Wednesday, 19 October 2011

love song: మనసు పలికే మోనం


















పల్లవి

మనసు పలికే మోనం
చూపు వెతికే చిత్రం
నీ శ్వాస తగిలిన వైనం
ఎలా తెలుపను ఆ వర్ణం
నీ చిరునవ్వు అందించే మదూరం
నీ గుండె చప్పుడు నే వినిన తరుణం
హాయి గొలిపే నీ స్నేహం
మలుపు తిరిగే సంతోషం
ఏమిటో ఇక నా గమ్యం
నేను చేరుకొనే ఈ పయనం
ఎన్నటికీ చెరగని ఈ బంధం
చేజార్చుకోలేనే ఈ సమయం


చరణం-1

ప్రేమా నీ తియ్యని పలకరింపు
అందుకొన్నానే ఈ క్షణం
చల్లటి గాలి నను తాకే ఈవేల
అదే నా చెలి స్పర్సకి నిదర్శనం
నాలో నేను ఉండనే
తాను దూరమయ్యే ఆ నిమిషం
నా కాళ్లముందు నిలిచె నీ రూపం
నేను పలికే బావాలకు ఆది సంకేతం
మనసు పలికే మోనం
చూపు వెతికే చిత్రం
నీ శ్వాస తగిలిన వైనం
ఎలా తెలుపను ఆ వర్ణం


చరణం-2

నా ప్రేమను నువు ఆహ్వానించువేల
నా గుండె చప్పుడు ఉల్లాసం
తాను నాతో వేసే ఏడుఅడుగులకు
రాసి ఇస్తానే నా జీవితం
నీ ప్రేమకై నా ప్రతిజన్మ
చేస్తాలే ఇక దాస్సోహం
ప్రేమా నా ప్రియురాలికి అందచేయి
నే తనపై రాసిన ఈ కావ్యం
మనసు పలికే మోనం
చూపు వెతికే చిత్రం
నీ శ్వాస తగిలిన వైనం
ఎలా తెలుపను ఆ వర్ణం
                                                                

దేశభక్తి గీతం: ఏ మతమూ కాదే
















దేశభక్తి గీతం నా దేశానికీ అంకితం

ఏ మతమూ కాదే 
ఏ జాతి కాదే
మనుషులంతా ఏకంఅయితే                      
ఏ బాష ఐన
అడ్డుకాదే అర్థమయ్యే
మన మానవజాతి మంచి  మనసుకే                

ఏ మతమూ కాదే 
ఏ జాతి కాదే
మనుషులంతా ఏకంఅయితే
మనం అర్హులమే కామే మన్నింపు కోరిన
తల్లి పాలు తాగి తన గుండెలపై
అగ్ని వర్షపు చినుకులనే రాల్చమే                    

ఏ మతమూ కాదే 
ఏ జాతి కాదే
మనుషులంతా ఏకంఅయితే
ప్రాంతం కోసం పాకులాడి
మన భూమాతకే నెత్తురు రుచి చుపామే                

ఏ మతమూ కాదే 
ఏ జాతి కాదే
మనుషులంతా ఏకంఅయితే
గాలికి లేదే, నీరుకు లేదే, 
వెలుగు నిచ్చే సూర్యుడికి లేదే,
అందరికీ సమమై అందుతున్నదే భేధబావం అన్నీ  వదిలి     

ఏ మతమూ కాదే 
ఏ జాతి కాదే
మనుషులంతా ఏకంఅయితే 
వికసించే పువ్వుని చూడు
దైవం ఒకటే అన్నది ఏ నాడో
ఏ దైవం పాదం చెంతకు చేరడానికైన
నే సిద్ధం అంటున్నది  చూడు                                                      

ఏ మతమూ కాదే 
ఏ జాతి కాదే
మనుషులంతా ఏకంఅయితే 
పుట్టినప్పుడు మనిషి చిరునవ్వు చూడు
పెరిగే కొద్ది ఉక్రోషాలు పొదిగిన మాటలు చూడు
చనిపొఇన నీవు ఒదిగేది
అమ్మ కమ్మని ఒడిలోకే అని గురుతు చేసుకో                                

ఏ మతమూ కాదే 
ఏ జాతి కాదే
మనుషులంతా ఏకంఅయితే 




హీరో introduction పాట: welcome welcome






welcome welcome  అంటూ వుంది లోకం
birthu deathu  మద్యన ఎన్నో కథలు నేస్తం
యుద్ధమే చేసి ముందడుగే వేయాలీ ప్రాయం
ఎన్నో జీవితపాటాలు నేర్పుతుందీ పయనం
ఛలో ఛలో  ముందుకె వెళ్ళు
హలో హలో వెనుదిరగకు నువ్వు
కాలంతో పోటీ చెయ్యి
ఉరుములతో స్నేహం చెయ్యి
కన్నీల్లోస్తే నవ్వేసేయి
జీవితమే అనందం  కదరా

welcome welcome  అంటూ వుంది లోకం
birthu deathu  మద్యన ఎన్నో కథలు నేస్తం
కళ్ళల్లో కసి నింపి దూసుకు  పోవాలి మనం
అందరు ఒక్కటనే సిద్దాంతం చెప్పాలి జగం
అలా అలా కెరటంలా మనం
పెళా పెళా మెరుపై దూసుకు వెళ్దాం
జగమంటే జాలి అందాం
సై అంటే సైసై అని అందాం
నువ్వు వెళ్ళే దారి మంచిది అయితే
ఎవ్వరిని లెక్కచేయకు రా

welcome welcome  అంటూ వుంది లోకం
birthu deathu  మద్యన ఎన్నో కథలు నేస్తం

Friday, 14 October 2011

ఆడజన్మ అనురాగాలకు కొమ్మ


ఆడజన్మ అనురాగాలకు కొమ్మ:

కొత్తదనం, అమ్మతనం కలబోసిందే ఆడజన్మ 
ఓర్పు, నేర్పు కలబోసి సృష్టించాడే ఆ బ్రహ్మ 
అందం అంటే మనసంటూ తెలిపేదే స్త్రీ జన్మ 
బంధం బాధ్యతకు సూత్రం అంటుందే పడతి జన్మ
శత్రువుకైనా నే నేస్తం అంటుందే ఆ అపురూప బొమ్మ......  మా అమ్మా

Monday, 10 October 2011

love song: నిమిషంతో కాలమే

























పల్లవి

నిమిషంతో కాలమే తెలిపెను     I MISS U
నేలను చినుకే అడిగేను      I WANT U 
నీ మనసుతో నా మాటే కలిపెను   I LIKE U
నా కలలో వెతీకా నీరూపు       WHERE R U
ముందుకు వచ్చి నాతో చెప్పవా  I LOVE U   I LOVE U
                            

చరణం-1
దిక్కులంతా ఏకం అయ్యీ
నీ దారి చూపుతువుందే
నువ్వు దూరం అయ్యేవేల
ఒంటరేగా నా జీవితమంతా
మది తెలుపుతోంది నా ప్రేమంతా
నీ పిలుపుకోసం వేచివున్న
నిన్ను నేను చేరెవరకూ
అగిపొదె నా ఈ శ్వాస                                                                         
నిమిషంతో కాలమే తెలిపెను     I MISS U
నేలను చినుకే అడిగేను      I WANT U 
నీ మనసుతో నా మాటే కలిపెను   I LIKE U
నా కలలో వెతీకా నీరూపు       WHERE R U
ముందుకు వచ్చి నాతో చెప్పవా  I LOVE U   I LOVE U
  


చరణం-2
నా కళ్ళలోన నిలుచున్నావు
నా గుండేలోన దాగున్నావు
నేనిన్ను వెతికే సరికి
కనుమరుగై పోతున్నావు
పువ్వులేమో చెప్పే నీరూపు
తారలేమో విప్పే లోగుట్టు
నీ తలాపే తలిచేవేల
తికమక అయ్యే ఈజగమంతా
    
నిమిషంతో కాలమే తెలిపెను     I MISS U
నేలను చినుకే అడిగేను      I WANT U 
నీ మనసుతో నా మాటే కలిపెను   I LIKE U
నా కలలో వెతీకా నీరూపు       WHERE R U
ముందుకు వచ్చి నాతో చెప్పవా  I LOVE U   I LOVE U
                                                           

Thursday, 6 October 2011

మినీ స్టొరీ - నా మార్గం


                                             నా మార్గం
చూసే ప్రతి అందం నా సొంతం అనేదే కళ్ళు. నా కళ్ళతో నేను చూసే ప్రతి విషయాన్ని నమ్ముతాను. ఎవరో చెప్పినది నమ్మేకంటే నన్నే అంటిపెట్టుకొని వుండే నాకళ్ళను నమ్మడం నాకు  ఆనందం. ఎందుకంటే మంచి, చెడు, విచక్షణ, ఓర్పు, సహకారం అన్నీ నా కళ్ళు నాకు నేర్పుతుంది. నాకు ఈ ప్రపంచంలో ఎవరి తోడు లేకపోయినా నాకళ్ళే నాకు లోకమై నాకు దారి చూపిస్తుంది. కన్నీటిలో మునిగినా, నాకళ్ళు ఈదులాడుతూ పైకి తేలుతూ నాకు గమ్యాన్ని చూపిస్తుంది. అందుకే నాకళ్ళంటే నాకు ఇష్టం. కాని అనుకోని సంఘటనవల్ల నాకళ్ళు  నాకు దూరం అయింది.
                         ఎంతో బాధపడ్డాను. నరకానికి చేరువ అవ్వడం అంటే అప్పుడు అర్థం అయ్యింది.  నాచుట్టు ఎంతమంది ఉన్నాఎందుకో ఒంటరి అనే బావన నన్ను అల్లుకుపోయింది. అన్నికోల్పోయిన వాడిలా మిగిలిపోయాను. ఆ క్షణం ప్రాణం మీద తీపిని కోల్పోయాను. అదే సమయంలో ఒక చిన్న వార్త నా గుండెకోతని అనిచివేసింది. ఒక మహా వ్యక్తి తను చనిపోయాక తన శరీరంలో ఏ అవయవాలు అయితే ఇతరులకు ఉపయోగపడుతుందో అన్నీ తీసుకొని నన్ను సమాధి చేయండి అని తను చనిపోతు చెప్పిన చివరి మాటలు. అవి మాటలు కావు ఎంతోమందికి జీవిత మార్గాలు. అతని కళ్ళే ఈ రోజు నాకు ఊపిరిపోసింది. వెలుగై నాకు దారిచూపిస్తోంది. ఈ సంఘటన నా జీవితాన్నే మార్చేసింది. నేను అతనిలాగానే మావాళ్లకి చెప్పాను. నా శరీరంతో పాటు నాఅవయవాలు మట్టిలో కలిసిపోకూడదు. నాలాంటి వాళ్ళు ఎంతో మంది చిన్న వయసులోనే జీవితాన్ని పోగొట్టుకొంటున్నారు. కళ్లుపోయో, లేక గుండెజబ్బులతోనో, లేక కిడ్నీ పాడయ్యో ఇంకా ఎన్నో చెప్పాలంటే. నేను మంచిపనికి ముందడుగువేసాను. మరి మీరు నేస్తం....................................................?

Monday, 3 October 2011

అందమైన పెదవి


అందమైన పెదవి:
ఇది ఆడవారికి నేస్తం.
పెదవిపై చిరునవ్వంటే అందరికీ ఇష్టం.
ముఖ బావాలను ఎదుటివారికి తొందరగా తెలియజేస్తుంది.
తన లేత గులాబి రంగుతో ఇంకో స్త్రీ కి అసూయ కలిగిస్తుంది.
మాటల అల్లికను తన నీడగా చేసుకొని ఆకర్షిస్తుంది.
కోపంతో చప్పుడు చేసే పెదవి, వెంటనే కరిగే మేఘంలా చిరునవ్వు చిందిస్తుంది.
ఆ పెదవి వెంట మాటలు ఎదుటి వారి మనసు గాయం చేస్తే----------?  
                                                        ఆ పెదవికి విలువ ఏది నేస్తమా.