాట్లు నాకు. ఏంటే షీలా నీ గోల తిన్నగా చెప్పు. నా బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి రోజు వెళ్ళే hotelకి వెళ్లాను. అక్కడ కొంతమంది స్నేహితులు మాటలు నీకు పనికివస్తాయేమో అని ఫోన్లో రికార్డు చేశా తన్మయి వాళ్ళ మొహాలు కూడా కనిపిస్తాయి. అవునా సరే ఇలా ఇవ్వు నీ ఫోన్ షీలా. వాళ్ళ మాటలుబట్టి ఆలోచిద్దాం ఏమి చెయ్యాలో అని. సారీ తన్మయి సమయానికి మొబైల్ లో CHARGING అయిపోయింది. మొబైల్ ఇప్పుడు స్విచ్ఆఫ్. సరే బాధపడకు తర్వాత చూపెడుదువు ఇంటికెల్లు. సరే తన్మయి నేను ఊరికేలుతున్నా మా బాబాయి పెళ్లి వుంది. తిరిగివచ్చాక ఈ వీడియొ చూపిస్తాను బాయ్. సరే వెళ్లిరా షీలా.
శ్రీ వాళ్ళ అమ్మ తన్మయి కోసం ఇంటికి వస్తుంది. అమ్మా మీరా రండి కూర్చోండి. ఏమి తీసుకుంటారు, కాఫీ, టీ ఏమి తాగుతారు. ఏమి వద్దు తన్మయి. నీకు,శ్రీ కి పెళ్లి కుదిరితే గుడికి వచ్చి నీతో అర్చన చేయిస్తానని మొక్కుకున్నా. ఈ రోజు నువ్వు ఫ్రీగా వుంటే సాయంత్రం వెల్దామా అని అడగడానికి వచ్చా. అమ్మా ఏంటి నా దగ్గర నుండి అనుమతి కోరకండి, అజ్ఞాపించండి సరేనా. సాయంత్రం నేనే బైక్ తీసుకొని ఇంటికి వస్తానమ్మా మీరు రెడీగా వుండండి. శ్రీ ఆఫీసులో పని వుండడంతో ఇంటికి తొందరగా రాలేకపోతాడు. గుడికి తన్మయి, శ్రీ వాళ్ళ అమ్మా వెళతారు. అదే సమయంలో షీలా ఆ గుదిలోపలి నుండి బయటకి వస్తూ వుంటుంది. తన్మయిని చూసి హేయ్ నువ్వేమ్తే ఇక్కడ అని బిగ్గరగా అరుస్తుంది షీలా. జరిగినదంత చెప్పి శ్రీ వాళ్ళ అమ్మను పరిచయం చేపిస్తుంది తన్మయి. షీలా శ్రీ వల్ల అమ్మతో తన్మయి గురించి చాలా గొప్పగా చెపుతుంది అంతేకాదు తను చేసే మంచిపనుల గురించి చెపుతుంది. పిల్లలకు చదువుకొనే పిల్లలకు ఎలా సహాయం చేస్తుందో, తప్పు దారిలో పోయే పిల్లల గురించి, పెద్దల గురించి ఇంట్లో వాళ్లకు తెలియ చేసి వారిని సరియైన మార్గంలో పెట్టె బాధ్యత తన బుజాలపై వేసుకుందని అన్నీ చెపుతుంది. అమ్మా షీలా నిజంగా నాకు ఇదంతా తెలియదు. తన్మయి నా మనసుకు నచ్చిన అమ్మాయి అని పెళ్ళికి ఒప్పుకొన్నాను, కాని ఆ గుడిలో వున్న దేవతే నేను అడగకుండానే ఈ వరాన్ని నాకిచ్చిందేమో అనిపిస్తోంది. హేయ్ షీలా ఏంటే ఇదంతా ముందు ఇక్కడి నుండి బయలుదేరు. సారీ తన్మయి మాటల్లో పడి మరిచిపోయాను. ఆ రోజు ఒకడు ఎవరో అమ్మాయిని పెళ్లి పేరుతో బలిపశువు చేయబోతున్నాడు అని అన్నాను కదా. వాడి గురించి వీలైనంత త్వరగా ఆ అమ్మాయికి తెలియచేయాలి, లేక పోతే పాపం ఆ అమ్మాయి బావిష్యత్తే నాశనం అవుతుంది తన్మయి. ఏంటే నువ్వు చెప్పేది అంత సీరియస్ విషయమా. సరే నీ ఫోన్ ఇలా ఇవ్వు చూస్తాను. శ్రీ వాళ్ళ అమ్మ కూడా ఆ వీడియొ చూస్తూ వుంటుంది.
(వీడియొ ఆన్ చేస్తారు) తన స్నేహితులు శ్రీ తో మాట్లాడుతుంటారు. " ఏంట్రా శ్రీ నువ్వు ఒక అనాదని పెళ్లి చేసుకొంటున్నావా . మరి ఎప్పుడు డబ్బు డబ్బు ----- అనే వాడివి. పెళ్లి గురించి ఎవరు ఏమి మాట్లాడినా. నేను బాగా కట్నం ఇచ్చే అమ్మాయినే చేసుకొంటా పైగా ధనవంతురాలయ్యి వుండాలి ఆ అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళు అనే వాడివి. మళ్లీ ఇంత హటాతుగా మాధగ్గరకు వచ్చి ముందు వెనుక ఎవరు ఎని అమ్మాయిని ఎందుకు చేసుకొంటున్నావు. ఇంతలో అక్కడ కూర్చొన్న వాళ్ళలో ఇంకో అతను అంటాడు "బహుసా ఆ అమ్మాయి అనాధ అయినా ఆస్థి పాస్తులు వుంటాయిరా అందుకే కాబోలు చేసుకొంటున్నాడు." ఇంతలో ఇంకో స్నేహితుడు "ఏరా నిజంగా ఆ అమ్మాయి లవ్ చేశావా పెళ్లి చేసుకోవాలంటున్నావు లేకపోతే ఆస్థి బాగావుంది అనా ఈ నిర్ణయానికి వచ్చావు. నిజంగా అమ్మాయితో జీవితంతో కలిసి వుంటావా లేక వదిలేస్తావా. చెప్పరా అలా రాయిలా నిలబడతావేమి అని గణేష్ అడుగుతాడు. అప్పుడు శ్రీ బిగ్గరగ్గా అరిచి వదిలేస్తా అంటాడు. ఇంతలో చార్జింగ్ లేనందువల్ల మొబైల్ ఆఫ్ అయిపోతుంది. ఈ వీడియొ చూసినా ఇద్దరు అక్కడికక్కడే అలాగే నిశ్చలమై పోతారు.
ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన శ్రీ కి వల్ల అమ్మ కనపడదు. ఏంటి గుడికని వెళ్ళిన అమ్మ ఇంకా ఇంటికి రాలేదు అని తన్మయికి ఫోన్ చేస్తాడు శ్రీ. తన్మయి కాల్ కట్ చేస్తూనే వుంటుంది. ఏమైందో చూద్దాం అని తన్మయి ఇంటికి వెళ్తాడు శ్రీ. బయట గేటు తీసే చప్పుడు రావడంతో శ్రీ వాళ్ళ అమ్మ ఇంటి ముందు వున్న గుమ్మం దగ్గరకు వస్తుంది. ఆగు అక్కడే----! నువ్వు ఎవరివో మాకు తెలియదు. అనామకులని నమ్మకూడదు అని నాకు, నా కూతురు తన్మయికి ఇప్పుడే తెలిసింది. ఇన్నిరోజులు చీకటిలో వున్న నాకళ్లకు మా అమ్మాయి చేపట్టిన మంచిపనుల వల్ల నిజా నిజాలు తెలిసింది. వెళ్ళిపో ఇంకో సారి ఇటు వైపు వస్తే నా సేవాన్ని చూడవలసి వస్తుంది. అమ్మా ఏమైంది ఎందుకు అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. తన్మయి----- తన్మయి ఎక్కడున్నావు. బయటకు రా. ఏమైంది అమ్మకు అలా మాట్లాడుతుంది. నేను ఏమి తప్పు చేసానో చెప్పండి. చూడు రా ఇంకో సారి తన్మయిని, నన్ను కలుసుకోవాలని చూడకు అంటూ ఇంటి లోపలికి వెళ్లి తలుపు వేసేస్తుంది శ్రీ వాళ్ళ అమ్మ. ఇది జరిగింది శరత్. ఇంత వరకు నాకు అర్థం కాలేదు. ఎందుకు నన్ను వాళ్ళ ఇద్దరు దూరంగా ఉంచుతున్నారు అని. సరే శ్రీ నువ్వు బాధ పడకు. నేను అన్నీ వివరంగా కనుక్కొంటాను. ఇంత వరకు నువ్వు నాకు చెప్పక పోవడమే నువ్వు చేసిన తప్పు. సరే నేను కనుక్కుంటా శ్రీ నువ్వు బాధ పడకు ఎక్కడికి వేళ్ళకు. కొద్దిరోజులు ఆగు. నా కోసం శ్రీ.
తన్మయి, శ్రీ వాళ్ళ అమ్మ కూరగాయలు తీసుకొని రోడ్డు పైన వెళుతూ ఉంది. అక్కడ ఒక అమ్మాయి ఎందుకో కేకలు వేస్తూ కనపడుతుంది. ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళింది తన్మయి. ఆ అమ్మాయి పక్కనే ఒక అబ్బాయి(శరత్) నిలుచుకొని ఆ అమ్మాయితో ఇలా అంటున్నాడు. మర్యాదగా నాతో రా --- లేదా చంపేస్తాను. నా గురించి నీకు బాగా తెలుసు ఇప్పుడు కాని నా వెంట నువ్వు రాలేదో నీకు లైఫ్ అనేదే లేదు. కావాలంటే చూడు అని ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని బలవంతంగా తనతో తీసుకెల్లబోతున్నాడు. అప్పుడు తన్మయి వెనకా ముందు ఆలోచించకుండా ఆ అబ్బాయి చెంప పగల కొట్టి, ఏంట్రా ఎవడివి నువ్వు అంటూ వాడి షర్టు కాలెర్ పట్టుకుంటుంది. అప్పుడు అక్కడే వున్న ఆ అమ్మాయి ఎవరివి నువ్వు, మా అన్నయ్యను కొట్టడానికి ఎంత దైర్యం నీకు అంటూ తన్మయిని అరుస్తుంది. ఏంటి ఇతను మీ అన్నయ్యా. అయ్యో సారీ అండి మీరు అమ్మాయికి అన్నయ్య అని తెలియక మిమ్మల్ని కొట్టాను. తొందరపాటు, అపార్థం అనేవి ఎంతటి అనర్థానికి దారి తీస్తుందో తెలిసిందా తన్మయి. నా పేరు మీకు ఎలా తెలుసు. మీరు తెలుసు నాకు శ్రీ అమ్మగారు తెలుసు. చూడండి నేను శ్రీ స్నేహితున్ని. తను ఏమి చేసాడని మీరు తనని దూరం చేసుకొన్నారు. చూడండి మీరు స్నేహితుడు అని అంటున్నారు. మీకు తన గురించి ఏమి తెలుసు, తను ఎలాంటి వాడో తెలిసి ఒక అమ్మాయి జీవితం పాడుచేయాలని నిర్ణయానికి వస్తారా. ఇంతలో అక్కడే వున్న గణేష్, చూడు తన్మయి వాడు నిజంగా మంచివాడు. తన చేతిలో వున్న మొబైల్లో సేవ్ చేసుకొన్నా వీడియొ అందరికి చూపిస్తుంది తన్మయి. చాలు అపు తన్మయి ఈ వీడియొ ఎవరు తీసారో నాకు తెలియదు. కాని మొత్తం ఎందుకు రికార్డు చేయలేదు లేదా మొత్తం జరిగిన సంగతి వాళ్ళు విని నీకు చెప్పరా. లేదు గణేష్ అది తీస్తుండగా చార్జింగ్ లేక మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అని నా స్నేహితురాలు చెప్పింది. వెంటనే తను అక్కడి నుండి బయలు దేరి వచ్చేసింది. చూడు తన్మయి వాడు ఆఖరిగా చెప్పింది వదిలేస్తా అని. వాడు ఆ రోజు మాతో చెప్పిన మాటలు "వదిలేస్తా రా నా ఆలోచనలు, అబిప్రాయాలు అన్నీ వదిలేస్తా. ఎందుకంటే చిన్నప్పటి నుండి నేను, అమ్మ పడ్డ కష్టాలు చూసి డబ్బు వుంటే అన్నీ దగ్గర ఉన్నట్టే అనుకొనే నేను మీతో అలా మాట్లాడాను. కాని తన్మయితో పరిచయం అయ్యాక మన మనసే అన్నిటికంటే గొప్పది అని తెలుసుకొన్నాను. మనకు చేతనైనంత వరకు ఎదుటి వారికి సహాయ పడాలి అని తెలుసుకొన్నాను. ఈ ప్రపంచంలో డబ్బిచ్చి కొనలేనిది విద్య. ఆ చదువుని ఎలా వినియోగిస్తే సరస్వతికి మనం గౌరవం ఇచ్చినట్లో తెలుసుకొన్నాను. తను నాకు అర్థాంగిగా రావట్లేదు నన్ను సక్రమమైన మార్గంలో పెట్టడానికి వచ్చిన దేవత అన్నాడు. చూడండి అమ్మ తన్మయికి శ్రీ తో అంత పరిచయం లేదు. మరి మీరు ఎలా అపార్థం చేసుకొన్నారు శ్రీని. కళ్ళతో చూసేది అంతా నిజం కాదు అని ఇప్పుడే తెలుసుకొన్నా గణేష్. ఒక అమ్మాయి జీవితాం నా బిడ్డ వల్ల నాశనం కాకూడదు అనే ఇన్ని రోజులు తన్మయికి ఆసరాగా తనతో వున్నాను. కాని స్నేహితులు అర్థం చేసుకోన్నంతగా నేను ఎందుకు వాడిని అర్థం చేసుకోలక పోయానో తెలియడం లేదు. అందుకే ఏమో స్నేహం అంటే అర్థం ప్రాణాలు ఇచ్చేంత గొప్పది అంటారు. తల్లి బిడ్డ జీవితానికి కొద్ది కాలమే తోడుంటుంది, బార్య జీవిత మధ్యబాగం నుండి తోడుంటుంది. కాని స్నేహితులు జీవితాంతం. ముందు శ్రీకి క్షమాపణలు చెప్పాలి రండమ్మా అంటూ తన్మయి అందాలు బయలు దేరుతారు శ్రీ ఇంటికి. ఇక కథ సుకాంతం కాని మనలోను తప్పు ఒప్పులు వున్నాయి సరి చేసుకొంటే, అందరు మనకు మిత్రులే మరి శత్రువులకు చోటేది నేస్తం................
No comments:
Post a Comment