Tuesday, 25 October 2011

గ్రూప్ సాంగ్: intimation ఇవ్వదండి






పల్లవి 
బాయ్స్: intimation   ఇవ్వదండి 
calculation   వుండదండి 
monthu datu   తప్పు ఒప్పు 
ఏమి చూడదండి happiness
 
 
అమ్మాయిలు :
నా వెనుకే follow  అయ్యి  
నా నీడలో  join  అయ్యి 
నాలో నువ్వు నీలో నేను
ఏకం అంటుంది మా స్నేహం 
 
 

చరణం - 1 

అబ్బాయిలు: చేయి చేయి కలుపుతూ 
                     దోస్తుకు మేం దాస్సోహం అంటుంది 
అమ్మాయిలు : మనస్సులో దాగిన మర్మం 
                        చెప్పకనే తెలుసుకుంటుంది మా చెలిమే 
అబ్బాయిలు : కన్నీరే నాది అంటూ కళ్ళల్లో నీరు తుడిచి
                      frendship  లో  smile   కే   చోటివ్వమంతుంది 
అమ్మాయిలు : fighting  కి తావుంది  joke లకి  place వుంది 
                       విదిపోవడమంటే ఎంటో  ఏంటో  తెలియదులే మాకే ఓ నేస్తం 
 
బాయ్స్: intimation   ఇవ్వదండి 
calculation   వుండదండి 
monthu datu   తప్పు ఒప్పు 
ఏమి చూడదండి happiness
 
 
అమ్మాయిలు :
నా వెనుకే follow  అయ్యి  
నా నీడలో  join  అయ్యి 
నాలో నువ్వు నీలో నేను
ఏకం అంటుంది మా స్నేహం 
 
 
 
చరణం - 2 
 అబ్బాయిలు : youthలో వున్నా power 
                       తెలియచేప్పలె ప్రతి ఒక్కరికి
అమ్మాయిలు : మనం చేసే అల్లరి అందరికి 
                        గురతుఉండాలే  అందరికి 
 అబ్బాయిలు :మనలో వున్నా enjoyment 
                        అదే మనకు వున్నా attachment
అమ్మాయిలు : చెలిమి దైర్యం కావాలండి
                        మాతో పోటీకే సిద్ధం కావాలంటే మీకు 
 
 
బాయ్స్: intimation   ఇవ్వదండి 
calculation   వుండదండి 
monthu datu   తప్పు ఒప్పు 
ఏమి చూడదండి happiness
 
 
అమ్మాయిలు :
నా వెనుకే follow  అయ్యి  
నా నీడలో  join  అయ్యి 
నాలో నువ్వు నీలో నేను
ఏకం అంటుంది మా స్నేహం

మెలోడి సాంగ్- అలజడిలా మారనా






పల్లవి 
అబ్బాయి :  అలజడిలా మారనా 
                 నీలో అసె రేపనా 
అమ్మాయి: ఆ ఆశనే అపోద్దురా
                 ఇంకొంచం శ్రుతి పెంచరా 
అబ్బాయి : వచ్చాక అడ్డే చెప్పొద్దులే 
                 నీ మనసంతా అల్లుకుంటానులే
అమ్మాయి : నీ అల్లరికి అల్లాలు తోడయ్యేగా
                ఇక ఏ మాత్రం నే వుండలేనుగా 
 
అబ్బాయి :  అలజడిలా మారనా 
                 నీలో అసె రేపనా 
అమ్మాయి: ఆ ఆశనే అపోద్దురా
                 ఇంకొంచం శ్రుతి పెంచరా 
 
 
చరణం - 1 
అబ్బాయి :  కళై నిన్ను చేరుకోనా 
                  కలతల్లోను తోడుండనా 
అమ్మాయి : విడిపోలేము ఏ నాటికి 
                 నువ్వు నేను ఒక్కటేనుగా
అబ్బాయి  :  హరివిల్లై నిను చేరనా  
                  నీ చిరునవ్వే నేనవ్వనా 
అమ్మాయి :  నీ గుండెల్లో సడి అవ్వనా 
                  నా ఏడు జన్మలు నీదననా
అబ్బాయి  : గుర్తుండి పోయేలా మన ప్రేమకు 
                 ఇవ్వనా ఓ ఒక తీపి గుర్తు 
అమ్మాయి :  మేఘమై నను తాకరా 
                  సిగ్గు తెరే తొలగించరా 
                 
               
  
అబ్బాయి :  అలజడిలా మారనా 
                 నీలో అసె రేపనా 
అమ్మాయి: ఆ ఆశనే అపోద్దురా
                 ఇంకొంచం శ్రుతి పెంచరా 
 

 చరణం - 2 

అబ్బాయి :  నీ శ్వాసలో ఏదో స్వరం
                 లాగుతోందే నీ పక్కకే 
అమ్మాయి: ఇంకా ఎందుకు ఏకాంతము 
                 కరిగించేయి నన్ను మంచులా 
అబ్బాయి :   జిల్లంటూ ఈ వేళ ఏదో 
                 తిమ్మిరిగా వుందే నాలో 
అమ్మాయి:   ఆ అల్లరి ఎందుకో 
                 నాకే అది తెలుసులే 
 
అబ్బాయి :  అలజడిలా మారనా 
                 నీలో అసె రేపనా 
అమ్మాయి: ఆ ఆశనే అపోద్దురా
                 ఇంకొంచం శ్రుతి పెంచరా 
అబ్బాయి : వచ్చాక అడ్డే చెప్పొద్దులే 
                 నీ మనసంతా అల్లుకుంటానులే
అమ్మాయి : నీ అల్లరికి అల్లాలు తోడయ్యేగా
                ఇక ఏ మాత్రం నే వుండలేనుగా 

మెలోడి లేడీ సాంగ్: ఈ శ్వాసే నీది














లేడీ 


ఈ శ్వాసే నీది అంటూ
వున్ననులే  నీ కోసం
అల్లరి చేస్తూ నా పెదవే
నిను తాకిందే ఏదో కావాలని
ఆ కబురులే వినాలంటూ
ఎదురు చుస్తుందే నా కౌగిలి




నీ నీడల్లే మారింది నా ఆశే
వెచ్చంగా నను తాకరా
నిదురే దూరం కావాలి మనకు
జాగారం దరి చేరాలి చెంతకు
చిగురాకు అందంలా నీవలపే
నను ఊరిస్తుంది  ఎందుకో
ఈ శ్వాసే నీది అంటూ
వున్ననులే  నీ కోసం
ఓ ముద్దే కావాలి అంటూ
నిన్నే కోరుతోంది నా పెదవే
నీ చెంతుంటే  మైమరపే
గుర్తుకు రాదే నాకు ఏ తలపే
పగలు రేయి ఒక్కటిలా అనిపిస్తుందే
నీ ఊహలలో  నేనుంటే
కలో నిజమో తెలియకుందే
నే నీతో గడిపిన ప్రతి క్షణం
నా మనసే చెబుతుంది నీతో
నా ప్రతి జన్మా నీకేనని


ఈ శ్వాసే నీది అంటూ
వున్ననులే  నీ కోసం
అల్లరి చేస్తూ నా పెదవే
నిను తాకిందే ఏదో కావాలని
ఆ కబురులే వినాలంటూ
ఎదురు చుస్తుందే నా కౌగిలి 

లవ్ ఫెయిల్ సాంగ్:where is my heart







 
పల్లవి 
where is my heart   దారే తప్పిందే 
where is my dream  గాలిలో కలిసిందే 
మన గాధే మిగిలిందే చెరిగిన కథలా 
నన్నే శిలలా చేసావే  ఓ చెలియా 
 
చరణం-1 
కలలా కరిగే నీ పరిచయమే 
తీస్తుందే ప్రియా నా ప్రాణం
చెబుతున్నా వినవే సఖియా 
జీవితమే తీయదిగా
నీతో గడిపిన ఒక్కో క్షణం 
ఆపేస్తోందే నా శ్వాస 
గడిచిన గతమంతా 
నీ చెంతే వదిలేయలేనుగా
 
where is my breath   నన్ను వదిలి వెళ్ళిందే 
where is my life  చితి మంటల్లో చేరిందే 
మన గాధే మిగిలిందే చెరిగిన కథలా 
నన్నే శిలలా చేసావే  ఓ చెలియా 

 
 
చరణం - 2 
 నీతో చేసిన సావాసం 
ఓ వరమని అంటున్నా
ఆ స్నేహమే చేదంటూ
శాపాన్నే ఇచ్చావే 
భరించలేకపోతున్నా 
ఈ వేదన తగ్గేదేలా  
 
where is my heart   దారే తప్పిందే 
where is my dream  గాలిలో కలిసిందే  
మన గాధే మిగిలిందే చెరిగిన కథలా 
నన్నే శిలలా చేసావే  ఓ చెలియా 

చరణం - 3 
నీ నీడల్లే నే మారానే 
అది నే చేసిన పాపమా 
నా కంటిపాపల  నిను చూసానే  
అది నే చేసిన మోసమా
నువ్వే నా జీవితమన్నా 
అది నే చేసిన నేరమ 
 
  
where is my breath   నన్ను వదిలి వెళ్ళిందే 
where is my life  చితి మంటల్లో చేరిందే 
మన గాధే మిగిలిందే చెరిగిన కథలా 
నన్నే శిలలా చేసావే  ఓ చెలియా 

 

ఐటం సాంగ్ : గోదారి ఈదినా





















పల్లవి:  
 లేడీ :
గోదారి ఈదినా 
గోల్కొండ చుట్టినా 
కాశ్మీరు ఎల్లినా 
నా ఒంట్లో అందాలన్నీ నింపినా
నన్ను పట్టేయి ఓ పట్టు 
వగల్లన్ని దాచినా 


చరణం- 1 
 లేడీ :
చింతకాయ పులుపే 
నా వంటిలోన వగరురా 
దానిమ్మ రుచిలే 
నా నడుములోని మడతరా
చింతామణినే మించిపోయే 
సొగసుంది నాలో చుసేయ్యరా 
చుసేయ్యరా చూసి అగద్దురా
పట్టేయిరా అ పట్టు నే చూడాలిర


గోదారి ఈదినా 
గోల్కొండ చుట్టినా 
కాశ్మీరు ఎల్లినా 
నా ఒంట్లో అందాలన్నీ నింపినా
నన్ను పట్టేయి ఓ పట్టు 
వగల్లన్ని దాచినా 

  
జెంట్స్ కోరస్ :  
చూసేయ్యరా ఓ పట్టు పట్టేయరా 
చాటు మాటు వెతకరా 
అది దాచుకొన్న సొగసు
నువ్వు దోచేయ్యరా 

 లేడీ : 
 ACలోన  ఏముంది అయస్కాంతము 
గుడిసలోన వుందిలే పిల్ల పట్టుతనం 
నా ఎనక రా రా సెమట పుట్టిస్తాను 
తిమ్మిరెక్కిన నీ ఒళ్ళు జిల్లు మనేదాక 
ఎనకెనక వచ్చిన లాబమేమి లేదురా 
తడిమి తడిమి చూడరా మలుపులన్నీ చూడరా 


 జెంట్స్ కోరస్ :
తెలిసోచ్చిందే పిల్ల తెలిసోచ్చిందే 
గుడిసేలోని సెమట రుచి తెలిసోచ్చిందే
సెంటు సోకు వద్దులే మల్లెపూలు తెత్తలే
వచ్చేస్తానే నీ వెనక వచ్చేస్తానే 
చూసేత్తనే అన్ని తడిమి తడిమి 
నాదంటు వదలకుండా చూసేత్తనే


   లేడీ : 
గోదారి ఈదినా 
గోల్కొండ చుట్టినా 
కాశ్మీరు ఎల్లినా 
నా ఒంట్లో అందాలన్నీ నింపినా
నన్ను పట్టేయి ఓ పట్టు 
వగల్లన్ని దాచినా 

చరణం- 2

లేడీ :
వెతికినా వెతికినా ఊరంతా వెతికినా
తిరిగినా తిరిగినా అన్ని చోట్లా తిరిగినా
లేదురా లేదురా ఎక్కడా లేదురా 

జెంట్స్ కోరస్ :
ఏంటెతికావు??
ఎందుకు తిరిగావు ??
ఎం లేదే -----నా బంగారు పులుసా!!!!!!!


 లేడీ :   ఆ ----------- మీలాంటి రొయ్యమీసాల రోషగాళ్ళు

Wednesday, 19 October 2011

love song: మనసు పలికే మోనం


















పల్లవి

మనసు పలికే మోనం
చూపు వెతికే చిత్రం
నీ శ్వాస తగిలిన వైనం
ఎలా తెలుపను ఆ వర్ణం
నీ చిరునవ్వు అందించే మదూరం
నీ గుండె చప్పుడు నే వినిన తరుణం
హాయి గొలిపే నీ స్నేహం
మలుపు తిరిగే సంతోషం
ఏమిటో ఇక నా గమ్యం
నేను చేరుకొనే ఈ పయనం
ఎన్నటికీ చెరగని ఈ బంధం
చేజార్చుకోలేనే ఈ సమయం


చరణం-1

ప్రేమా నీ తియ్యని పలకరింపు
అందుకొన్నానే ఈ క్షణం
చల్లటి గాలి నను తాకే ఈవేల
అదే నా చెలి స్పర్సకి నిదర్శనం
నాలో నేను ఉండనే
తాను దూరమయ్యే ఆ నిమిషం
నా కాళ్లముందు నిలిచె నీ రూపం
నేను పలికే బావాలకు ఆది సంకేతం
మనసు పలికే మోనం
చూపు వెతికే చిత్రం
నీ శ్వాస తగిలిన వైనం
ఎలా తెలుపను ఆ వర్ణం


చరణం-2

నా ప్రేమను నువు ఆహ్వానించువేల
నా గుండె చప్పుడు ఉల్లాసం
తాను నాతో వేసే ఏడుఅడుగులకు
రాసి ఇస్తానే నా జీవితం
నీ ప్రేమకై నా ప్రతిజన్మ
చేస్తాలే ఇక దాస్సోహం
ప్రేమా నా ప్రియురాలికి అందచేయి
నే తనపై రాసిన ఈ కావ్యం
మనసు పలికే మోనం
చూపు వెతికే చిత్రం
నీ శ్వాస తగిలిన వైనం
ఎలా తెలుపను ఆ వర్ణం
                                                                

దేశభక్తి గీతం: ఏ మతమూ కాదే
















దేశభక్తి గీతం నా దేశానికీ అంకితం

ఏ మతమూ కాదే 
ఏ జాతి కాదే
మనుషులంతా ఏకంఅయితే                      
ఏ బాష ఐన
అడ్డుకాదే అర్థమయ్యే
మన మానవజాతి మంచి  మనసుకే                

ఏ మతమూ కాదే 
ఏ జాతి కాదే
మనుషులంతా ఏకంఅయితే
మనం అర్హులమే కామే మన్నింపు కోరిన
తల్లి పాలు తాగి తన గుండెలపై
అగ్ని వర్షపు చినుకులనే రాల్చమే                    

ఏ మతమూ కాదే 
ఏ జాతి కాదే
మనుషులంతా ఏకంఅయితే
ప్రాంతం కోసం పాకులాడి
మన భూమాతకే నెత్తురు రుచి చుపామే                

ఏ మతమూ కాదే 
ఏ జాతి కాదే
మనుషులంతా ఏకంఅయితే
గాలికి లేదే, నీరుకు లేదే, 
వెలుగు నిచ్చే సూర్యుడికి లేదే,
అందరికీ సమమై అందుతున్నదే భేధబావం అన్నీ  వదిలి     

ఏ మతమూ కాదే 
ఏ జాతి కాదే
మనుషులంతా ఏకంఅయితే 
వికసించే పువ్వుని చూడు
దైవం ఒకటే అన్నది ఏ నాడో
ఏ దైవం పాదం చెంతకు చేరడానికైన
నే సిద్ధం అంటున్నది  చూడు                                                      

ఏ మతమూ కాదే 
ఏ జాతి కాదే
మనుషులంతా ఏకంఅయితే 
పుట్టినప్పుడు మనిషి చిరునవ్వు చూడు
పెరిగే కొద్ది ఉక్రోషాలు పొదిగిన మాటలు చూడు
చనిపొఇన నీవు ఒదిగేది
అమ్మ కమ్మని ఒడిలోకే అని గురుతు చేసుకో                                

ఏ మతమూ కాదే 
ఏ జాతి కాదే
మనుషులంతా ఏకంఅయితే