Monday, 16 April 2012

love song:ఎగిరే చేపపిల్ల నేను

ఈ సీనరికి పాట రాస్తే బాగుంటుంది అని అనిపించి రాసాను.
పల్లవి
ఎగిరే చేపపిల్ల నేను
గాలం వేసి చేతపట్టినావు.........
ఏదో మత్తు జల్లినావు
మాయచేసి బొమ్మనే చేసావు......... 
స్వీచ్చా కడలి తీరంలో
నీ చేత చిక్కినాను.............

ఎగిరే చేపపిల్ల నేను
గాలం వేసి చేతపట్టినావు.........

చరణం-1
first look-ku లోనే
నా మనసు దోచినావు......
parrot-tu ముక్కుకే నీ పెదవి
competition అయ్యేట్టుందే సఖీ....... 
అందాల నీ చిలిపి కళ్ళకే పిల్లా
ముత్యాలతో దిష్టి తీయనా baby .....
octopus-ke లేదే 
నీ ఒంటిలోన పొగరే గులికా.........

ఏదో మత్తు జల్లినావు
మాయచేసి బొమ్మనే చేసావు......... 

ఎగిరే చేపపిల్ల నేను
గాలం వేసి చేతపట్టినావు.........

చరణం - 2
ఎటు కదలలేకపోతున్నా 
నీ కౌగిలే నాకు జైలుగా.......
నా lip-pe మాట మరిచిందే
నీ kiss-se రుచి చూసాకా.............
వట్టి పొగరుబోతు నేను
నీ love నన్ను touch చేయకముందు............
నిన్ను వదిలి వుండలేనే 
నీ చేత చిక్కినాను.............

ఎగిరే చేపపిల్ల నేను
గాలం వేసి చేతపట్టినావు.........
ఎగిరే చేపపిల్ల నేను
గాలం వేసి చేతపట్టినావు.........











Thursday, 5 April 2012

emotional poetry:

పువ్వు తన రేకులతో ఇలా చెబుతున్నది:

నువ్వు నా జీవితపు చివరి క్షణం వరకు తోడురావు.
ఏదో ఒక రోజు నువ్వు నన్ను వదిలి వేల్లిపోతావు అని తెలుసు.
ఒక్కసారిగా నువ్వు నా నుండి దూరం కావు.
మెల్లగా, మెల్లగా నా శ్వాసను ఆపుతూ దూరం అవుతావు.
అది ఎలాగో తెలుసా?
నా శరీర బాగంలో కలిసిన నువ్వు,
నా నుండి ఒక్కోరేకుగా విడిపోతున్నప్పుడు,
నేను ఎంత వేదన పడుతున్నానో నీకు తెలుసా?
ఆ భాదను చెప్పడానికి మౌన బావాన్నే ఎంచుకున్నాను.
ఎందుకంటే బాధ అనుబవిమ్చే వారికే తెలుస్తుంది ఆ నరకం.
మాటలకు అందనిది ఆ చేదు క్షణాలు.
అయినా! నువ్వంటే నాకు ప్రాణం.
నువ్వు నాతొ ఉన్నంతవరకు ప్రతిక్షణం నాకు సంతోషం.
నువ్వు నానుండి విడిపోయిన వెంటనే నా జీవితము అంతమే.
నువ్వు ఎప్పటికి నాతొ వుండాలని ఆ దేవుడిని వరం అడిగాను.
అందుకు ఆ దేవుడు నాతో ఇలా అన్నాడు.
నేను బందాలు ఇస్తాను కాని అవి శాశ్వతంగా ఇవ్వను.
అలా ఇస్తే బందాల విలువ మరిచిపోతారు అన్నాడు.....
అది నిజమే నువ్వు ఉన్నంతవరకు నీ విలువ తెలియలేదు.
నువ్వు నానుండి దూరం అయిన తరువాతే నీ విలువ నాకు తెలిసింది.

Wednesday, 4 April 2012

నా దేశం పాట

పల్లవి 
రక్కసి మూకల బాటల్లో అడుగే  వేయకు  'ఓ' నేస్తం          
తరతరాలు మారిన మన బ్రతుకు బాట మారేనా
ఏమిటి ఏమిటి ఈ దేశం?
మారణ కండగా మారెను మన సమాజం.              

రక్కసి మూకల బాటల్లో అడుగే  వేయకు  'ఓ' నేస్తం          
తరతరాలు మారిన మన బ్రతుకు బాట మారేనా

చరణం 1
 రాజకీయానికి రెక్కలొచ్చెరా
న్యాయానికి తుప్పు పట్టి మరుగున పడెరా
ఏమిటి ఏమిటి ఈ దేశం?
మారణ కండగా మారెను మన సమాజం.  
ధగ ధగ మండే ఎర్రటి సూర్యుడా -----మార్చారా యువతరాన్ని
కదిలే కాలంలో -----మహనీయుల చరిత 'ఓ' నిమిషంలా మరినదే

రక్కసి మూకల బాటల్లో అడుగే  వేయకు  'ఓ' నేస్తం          
తరతరాలు మారిన మన బ్రతుకు బాట మారేనా
                                                                                                                        
 వచనం 
మొదలు పెట్టు మొదలు పెట్టు నీ నుంచే మొదలపెట్టు ఈ రావణ రాజ్యంలో పురుగుల వేట. తగల పెట్టు తగల పెట్టు విలాసం అంటూ యువతరం వెళ్ళే చెడ్డ దారి తగలపెట్టు. ఎవరో వస్తారు
ఏదో చేస్తారు అని సామెతలా మారిన మాట మరవరా! మారరా నీవే ఓ జ్యోతిల చీకటి పొరల్లోంచి వచ్చే మెరుపులా.
ఏమిటి ఏమిటి ఈ దేశం?-------------------


చరణం-2
పెళ పెళ మంటూ ఆ ఉరుమే  నీ మాటకు సాయం చేస్తోందే
ఆ భగ భగ మండే నిప్పే నీ దారిలో తోడై నీ వెంటే వస్తోందే
జాతి, మతము ఏంటంటు వాటికి రూపం లేదంటూ
చాటారా ఎలుగెత్తి చెప్పరా విజయం నీ వెంటే వుందిరా
బయం అన్నది దిగులు అన్నది నీ శత్రువులేర
వెనకడుగే వేయకు మారరా నీవే ఓ తుఫానులా………..

రక్కసి మూకల బాటల్లో అడుగే  వేయకు  'ఓ' నేస్తం          
తరతరాలు మారిన మన బ్రతుకు బాట మారేనా
ఏమిటి ఏమిటి ఈ దేశం?
మారణ కండగా మారెను మన సమాజం.   

Monday, 2 April 2012

జోల పాట

తల్లి  పాడే జోల పాటకు గాలి సైతం గొంతు కలుపుతుంది. ఎందుకంటే తల్లి పాటలో ప్రేమా, ఆప్యాయతల అనురాగం ఉంటుంది. ఆ జోలపాటే చిరు తునక నా ఈ పాట..........!

పల్లవి
వెన్నెలా వెన్నెలా రావే
మా పాపకు జోల పాడవే
తారా నువ్వలా వెలగకే
మా పాపా నిదురపోని

వెన్నెలా వెన్నెలా రావే
మా పాపకు జోల పాడవే

చరణం - 1

ఓ పిల్లగాలి అల్లరేం చేయకే
నువ్వు మెల్లగా చెంతకు చేరవేమే
చందమామ నిన్ను చూసి మబ్బు చాటుపోయేనే
నీతో దోబూచులాడాలని
చల్లగాలికి నాట్యం చేస్తూ నీరు
నీ జోలపాటకు  తాళం వేస్తోంది
 వెన్నెలా వెన్నెలా రావే
మా పాపకు జోల పాడవే
తారా నువ్వలా వెలగకే
మా పాపా నిదురపోని
చరణం - 2
అమ్మ అన్న పిలుపుతో నింగినంటినానే
నీ కిల కిల నవ్వులో నా ప్రాణమే దాచానే
ప్రేమతో చేసిన నా ఒడే ఊయల
నీ కంటికే రెప్పలా మారి నిన్ను నిద్రపుచ్చనా
వెన్నెలా వెన్నెలా రావే
మా పాపకు జోల పాడవే
తారా నువ్వలా వెలగకే
మా పాపా నిదురపోని

డ్యు యట్ పాట-1

పల్లవి
అబ్బాయి : ముత్యమా ముత్యమా నీటిలోన నాట్యమా
అమ్మాయి: తగదుమా నేస్తమా మాటలోన మౌనమే
అబ్బాయి : దాచుకోకు అందమే నీలోన ముత్యమా
అమ్మాయి: చూడాలి నీ సొగసే మరల మరల నేస్తమా
అబ్బాయి : ముత్యమా ముత్యమా నీటిలోన నాట్యమా
అమ్మాయి: తగదుమా నేస్తమా మాటలోన మౌనమే
చరణం- 1
అబ్బాయి : సిగ్గు కాస్త దాచావు నీ పెదవిపైన
అమ్మాయి: అందులో అమృతమే  దాగుంది అందుకోవా
అబ్బాయి : నిన్ను పొందడమే వరమంటూ మురిసిపోనా
అమ్మాయి: పాలలో అద్దిన నారూపు రాదననా
అబ్బాయి : ప్రియతమా ప్రియతమా నా ప్రాణమా
అమ్మాయి: నువ్వులేని జీవితం వృధా సుమా
అబ్బాయి : ముత్యమా ముత్యమా నీటిలోన నాట్యమా
అమ్మాయి: తగదుమా నేస్తమా మాటలోన మౌనమే
చరణం - 2
అబ్బాయి : నీ మాటల్లో దాగుంది సరిగమ
అమ్మాయి: నీ పిలుపుల్లో చేరనీ ఆ మధురిమ
అబ్బాయి : నే సోగాసుల్లో నే మునకలే వేయాలిసుమా
అమ్మాయి: ఆ కొంటె అల్లరి చాలు ఇక ఆపుమా
అబ్బాయి : దాచుకొన్న అందమంతా దోచుకోనా
అమ్మాయి: దోచుకోన్నధంతా దాచింది నీకోసమేరా
అబ్బాయి : ముత్యమా ముత్యమా నీటిలోన నాట్యమా
అమ్మాయి: తగదుమా నేస్తమా మాటలోన మౌనమే
అబ్బాయి : దాచుకోకు అందమే నీలోన ముత్యమా
అమ్మాయి: చూడాలి నీ సొగసే మరల మరల నేస్తమా

Tuesday, 20 March 2012

అమ్మకాల బొమ్మని

అమ్మకాల నడుమ నలిగే ప్రాణమున్న రాతి బొమ్మని,
భరించేవాడు వెలకడుతుంటే,
కన్నవాళ్ళు ఆ ధర చెల్లిస్తున్నారు,
ఏమాత్రం ఇది న్యాయం?
నిజానికి, నీతికి వున్న తేడా చెప్పిన పెద్ద వాళ్ళే,
ఇది పాపం అని తెలిసిన నాకు ధర చెల్లిస్తున్నారు.
నన్ను కట్టుకోబోయే వాడు ఇనుప ముక్కలతో చేసిన ముళ్ళతో నా మనసు చంపేస్తున్నాడు,
కట్నం పేరుతో తనను తాను వంచించుకొంటున్నాడు.
ఎక్కడ పుట్టింది ఈ దురాచారం?
ఎందుకు మన దేశానికి పట్టుకొమ్మ అయ్యింది.
ఉన్నవారి దగ్గరనుండి లేనివారు అనే భేదం లేకుండా అందరికి నట్టిల్లయ్యింది.
మన శరీరానికి చిన్న వ్యాధి వస్తేనే బాగుచేయడానికి నానా రకాలుగా  ప్రయత్నిస్తాం------
మరి మనసు మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం.
మరి మనసుకు పట్టిన వ్యాధిని తొలగించలేమ......?
ఇది చాలా మహమ్మారి,
 ఈ వ్యాదికి బలైన వారు ఎదుటి వారి ప్రాణాలు సునాయాసంగా తీయగాలుగుతున్నారు.
భారతీయుడా ఈ మహమ్మారిని మన దేశం నుండి తరిమి కొడదాం.
దయ చేసి సహకరించండి.

అమ్మ ప్రేమ------------

పోదున్నే తన చిరునవ్వుతో నాకు సుబోధయం చెబుతుంది.
నాకేం కావాలో నేను నిద్దుర లేవక ముందే అన్నీ నాకు సమకూరుస్తుంది.
ప్రేమగా నాకు స్నానం చేపించి సుబ్రత గురించి నేర్పుతుంది.
శ్రమ అనుకోకుండా తోటివారితో నేను ఎలా మెలగాలో ప్రతి రోజు చెబుతుంది.
బడి నుండి ఇంటికి వచ్చేసరికి నాకోసం గుమ్మం ముందే వేచి వుంటుంది.
అమ్మని చూడగానే పరుపరుగున వచ్చి అమ్మ వెచ్చని గుండెపై వాలిపోతాను.
అమ్మ అమాంతం నన్ను అలాగే ఎత్తుకొని ఇంటిలోపలికి తీసుకెళ్ళి,
నాకు కథలు చెప్తూ గోరుముద్దలు తినిపిస్తుంది.
సరస్వతి దేవిలా నాకు చదువు చెబుతుంది.
చీకటి పడిన వేల తన నవ్వులో వెలుగు నింపి, 
ప్రేమతో నా తలపై తన చేయిపెట్టి నిమురుతూ  నన్ను నిద్రపుచ్చుతుంది.
ఇది మనకు తెలుసు ఎందుకంటే మనము అమ్మ ప్రేమను చవిచూసాము...............!
కాని పాపం అనాదాస్రమంలో అభం శుభం తెలియని పసిపిల్లకు ఇవి కధలుగానే తెలుసు.
మనకున్న సమయంలో ఎంతో కొంత క్షణాలను వారికోసం నియమిద్దాం.
మనలో వున్న మానవత్వాన్ని నిద్రపోనీయకండి.
దయచేసి మేల్కొలపండి.