ఇన్ని రోజుల నా ఏకాంతంలో,
తెలియలేదు ఇన్ని సంగతులు.
నీ పరిచయమే నాలో ఏదో,
కొత్త ఊసులు నేర్పుతు వుందే.
ఈ వెన్నెలలో
నా మనసులో
నీ శ్వాసే కెరటంగా మారే.
చిలిపి గాయాలతో
నా పెదవిపై
నువ్వు వేసావే చెరగని ముద్రనే.
గాలుల్లో సరిగమలే విన్నా
ఆ గమకాలే హద్దులు దాటి
పరుగులు తీసే నా పరువం వైపే.
చెప్పలేని కలలే కన్నా
నాలో ఎన్నో ఊసులు దాచి
నిదురే మాయం చేసావే నా మనసుకి.
నా కంటిపాపల కౌగిలి వెనుక,
దాగావే దారి చూపు వెలుగులా.
నా జీవితమే నీదని అన్నా,
చేరుకోవా ఇక ఎప్పటికి నా వాడిలా.

swathi gaaru..prathi line,prathi word correct ga match aayidhi ee song ki.... nidhurae maayam chesaavae naa manasuku line kaeka
ReplyDelete