Friday, 15 February 2013
Monday, 31 December 2012
LADY: ఆడదాన్ని
ఆడదాన్ని అంటూ ఆటబొమ్మనే చేసారు
అబలనే అంటూ అమ్మనే మరిచారు
పాలు నిండిన వక్షస్తలంనే మీ వక్రద్రుష్టితో నింపారు
ఇంకో జీవికి ఆయువు పోసే స్త్రీ జాతి శ్వాస అపుతున్నారే రాక్షసులు
నీకు ప్రాణం పోసింది ఓ ఆడదే అని ఎందుకో మరిచారు
మా ఖర్మ ఫలమో మీ దృష్టి లోపమో తెలియకుందే ఈ జగతికి
స్త్రీ పొందు కోరే ఆ స్థలమే ----! నీ జన్మ స్థలం అని మరిచావు
ఒల్లుమరచిన మైకంలో వావివరసలు వదిలావు
చెల్లికీ - చెలికీ భేదాన్నే నువ్వు మార్చావు
నీ ఆక్రుత్యాలకి గుండె భారమెక్కుతుందే ఆడజాతికి
కనుమరుగవుతున్న స్త్రీ జాతిని చూస్తే భయంవేస్తోందే
నీకు ప్రాణం పోసే అమ్మని నేనేగా
నీ విజ్ఞానం పెంచే చదువులమ్మని నేనేగా
కష్ట-సుఖాలకు నీకు తోడునిలిచే బార్యని నేనేగా
నీతో దోబూచి ఆటలు ఆడే కూతురు నేనేగా
నీ శ్వాస నిన్ను వదిలినా నా ఒడిలో నిన్ను దాచుకొనే భూమాతను నేనేగా
నీ జీవితాన అల్లుకొనే బందాల కలయిక స్త్రీమూర్తినిరా
ఆరాధ్య దైవంగా కొలిచే దేవతనిరా
నీ శృంగార వాంచ్చకి బంధాలు మరువకురా
ఆడదాన్నిరా నేనో ఆడసక్తి అంసనురా......!
Wednesday, 12 December 2012
MINI STORY: మనిషి విలువ
మనసు:
నేను బాధపడితే నువ్వు ఏడుస్తున్నావు,
నేను సంతోషంగా వుంటే నీ కళ్ళలో ఆనందం చూస్తున్నాను.
నిన్ను నేను ఎప్పుడు తలుచుకోను....
కాని, నాప్రతి కదలికకు నువ్వే మూలంగా వున్నావు.
నీకు నాకు ఏమిటి సంబందం.
కళ్ళు:
పిచ్చి మనసా! నువ్వు నా గురించి ఆలోచించకపోతే ఏమిటి?
బందం అన్నది శాశ్వతం.
మరుపు, కోపం వీటన్నిటికి శత్రువే బంధం.
నీ ప్రతి కదలికకు నేను మూలం.
నువ్వు లేకపోతే నాకు జీవం లేదు.
అలాగే! నేను లేకుంటే నీకు మంచి, చెడులకు బేధం తెలియదు.
ఎవరి విలువలు వాళ్లకి వున్నాయి.
ఎవరు గొప్పాకాదు, ఇందులో ఎవరు తక్కువ కాదు.
Friday, 26 October 2012
love poetry: చిలిపి ప్రేమ:
చిలిపి ప్రేమ:
కొంత మంది అబ్బాయిలు ప్రేమిస్తున్నాం అని చెబితే అమ్మాయిలు ఎక్కడ కాదంటారో అని, ప్రేమిమించట్లేదు అని అంటూనే తమ ప్రేమను తెలుపుతారు. అది ఎలాగో తెలుసా?
నీదేమైన నెలవంక అందం అనుకొంటున్నావా, ఎదో! నాకళ్లకు ఒక తారలాగా కనపడ్డావు.
నీ నడక చూసే నెమలి నడవడం నేర్చుకొంది అనుకుంటున్నావా, ఏదో! తులకరి జల్లుల్లా అనిపించింది.
నీ నవ్వులో ఏమైనా పగడ కాంతులు దాగుందా, ఏదో! ముత్యపు మెరుగులా అనిపించింది.
నిన్నేమైన ప్రేమిస్తున్నాను అని నువ్వు బ్రమపడుతున్నావేమో, ఏదో నచ్చావు అంటున్నా అంతే.
Wednesday, 24 October 2012
AADAPILLA
అనుబందాలకు తొలి బందం అమ్మ.
నేను చూసిన మొదటి మోము అమ్మ.
నా జీవితపుతొలి అడుగు అమ్మ అందించిన తన చేతి చూపుడువేలు.
స్వచ్చమైన ప్రేమ మొదటిసారిగా మా అమ్మ నన్ను చూస్తూ నుదుటిపైన పెట్టిన తొలిముద్దు.
నేనున్నా అని దైర్యం చెప్పేది అమ్మ ఒడి.
కేవలం నేను ఆడపిల్లని అని, నన్ను ఈ బావాలకు దూరం చూస్తూ నీ పొత్తికడుపులోనే నాకు సమాధి కడుతున్నావా అమ్మా?
ఈ ప్రపంచానికి నేను ఏమి కాకపోవచ్చు, కాని నేను
నీ గుండె చప్పుడుతో ఊపిరి పోసుకున్న నీ రూపాన్ని అమ్మ!
నీ గుండె చప్పుడే నాకు ఊపిరి!
నీ పొత్తి కడుపే నాకు ప్రపంచం!
అలాంటిది నీరూపు చూడకుండా నన్ను ఎలా కన్ను ముయమంటావు అమ్మా!
నీ ఆలోచనలలోనూ నేను వున్నాను.
నన్ను చంపాలి అని నువ్వు అనుకొన్నప్పుడే నేను నిజంగా చనిపోయాను.
నువ్వు బుజ్జగించి తినిపించే పాల బువ్వ రుచి చూడాలని వుంది.
నేను చేసే అల్లరి గురించి నువ్వు పదిమందితో చెప్పి నవ్వుకుంటుంటే వినాలని వుంది.
కాని నాకు ఇవ్వన్నీ ఎందుకు దూరం చేస్తున్నావు అమ్మా.
ఆడపిల్ల కుడా ఒక మనిషే అని నువ్వే నాకు గుర్తింపు ఇవ్వనపుడు ఈ ప్రపంచం ఎలా నన్ను ఆదరిస్తుంది అమ్మా.
Tuesday, 23 October 2012
Thursday, 13 September 2012
love failure: మరుపన్నది నా దరి లేదే
మనసంతా కొత్తగా వుందే నిను చూసాక
గతి తప్పి మతి పోతుందే నీమాటే విన్నాక
గడుసరి కళ్ళలో బందించావే నన్నే నీ వాడిగా
హలో హలో బామా ఇదే ఇదే ప్రేమ
ఇంతలో కళగా మారిందే మన తొలి పరిచయమే
మరుపన్నది నా దరి లేదే నువ్వే నా బ్రతుకయ్యావే
వీచే గాలిగ మారి నా గుండెల్లో చేరావే
తియ్యటి గురుతంటే నువ్వేనని చూపావే
కాలమా - - - - - న్యాయమా
తన జ్ఞాపకమే - - - - - చేరపకుమా
మనసంతా కొత్తగా వుందే నిను చూసాక
గతి తప్పి మతి పోతుందే నీమాటే విన్నాక
ఇంతలో కళగా మారిందే మన తొలి పరిచయమే
నా కనుచూపుల సైగలు వెతుకుతు వుందే నిన్నే
దగ్గర చేరే మార్గం తెలియక మతి పోతుందే
నీ మనసుకు నే బానిసనే తెలుసుకో
మరు జన్మకైనా నీ దగ్గర చేరే మార్గం చూస్తానే-------
బందమా ------- విడదీయకుమా
నేరమే----------- మాది కాదుమా
మనసంతా కొత్తగా వుందే నిను చూసాక
గతి తప్పి మతి పోతుందే నీమాటే విన్నాక
ఇంతలో కళగా మారిందే మన తొలి పరిచయమే
Subscribe to:
Posts (Atom)






