పల్లవి
రక్కసి మూకల బాటల్లో అడుగే వేయకు 'ఓ' నేస్తం
తరతరాలు మారిన మన బ్రతుకు బాట మారేనా
ఏమిటి ఏమిటి ఈ దేశం?
మారణ కండగా మారెను మన సమాజం.
రక్కసి మూకల బాటల్లో అడుగే వేయకు 'ఓ' నేస్తం
తరతరాలు మారిన మన బ్రతుకు బాట మారేనా
చరణం 1
రాజకీయానికి రెక్కలొచ్చెరా
న్యాయానికి తుప్పు పట్టి మరుగున పడెరా
ఏమిటి ఏమిటి ఈ దేశం?
మారణ కండగా మారెను మన సమాజం.
ధగ ధగ మండే ఎర్రటి సూర్యుడా -----మార్చారా యువతరాన్ని
కదిలే కాలంలో -----మహనీయుల చరిత 'ఓ' నిమిషంలా మరినదే
రక్కసి మూకల బాటల్లో అడుగే వేయకు 'ఓ' నేస్తం
తరతరాలు మారిన మన బ్రతుకు బాట మారేనా
వచనం
మొదలు పెట్టు మొదలు పెట్టు నీ నుంచే మొదలపెట్టు ఈ రావణ రాజ్యంలో పురుగుల వేట. తగల పెట్టు తగల పెట్టు విలాసం అంటూ యువతరం వెళ్ళే చెడ్డ దారి తగలపెట్టు. ఎవరో వస్తారు
ఏదో చేస్తారు అని సామెతలా మారిన మాట మరవరా! మారరా నీవే ఓ జ్యోతిల చీకటి పొరల్లోంచి వచ్చే మెరుపులా.
ఏమిటి ఏమిటి ఈ దేశం?-------------------
చరణం-2
పెళ పెళ మంటూ ఆ ఉరుమే నీ మాటకు సాయం చేస్తోందే
ఆ భగ భగ మండే నిప్పే నీ దారిలో తోడై నీ వెంటే వస్తోందే
జాతి, మతము ఏంటంటు వాటికి రూపం లేదంటూ
చాటారా ఎలుగెత్తి చెప్పరా విజయం నీ వెంటే వుందిరా
బయం అన్నది దిగులు అన్నది నీ శత్రువులేర
వెనకడుగే వేయకు మారరా నీవే ఓ తుఫానులా………..
రక్కసి మూకల బాటల్లో అడుగే వేయకు 'ఓ' నేస్తం
తరతరాలు మారిన మన బ్రతుకు బాట మారేనా
ఏమిటి ఏమిటి ఈ దేశం?
మారణ కండగా మారెను మన సమాజం.

No comments:
Post a Comment